బాబు, రాజన్నపాలనలో... మైనార్టీల సంక్షేమం | Babu, rajanna Governance ... for the welfare of minorities | Sakshi
Sakshi News home page

బాబు, రాజన్నపాలనలో... మైనార్టీల సంక్షేమం

Published Sun, May 4 2014 1:44 AM | Last Updated on Sat, Jun 2 2018 2:08 PM

బాబు, రాజన్నపాలనలో...    మైనార్టీల  సంక్షేమం - Sakshi

బాబు, రాజన్నపాలనలో... మైనార్టీల సంక్షేమం

బాబు పాలన
 
బాబు పాలనలో మైనార్టీలకు కేవలం రూ.32 కోట్ల బడ్జెట్ కేటాయించారు. అవి కూడా చాలా వరకు అందకపోవడంతో మైనారిటీ విద్యార్థులు ఇబ్బందులకు గురయ్యేవారు.విద్యాసంస్థల్లో ఎలాంటి రిజర్వేషన్లు లేక చాలామంది చదువుకు దూరంగా ఉండేవారు. మధ్యలోనే చదువును మానేసి, బతుకుతెరువు కోసం గల్ఫ్ దేశాలకు వలస వెళ్లేవాళ్లు. దుకాన్-మకాన్ స్కీమ్ కింద చిన్న తరహా వ్యాపారం చేసుకోవడానికి రూ.5 వేల నుంచి రూ.10 వేలు, ఇళ్ల నిర్మాణానికి 3 శాతం వడ్డీతో రుణాల పంపిణీవితంతువులు, విడాకులు తీసుకున్న ముస్లిం మహిళలకు  3 శాతం వడ్డీతో రూ.పది వేల రుణాలు.ష్నీ పథకం ద్వారా వృత్తి పనివారికి 20 శాతం సబ్సిడీతో బ్యాంకు రుణాలు, పేద మహిళలకు వంట గ్యాస్ సిలిండర్ల పంపిణీ మైనార్టీ పేద అమ్మాయిల వివాహాలకు నామమాత్రపు ఆర్థికసాయం చేసేవారు.  
 
 రాజన్న రాజ్యం

 ళీ    మైనారిటీల బడ్జెట్‌ను రూ. 350 కోట్లకు పెంచారు.
 ళీ    పేద ముస్లింలకు రుణ మాఫీ చేశారు.
 ళీ    ఆర్థికంగా వెనుకబడిన ముస్లింలకు రూ.30 వేల చొప్పున సబ్సిడీ రుణాలు ఇచ్చారు.
 ళీ    డోమువా పథకం ద్వారా నగరాల్లో, పట్టణాల్లో నివసించే పేద ముస్లిం మహిళలకు సబ్సిడీ రుణాలు
 ళీ    నేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనార్టీస్ పథకం ద్వారా ముస్లిం పిల్లలకు విద్యా రుణాలు
 ళీ    స్కాలర్‌షిప్ పథకం ద్వారా ప్రతి ఏటా 3 లక్షల మంది ముస్లిం పిల్లలు విద్యావంతులయ్యారు.
 ళీ    ముస్లింలు విద్య, ఉపాధి రంగాల్లో అభివృద్ధి చెందడానికి 4 శాతం  రిజర్వేషన్ల కల్పన. దీనివల్ల లక్షల మంది విద్య, ఉపాధి రంగాల్లో  రాణించారు.  వారి ఆర్థిక స్థితిగతులు మెరుగుపడ్డాయి. ఎన్నో కుటుంబాలు దారిద్య్ర రేఖ నుంచి పైకి ఎదిగాయి.
 ళీ    పేద ముస్లిం అమ్మాయిల కోసం మాస్ మ్యారేజెస్ (సామూహిక వివాహాల) పథకాన్ని ప్రవేశ పెట్టారు.
 ళీ    కుటుంబ వార్షికాదాయం రూ. 80 వేల కంటే తక్కువగా ఉన్నవారికి మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రూ.30 వేల నుంచి రూ.లక్ష  వరకు సబ్సిడీ రుణాల పంపిణీ
 ళీ    దీపం పథకం ద్వారా ముస్లిం మహిళలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు
 ళీ    రాష్ట్రంలోని 15 జిల్లాల్లో రెండో అధికార భాషగా ఉర్దూను అమలు కోసం రాష్ట్ర ఉర్దూ అకాడమీ ద్వారా ప్రత్యేక నిధులు కేటాయించారు.
 ళీ    మధ్యలో చదువు ఆపేసిన పిల్లల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 100కు పైగా ఓపెన్ స్కూల్స్ ఏర్పాటు.
 ళీ    మదరసాల్లో చదివే విద్యార్థుల కోసం కంప్యూటర్ల ఏర్పాటు
 ళీ    యువతకు ఐటీ, వృత్తి కోర్సుల్లో శిక్షణ ఇచ్చి కంపెనీల్లో ఉద్యోగాల కల్పన.
 
 జగన్ సంకల్పం

 వైఎస్సార్ హయాంలో ప్రవేశపెట్టిన అన్ని మైనార్టీ పథకాలనూ నూతనంగా ఏర్పడబోయే రాష్ట్రంలో కూడా కొనసాగిస్తాం. నాలుగు శాతం ముస్లిం రిజర్వేషన్, స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్, మాస్ మ్యారేజెస్, ఉర్దూ భాషాభివృద్ధి, ఉర్దూ మీడియం స్కూళ్లలో వసతులు, ఉర్దూ టీచర్ల నియామకం, ఉర్దూ అకాడమీకి మరిన్ని నిధులు, మైనారిటీ విద్యాసంస్థలకు గ్రాంట్ ఇన్ ఎయిడ్, పవిత్ర  హజ్ యాత్రలో సబ్సిడీ, వక్ఫ్ భూముల పరిరక్షణ చట్టం, అర్హులైన అందరికీ గృహనిర్మాణాలు మొదలైనవన్నిటినీ అమలుచేస్తాం. మతపరమైన దాడులు జరగకుండా చట్టాలను కఠినతరం చేస్తాం. ముస్లింల కోసం ప్రస్తుతమున్న బడ్జెట్‌ను పెంచుతాం. ముస్లిం అమ్మాయిలకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యతో పాటు సైకిళ్లు, యూనిఫామ్‌లను అందిస్తాం. మధ్యలో చదువు మానేసిన ముస్లిం విద్యార్థుల కోసం, అమ్మాయిలకు వృత్తి విద్యలో శిక్షణ ఇచ్చి స్వయం ఉపాధి కల్పిస్తాం. నిరుద్యోగ యువతకు రూ. 5 లక్షల వరకు వడ్డీ రుణాలు ఇస్తాం. మసీదుల నిర్మాణం, మరమ్మతుల కోసం ఆర్థిక సహాయాన్ని అందిస్తాం. ప్రభుత్వంలోని ప్రతి సంక్షేమ పథకంలో ముస్లిం జనాభా ప్రతిపాదికన వాటా కల్పిస్తాం. పేద ముస్లిం అమ్మాయిల వివాహం కోసం ఒక అన్నయ్యలా వారి నిఖా సందర్భంగా 50 వేల రూపాయలను కానుకగా అందించి అర్థికంగా అదుకుంటా. మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్‌ను పటిష్ఠపరిచి తద్వారా చిన్న తరహా వ్యాపారులకు రుణాలు అందేలా చేస్తాం.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement