welfare of minorities
-
రెండో అధికారిక భాషగా ఉర్దూ
సాక్షి, అమరావతి: మైనార్టీల సంక్షేమం, ఉర్దూ భాషాభివృద్ధికి పెద్దపీట వేస్తూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండు కీలక బిల్లులకు రాష్ట్ర అసెంబ్లీ బుధవారం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ఉర్దూను రెండో అధికారిక భాషగా గుర్తిస్తూ అధికార భాషల చట్ట సవరణ–2022 బిల్లును, కొత్తగా మైనార్టీల ప్రత్యేక అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ మైనార్టీస్ కాంపోనెంట్, ఆర్థిక వనరులు, వ్యయ కేటాయింపులు, వినియోగ చట్టం–2022 బిల్లును డిప్యూటీ సీఎం అంజాద్ బాష ప్రతిపాదించారు. ఈ బిల్లులను సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం అంజాద్ బాష మాట్లాడుతూ.. ఉర్దూ ఒక మతానికి సంబంధించిన భాష కాదని, నిఖార్సయిన భారతీయ భాష అని చెప్పారు. సీఎం జగన్మోహన్రెడ్డి ఉర్దూకు తెలుగుతో సమాన హోదాను కల్పించడంతో ప్రతి మైనార్టీ ఆనందం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ఇక ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ‘ఆంధ్రప్రదేశ్ మైనార్టీస్ కాంపోనెంట్ మరియు ఆర్థిక వనరులు, వ్యయ కేటాయింపులు మరియు వినియోగ చట్టం–2022’ బిల్లుతో వచ్చే 10 ఏళ్లలో అల్ప సంఖ్యాక వర్గాలకు భద్రత, సామాజిక హోదాతో పాటు సమధర్మాన్ని పాటించేందుకు వీలుంటుందని అంజాద్ బాషా చెప్పారు. ఆర్థిక, విద్య, మానవ వనరుల అభివృద్ధి విషయాల్లో ఆయా వర్గాలు మరింత అభివృద్ధి చెందుతాయని తెలిపారు. ఈ మూడేళ్లలో ఇది చారిత్రక సెషన్ అని కర్నూలు ఎమ్మెల్యే అబ్దుల్ హఫీజ్ చెప్పారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లులకు మద్దతు తెలుపుతూ ఆయన మాట్లాడారు. ఉర్దూకు అరుదైన గౌరవం రాష్ట్రంలో రెండో అధికారిక భాషగా ఉర్దూకు అరుదైన గౌవరం లభించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 15 జిల్లాల్లో ఉర్దూ రెండో అధికారిక భాషగా కొనసాగింది. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ ప్రభుత్వం ఉర్దూకు రెండో అధికారిక భాషగా చట్టబద్ధత కల్పించింది. గత టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లూ దానిని పూర్తిగా విస్మరించింది. మైనార్టీలు, ఉర్దూ ప్రేమికుల ఆవేదనను గుర్తించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో రెండో అధికార భాషగా ఉర్దూకు స్థానం కల్పించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అధికార కార్యకలాపాలు, ఉత్తర ప్రత్యుత్తరాలను తెలుగుతో పాటు ఉర్దూలోనూ సాగించేలా సమాన హోదా కల్పించినట్టయింది. రాష్ట్రంలో 32.45 లక్షల మందికి ఉర్దూ మాతృభాషగా ఉంది. ఉర్దూ మాట్లాడే ప్రజలు వైఎస్సార్ కడపలో 19 శాతం, గుంటూరులో 15.55 శాతం, చిత్తూరు 13.16 శాతం, అనంతపురంలో 12.91, కర్నూలు 11.55, కృష్ణాలో 8.42 శాతం, ప్రకాశంలో 5.65 శాతం, నెల్లూరులో 7.84 శాతం ఉన్నారు. మిగిలిన జిల్లాల్లోనూ సుమరు రెండు శాతం ఉర్దూ మాట్లాడే ప్రజలున్నారు. -
మైనారిటీలకు మస్తు ప్రయార్టీ.. రెండేళ్లలో రూ.6,000 కోట్లు
సాక్షి, అమరావతి: రెండేళ్లలో వివిధ పథకాల ద్వారా రూ.6 వేల కోట్లకుపైగా లబ్ధి చేకూర్చి మైనారిటీల సంక్షేమం పట్ల సీఎం వైఎస్ జగన్ తన చిత్తశుద్ధిని నిరూపించుకున్నారు. నవరత్నాల ద్వారా భారీగా ఆర్థిక సాయం అందించారు. గత సర్కారు మైనారిటీల సంక్షేమాన్ని విస్మరించి తోఫాల పేరుతో మభ్యపుచ్చి ఓటు బ్యాంకు కోణంలోనే చూసింది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అలాంటి గిమ్మిక్కులకు దూరంగా మైనారిటీలను పేదరికం నుంచి బయటకు తీసుకురావడమే ధ్యేయంగా నవరత్నాల ఫలాలను అందచేస్తోంది. నాడు ఒక్కరూ లేరు..నేడు డిప్యూటీ సీఎం పదవి టీడీపీ హయాంలో చంద్రబాబు తన మంత్రివర్గంలో ఒక్క మైనారిటీకి కూడా చోటు కల్పించలేదు. ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగంగా ఎన్నికలకు ఆరు నెలల ముందు మాత్రమే ఫరూక్‌ను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. సీఎం జగన్ ప్రభుత్వం మైనారిటీకి ఉప ముఖ్యమంత్రి పదవితో సముచిత స్థానం కల్పించింది. రెండేళ్లలోనే నవరత్నాల ద్వారా 26.06 లక్షల మందికిపైగా మైనారిటీలకు రూ.6,009.38 కోట్ల మేర ఆర్ధిక సాయం అందించారు. ఇందులో 19.88 లక్షల మందికి నేరుగా రూ.3,374.24 కోట్లు నగదు బదిలీతో ప్రయోజనం చేకూర్చారు. నగదేతర బదిలీ పథకాల ద్వారా 6.17 లక్షల మందికి లబ్ధి కలిగింది. ఇక చంద్రబాబు హయాంలో మైనారిటీలకు బ్యాంకు రుణాలే దిక్కు కాగా అది కూడా సిఫార్సుల మేరకే సబ్సిడీ, రుణాలు మంజూరయ్యేవి. ఇప్పుడు ఎవరి సిఫార్సులతోనూ పనిలేకుండా అర్హులందరికీ నవరత్నాల ఫలాలు ముంగిట్లోనే అందుతున్నాయి. ఇలా సాధ్యమైంది... వివక్ష, సిఫార్సులకు తావులేకుండా అర్హులందరికీ నవరత్నాలు ఫలాలు అందించడమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వైఎస్సార్ నవశకం ఇంటింటి సర్వే ద్వారా అర్హులను గుర్తించింది. రాజకీయ జోక్యం, లంచాలతో ప్రమేయం లేకుండా అర్హులైన మైనారిటీలందరికీ నవరత్నాల ప్రయోజనం దక్కింది. -
మైనారిటీల సంక్షేమం తూచ్
చిత్తూరు ఎడ్యుకేషన్: జిల్లాలోని మైనారిటీలు సమస్యలతో సతమతమవుతున్నారు. సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియక తల్లడిల్లుతున్నారు. పిల్లలను ఉన్నత చదువులు చదివించుకోలేక కూలిపనులకు తీసుకెళ్తున్నట్లు పలువురు ఆవేదన చెందుతున్నారు. జిల్లాలోని మైనారిటీల అభ్యున్నతికి టీడీపీ ప్రభుత్వం తూట్లు పొడుస్తోంది. మైనారిటీ విద్యార్థులు 15 దేశాల్లో ఉన్నతవిద్య అభ్యసించేందుకు ఓవర్సీస్ విద్యానిధి పథకాన్ని ప్రారంభించారు. ఆ పథకానికి దరఖాస్తు చేసుకునే విద్యార్థులకు రూ.10 లక్షల ఉపకార వేతనాన్ని మంజూరు చేయాల్సి ఉంది. ఆ పథకంలో 2016–17లో ఒకరు, 2017–18లో10 మంది దరఖాస్తు చేసుకోగా వారికి ఇప్పటి వరకు స్కాలర్షిప్లు ఇవ్వలేదు. దుల్హాన్ పథకంలో వెనుకబడిన ముస్లిం బాలికల వివాహం కోసం ఆర్థిక సహాయానికి గత ఏడాది 768 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారికి ఇప్పటి వరకు నిధులు లేవు. ప్రస్తుతం ఆ పథకానికి చంద్రన్న పెళ్లికానుకగా పేరు మార్చారు. అవగాహన లేక చాలామంది దరఖాస్తు చేసుకోలేకపోతున్నారు. పైగా డీఆర్డీఏకు చంద్రన్నపెళ్లి కానుక బాధ్యతలు అప్పజెప్పడం ఏమిటనే విమర్శలు గుప్పుమంటున్నాయి. జిల్లా వ్యాప్తంగా 2,700 మంది విద్యార్థులు ప్రీమెట్రిక్ స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తు చేసుకోగా వారికి గత ఏడాది నుంచి నిధులు ఇవ్వడం లేదు. బ్యాంక్లింక్ సబ్సిడీ పథకంలో స్వయం ఉపాధి రుణాలకు 556 మంది దరఖాస్తు చేసుకోగా అందులో 13 మందికి మాత్రం సబ్సిడీ ఇచ్చారు. ఇవేకాదు.. ఇలా చెప్పుకుంటూ పోతే మైనారిటీల సమస్యలు కోకొల్లలు. దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు టీడీపీ ప్రభుత్వానికి మైనారిటీలపై ఏ మాత్రం చిత్తశుద్ధి ఉందో. ఆత్మీయ సభ పేరుతో మళ్లీ మాయ.. గత ఎన్నికలకు ముందు చేసిన మాయ చాలదంటూ.. ఇప్పుడు మళ్లీ సీఎం చంద్రబాబునాయుడు కొత్త ఎత్తులు వేస్తున్నారు. ఎన్నికలు దగ్గరకొస్తున్న తరుణంలో ముస్లింల ఓట్లు కొల్లగొట్టేందుకు పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా మంగళవారం గుంటూరులో లక్ష మంది ముస్లిం లతో ఆత్మీయ సభను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ సభకు జిల్లాలోని ముస్లింలను పంపాలని అధికారులపై, పలువురు ఉద్యోగులపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే చంద్రబాబు పాలనపై విసిగి వేసారిన ముస్లింలు ఆ సభకు వెళ్లడానికి ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. చేసిందేమీ లేదు.. మైనారిటీల అభివృద్ధికి చంద్రబాబు చేసిందేమీలేదు. అతను ప్రకటించిన బడ్జెట్ కాగితాలకే పరిమితం. నాలుగేళ్లుగా మా సమస్యలు ఎవ్వరూ పట్టించుకోలేదు. ఇప్పుడు ఎన్నికలొస్తున్నాయని మళ్లీ కపటప్రేమ ఒలకబోస్తున్నారు. దుల్హన్ పథకం దరఖాస్తులు మైనారిటీ అధికారుల వద్ద కుప్పలుతెప్పలుగా మూలుగుతున్నాయి. ఈ విషయం కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. – అప్జల్‌ఖాన్,వక్ఫ్ ప్రాపర్టీస్ ప్రొటెక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు -
ఎస్సీ, ఎస్టీల తరహాలో మైనారిటీల సంక్షేమం
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీల మాదిరే మైనారిటీలకు కూడా సంక్షేమ పథకాలు రూపొందించాలని.. ఇందుకోసం ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి శాఖల అధికారులతో సమావేశమవ్వాలని మైనారిటీ శాఖ అధికారులను ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. బ్యాంకులతో సంబంధం లేకుండా నేరుగా ప్రభుత్వ సాయం అందిచేలా మైనారిటీల ఉపాధి కోసం ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించాలన్నారు. ఉర్దూ భాష పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనానికి వెంటనే మహారాష్ట్ర వెళ్లాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరిని, అజ్మీర్‌లో రుబాత్ నిర్మాణానికి ఏర్పాట్ల కోసం రాజస్థాన్ వెళ్లాలని మరో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీని కోరారు. ముస్లింలు, ఇతర మైనారిటీల సంక్షేమం కోసం ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయాలు, అసెంబ్లీలో ఇచ్చిన హామీల అమలుపై సోమవారం ప్రగతి భవన్లో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు మాట్లాడుతూ.. 66 మంది ఉర్దూ అధికారులను నియమించాలని నిర్ణయించినందున, 40 రోజుల్లో ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రభుత్వం, ప్రభుత్వరంగ సంస్థలు నిర్వహించే అన్ని పోటీ పరీక్షలు ఉర్దూలో రాసే అవకాశం కల్పించేలా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు. ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకం బాగా అమలు కావాలని, బోగస్ విద్యా సంస్థల ఉచ్చులో పడి విద్యార్థులు నష్టపోకుండా విదేశాల్లోని అక్రిడేషన్ కాలేజీల జాబితా తీసుకుని ఆ ప్రకారమే సాయం అందించాలని చెప్పారు. వక్ఫ్ భూముల జాబితా కలెక్టర్లకు.. రంజాన్, క్రిస్మస్ తదితర పండుగ రోజుల్లో ఆయా వర్గాలకు సెలవివ్వాలని సింగరేణి అధికారులను ఆదేశించినట్లు సీఎం వెల్లడించారు. వక్ఫ్ భూముల రక్షణ కోసం ఇప్పటికే కలెక్టర్లను స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని, ఎక్కడ వక్ఫ్ భూములున్నాయో జాబితా కూడా పంపామన్నారు. ఆ భూములను రక్షిస్తామని చెప్పారు. మైనారిటీ డెవలప్మెంట్ కమిషన్, ఉర్దూ అకాడమీ, వక్ఫ్ బోర్డుల బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వానికి సిఫారసు చేయాలని కోరారు. సమావేశంలో ఎమ్మెల్యేలు అక్బరుద్దీన్, షకీల్, వక్ఫ్ బోర్డు చైర్మన్ ఎండీ సలీం, ప్రభుత్వ సలహాదారు ఏకే ఖాన్, మైనారిటీ శాఖ ముఖ్య కార్యదర్శి ఉమర్ జలీల్, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, మైనారిటీ డెవలప్మెంట్ కమిషన్ ఎండీ షఫీఉల్లా, సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్, ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డి, హైదరాబాద్ కలెక్టర్ యోగితారాణి తదితరులు పాల్గొన్నారు. -
మైనారిటీల సంక్షేమం పట్టదా?
గత ఏడు దశాబ్దాలుగా ఒక పెద్దమానవ సమూహం మనదేశంలో వివక్షకు, అన్యాయానికి, అవకా శాల లేమికి, హక్కుల ఉల్లంఘనకు గురవుతూ ఉంది. వారి జీవన ప్రమాణాల్లో చెప్పుకోదగిన మార్పులేదు. అభద్రతా భావం వారిని వెంటాడు తూనే ఉంది. అనుమానపు దృక్కులు వారిని చిత్ర వధ చేస్తూనే ఉన్నారుు. ఈనాటికీ దేశ ముస్లిం జనా భాలో 60 శాతం మంది ప్రజలు దారిద్య్రరేఖ దిగు వన దుర్భర జీవనం గడుపుతున్నారు. ఏ సంక్షేమ పథకాలూ వారికి అందవు. ఎన్నో కమిటీలు, కమిషన్లు వారి వెనుకబాటును, దాని కారణాలను వివరంగా తెలియజేశారుు. పాలక పక్షాలు ఇప్పటికైనా స్పందించి ముస్లిం జనాభా ప్రాతిపదికన అన్ని రంగాల్లో తగిన ప్రాతినిధ్యం కల్పిస్తూ, పంచారుుతీ మొదలు పార్లమెంటు వరకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలి. మైనారిటీ కార్పొరేషన్, మైనారిటీ ఎడ్యుకేషన్ బోర్డు, ముస్లిం పర్సనల్ లా, ఉర్దూ అకాడమీ, వక్ఫ్ బోర్డుల పరిరక్షణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలి. విద్య, ఉద్యోగ, ఉపాధి, ఆర్థిక, సామా జిక, రాజకీయ రంగాలన్నింటిలో ముస్లింలకు సము చితమైన అవకాశాలు, ప్రాతినిధ్యం కల్పించాలి. మైనారిటీల పట్ల ఏమాత్రం బాధ్యత ఉన్నా కనీసం జస్టిస్ సచార్ సిఫార్సులనైనా తక్షణం అమలు చేసి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. దేశంలోని ప్రజాస్వామ్యప్రియులు, హక్కుల నేతలు, లౌకిక వాదులు, ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలి. ప్రజాస్వామ్య శక్తులు, సంస్థలు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, పౌర సమాజం సహకారంతో ముస్లిం నేతలు, సంఘాలు ఐక్యకార్యాచరణ రూపొందించుకొని ఉద్యమాలకు పూనుకోవాలి. జాతీయ మైనారిటీ సంక్షేమ దినో త్సవం సందర్భంగానైనా పాలక పక్షాలు సకారాత్మ కంగా ఆలోచిస్తాయని ఆశిద్దాం. (నేడు జాతీయ మైనారిటీ సంక్షేమ దినోత్సవం) యండి. ఉస్మాన్ ఖాన్, అక్షర సాహితీ అధ్యక్షులు మొబైల్ : 9912580645 -
మైనారిటీలకు ప్రత్యేక నిధి
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన ♦ ముస్లిం నిరుపేదలందరికీ డబుల్ బెడ్రూం ఇళ్లు ♦ మార్చి 31లోగా ఫీజు రీయింబర్స్మెంట్ ♦ మైనారిటీల సంక్షేమంపై సమీక్ష సాక్షి, హైదరాబాద్: మైనారిటీ సంక్షేమానికి అవసరమైతే స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ (ఎస్డీఎఫ్) నుంచి నిధులు కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. మైనారిటీ సంక్షేమానికి కేటాయించిన బడ్జెట్లో రెసిడెన్షియల్ పాఠశాలల భవనాల నిర్మాణాలకు, ముస్లిం యువత స్వయం ఉపాధికి, షాదీ ముబారక్, ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్‌షిప్‌లకు సమప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. వెనుకబడిన కులాలు, దళితులకు, మహిళలకు అమలవుతున్న విధంగానే మైనారిటీలకు సంక్షేమ పథకాలు అమలుకావాలని సీఎం అన్నారు. మైనారిటీల సంక్షేమ పథకాల పురోగతిపై క్యాంపు కార్యాలయంలో ఆదివారం సీఎం సమీక్ష జరిపారు. ఎంపీ వినోద్‌కుమార్, ఎంఐఎం నేతలు అసదుద్దీన్ ఒవైసీ, అక్బరుద్దీన్ ఒవైసీ, మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఉమర్ జలీల్, ఏసీబీ డీజీ ఏకే ఖాన్, సీఎం ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డి, న్యాయ కార్యదర్శి సంతోష్‌రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. షాదీ ముబారక్ పథకంతో సహా విద్యార్థుల స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్, డబుల్ బెడ్రూం ఇళ్లు, ఉపాధి శిక్షణ, ఉద్యోగాల కల్పన, స్కిల్ డెవలప్మెంట్ తదితర పథకాలన్నీ ముస్లిం లబ్ధిదారులకు అందాలన్నారు. ఇప్పటివరకు 26,635 మంది షాదీ ముబారక్ పథకం ద్వారా లబ్ధి పొందడంపై సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పథకంలో కొన్ని లోపాలు సీఎం దృష్టికి రావడంతో పేద ముస్లిం యువతకు చేరాల్సిన నిధులు పక్కదారి పట్టించే బ్రోకర్లపై ఉక్కుపాదం మోపాలని పోలీస్ ఉన్నతాధికారులను ఆదేశించారు. అర్హులైన ముస్లిం పేదలందరికీ డబుల్ బెడ్రూం ఇళ్లను కట్టిస్తామన్నారు. మైనారిటీ అంటే నిర్లక్ష్యం వద్దు ‘మైనారిటీ అంటేనే నిర్లక్ష్య ధోరణి ఆహ్వానించదగ్గ పరిణామం కాదు. మైనారిటీల సంక్షేమాన్ని గత పాలకులు నిర్లక్ష్యం చేశారు. ఎన్ని నిధులు ఖర్చయినా మైనారిటీల పథకాలన్నీ అవాంతరాల్లేకుండా కొనసాగించాలి’ అని సీఎం స్పష్టం చేశారు. ముస్లిం యువతకు అవకాశం దొరికితే అద్భుతమైన ప్రయోజకులుగా మారుతారన్నారు. ఇంజనీరింగ్, ఉన్నత విద్య, వృత్తి విద్య తదితర రంగాల్లో ప్రభుత్వ ఖర్చుతో ఉన్నతమైన శిక్షణను అందించాలని సూచించారు. హైదరాబాద్ పరిధిలో పెండింగ్‌లో ఉన్న జూనియర్, డిగ్రీ కాలేజీల భవన నిర్మాణాలు తొందరగా పూర్తి చేయాలని ఆదేశించారు. వక్ఫ్ భూములకు భద్రత ‘జీహెచ్ఎంసీ పరిధిలో అన్యాక్రాంతమైన వక్ఫ్ భూములను గుర్తించి వక్ఫ్ బోర్డుకు అప్పగించాలి. ప్రభుత్వ అభివృద్ధి పనుల్లో భాగంగా కోల్పోయిన వక్ఫ్ స్థలాలకు సంబంధించిన నష్టపరిహారాన్ని జీహెచ్ఎంసీ వెంటనే చెల్లించాలి’ అని సీఎం కేసీఆర్ ఆదేశించారు. హుస్సేనీ షావలీ దర్గా, బియా బానీ దర్గా, ఫకీర్ ముల్లా దర్గాలకు చెందిన వందలాది ఎకరాల భూమి అన్యాక్రాంతం కాకుండా తక్షణమే సర్వే నిర్వహించి బోర్డుకు అందజేయాలని రంగారెడ్డి జిల్లా కలెక్టరును ఆదేశించారు. మక్కా మసీదు పునరుద్ధరణ పనులు రంజాన్ పండుగలోపు పూర్తవుతాయని, అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే మైనారిటీ సంక్షేమంపై విసృ్తత స్థాయి సమీక్ష చేపడతామని చెప్పారు. ముస్లిం యువతకు భరోసా ‘పోటీ పరీక్షల్లో పాల్గొనే ముస్లిం విద్యార్థులకు తమ మాతృభాష ఉర్దూలో రాసేందుకు అనుమతి ఇవ్వాలి. ఏప్రిల్‌లో చేపట్టబోయే పోలీసు నియామకాల్లో ముస్లిం యువత భాగస్వామ్యం పెరిగే చర్యలు చేపట్టాలి. తగిన శిక్షణను ఇచ్చేందుకు అత్యున్నత నాణ్యత ఉన్న శిక్షణ సంస్థలను గుర్తించి ఖర్చుకు వెనుకాడకుండా కోచింగ్ ఇప్పించాలి’ అని సీఎం కేసీఆర్ మైనారిటీ సంక్షేమ కార్యదర్శి ఉమర్ జలీల్‌ను ఆదేశించారు. ‘ముస్లిం యువత అంటే కేవలం ఎలక్ట్రిక్, మెకానిక్, ప్లంబర్ పనులు చేసే వాళ్లే కాదు.. వాళ్లను గొప్ప కాంట్రాక్టర్లుగా చూడాలన్నదే నా ధ్యేయం. టీఎస్ ఐపాస్ కింద ఐటీ పార్కులను ఏర్పాటు చేసి ఎంటర్‌ప్రెన్యూర్‌గా తయారు చేయాలి’ అని అన్నారు. ఫీజులు వెంటనే చెల్లింపు ‘వచ్చే జూన్ నుంచి మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలను ప్రారంభించాలి. సంబంధిత ఉద్యోగ నియామకాలు తక్షణమే చేపట్టాలి’ అని సీఎం ఆదేశించారు. దారుల్ ఉలూమ్లో ఆడిటోరియం నిర్మాణానికి రూ.10 కోట్లు విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతిష్టాత్మక జామై నిజామియా యూనివర్సిటీకి చెందిన కోర్సులకు గుర్తింపును పునరుద్ధరించాలని డిప్యూటీ సీఎంకు ఫోన్ చేసి చెప్పారు. మార్చి 31లోపు మైనారిటీ విద్యార్థులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను నయాపైసా ఉంచుకోకుండా చెల్లించాలని సీఎం ఆదేశించారు. రూ.2వేల కోట్లకు పెంచండి: అసద్ మైనార్టీ సంక్షేమానికి కేటాయిస్తున్న బడ్జెట్ సరిపోవడం లేదని, అందువల్ల నిధులను రూ.2 వేల కోట్లకు పెంచాలని ఏఐఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వినతి పత్రం ఇచ్చారు. బ్యాంక్ లింకేజీ, సబ్సిడీ రుణాలు, ఫీజు రీయంబర్స్మెంట్, షాదీముబారక్ పథకాలకు కేటాయింపులు అదనంగా పెంచాలని కోరారు. ప్రస్తుతం సుమారు 97 వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని గుర్తు చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సబ్సిడీ రుణాల కోసం దరఖాస్తు చేసుకునే గడువు కూడా పెంచాలన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో సబ్సిడీ రుణాలకు అదనంగా రూ.500 కోట్లు పెంచాలన్నారు. మక్కామసీదు మరమ్మతులకు రూ. 1.75 కోట్లు విడుదల చేయాలని కోరారు. -
మైనారిటీలకు ప్రత్యేక గురుకులాలు
రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లోనూ ఏర్పాటు ♦ తొలి విడతగా వచ్చే ఏడాది నుంచి 60 గురుకుల స్కూళ్లు ♦ మరోచోటకు చంచల్‌గూడ జైలు, రేసు కోర్సు తరలింపు ♦ ఆ స్థలాల్లో గురుకుల పాఠశాలల నిర్మాణం ♦ గురుకుల స్కూళ్లలో ఐచ్ఛిక భాషగా ఉర్దూకు అవకాశం ♦ మైనారిటీ హ్యాకర్లు, వెండర్లకు ప్రత్యేక పథకం ♦ మైనారిటీల సంక్షేమంపై సమీక్షలో సీఎం కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మైనారిటీ విద్యార్థులకు ప్రత్యేక గురుకుల పాఠశాలలు ప్రారంభించాలని సీఎం కె. చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వీటిని ఏర్పా టు చేయాలని సూచించారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మైనారిటీల సంక్షేమంపై సూచనల కమిటీ అధ్యక్షుడు, ఏసీబీ డీజీ ఏకే ఖాన్, ఎస్సీ, ఎస్టీ గురుకులాల సొసై టీ డెరైక్టర్ ప్రవీణ్ కుమార్‌తో కలసి శనివారం సచివాలయంలో మైనారిటీల సంక్షేమంపై కేసీఆర్ సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 12% ఉన్న ముస్లిం లు, మరో 2 శాతం ఉన్న ఇతర మైనారిటీలు అత్యంత పేదరికంలో ఉన్నారని, వారి జీవన ప్రమాణాల్లో మెరుగైన మార్పులు రావాలసిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. మైనారిటీల్లో ముఖ్యంగా ముస్లింలలో అక్షరాస్యత తక్కువగా ఉందని, పాఠశాలల్లో డ్రాపవుట్ అవుతున్న మైనారిటీ విద్యార్థుల సంఖ్య అధికంగానే ఉందన్నారు. ఈ నేపథ్యంలో మైనారిటీల్లో చదువుకున్న యువతకు ఉపాధి కల్పించడం, పిల్లలకు 100% విద్యను అందించడం లక్ష్యంగా ప్రభుత్వ పథకాలు రూపొం దించాలన్నారు. అనవసర ఖర్చులు తగ్గించుకునైనా సరే మైనారిటీ పిల్లలకు మెరుగైన విద్యను అందించి భావితరాలకు మంచి భవిష్యత్తు అందించడం ప్రభుత్వ ఉద్దేశమన్నారు. తొలి విడతగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి బాలుర కోసం 30, బాలికల కోసం 30 చొప్పున 60 మైనారిటీ గురుకుల పాఠశాలల ను ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ఈ స్కూళ్లకు అవసరమయ్యే 2,100 మంది సిబ్బందిని నియమించుకోవాలని, జూన్‌లోగా వారికి శిక్షణ కూడా ఇవ్వాలని మైనారిటీ సంక్షేమశాఖ అధికారులను సీఎం ఆదేశించా రు. మొదటి ఏడాది అద్దె భవనాల్లో పాఠశాలలను నడపాలని, రెండో ఏడాదికల్లా సొంత భవనాలు సిద్ధం చేయాలన్నారు. హైదరాబాద్‌లో గణనీయంగా సంఖ్యలో ఉన్న మైనారిటీ బాలబాలికల కోసం గురుకుల పాఠశాలల నిర్మాణానికి చంచల్‌గూడ జైలు, రేస్ కోర్సు స్థలాలను వినియోగించాలని, వాటిని మరోచోటుకు తరలించాలన్నారు. రాష్ట్రంలో తెలుగుతోపాటు ఉర్దూను కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని... అందుకే మైనారిటీ గురుకుల విద్యాలయాల్లో ఉర్దూను ఐచ్ఛిక భాష (ఆప్షనల్ లాంగ్వేజీ)గా ప్రవేశపెట్టాలని సీఎం ఆదేశించారు. అయితే రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలోనే విద్యా బోధన జరుగుతుందని సీఎం స్పష్టం చేశారు. మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రస్తుతం నడుస్తున్న ఎస్సీ రెసిడెన్షియల్ పాఠశాలల మాదిరిగానే ఉంటాయన్నారు. మైనారిటీ యువకుల కోసం ఆర్థికంగా చేయూత అందించే పథకాలను తీసుకురావాలని సూచించారు. వడ్డీ వ్యాపారుల దగ్గర అప్పులు తీసుకుని ఆర్థికంగా చితికిపోతున్న మైనారిటీ హ్యాకర్లు, వెండర్లకు ప్రభుత్వం నుంచే ఆర్థిక సాయం అందేలా కార్యక్రమాలు రూపొందించాలన్నారు. ఈ సమీక్షలో మైనారిటీ సంక్షేమ శాఖ డెరైక్టర్ అక్బర్, మైనారిటీ డెవలప్మెంట్ కార్పొరేషన్ డెరైక్టర్ షఫియుల్లా, సీఎంఓ అదనపు ముఖ్యకార్యదర్శి శాంతి కుమారి, ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బాబు, రాజన్నపాలనలో... మైనార్టీల సంక్షేమం
బాబు పాలన బాబు పాలనలో మైనార్టీలకు కేవలం రూ.32 కోట్ల బడ్జెట్ కేటాయించారు. అవి కూడా చాలా వరకు అందకపోవడంతో మైనారిటీ విద్యార్థులు ఇబ్బందులకు గురయ్యేవారు.విద్యాసంస్థల్లో ఎలాంటి రిజర్వేషన్లు లేక చాలామంది చదువుకు దూరంగా ఉండేవారు. మధ్యలోనే చదువును మానేసి, బతుకుతెరువు కోసం గల్ఫ్ దేశాలకు వలస వెళ్లేవాళ్లు. దుకాన్-మకాన్ స్కీమ్ కింద చిన్న తరహా వ్యాపారం చేసుకోవడానికి రూ.5 వేల నుంచి రూ.10 వేలు, ఇళ్ల నిర్మాణానికి 3 శాతం వడ్డీతో రుణాల పంపిణీవితంతువులు, విడాకులు తీసుకున్న ముస్లిం మహిళలకు 3 శాతం వడ్డీతో రూ.పది వేల రుణాలు.ష్నీ పథకం ద్వారా వృత్తి పనివారికి 20 శాతం సబ్సిడీతో బ్యాంకు రుణాలు, పేద మహిళలకు వంట గ్యాస్ సిలిండర్ల పంపిణీ మైనార్టీ పేద అమ్మాయిల వివాహాలకు నామమాత్రపు ఆర్థికసాయం చేసేవారు. రాజన్న రాజ్యం ళీ మైనారిటీల బడ్జెట్‌ను రూ. 350 కోట్లకు పెంచారు. ళీ పేద ముస్లింలకు రుణ మాఫీ చేశారు. ళీ ఆర్థికంగా వెనుకబడిన ముస్లింలకు రూ.30 వేల చొప్పున సబ్సిడీ రుణాలు ఇచ్చారు. ళీ డోమువా పథకం ద్వారా నగరాల్లో, పట్టణాల్లో నివసించే పేద ముస్లిం మహిళలకు సబ్సిడీ రుణాలు ళీ నేషనల్ డెవలప్మెంట్ ఆఫ్ మైనార్టీస్ పథకం ద్వారా ముస్లిం పిల్లలకు విద్యా రుణాలు ళీ స్కాలర్షిప్ పథకం ద్వారా ప్రతి ఏటా 3 లక్షల మంది ముస్లిం పిల్లలు విద్యావంతులయ్యారు. ళీ ముస్లింలు విద్య, ఉపాధి రంగాల్లో అభివృద్ధి చెందడానికి 4 శాతం రిజర్వేషన్ల కల్పన. దీనివల్ల లక్షల మంది విద్య, ఉపాధి రంగాల్లో రాణించారు. వారి ఆర్థిక స్థితిగతులు మెరుగుపడ్డాయి. ఎన్నో కుటుంబాలు దారిద్య్ర రేఖ నుంచి పైకి ఎదిగాయి. ళీ పేద ముస్లిం అమ్మాయిల కోసం మాస్ మ్యారేజెస్ (సామూహిక వివాహాల) పథకాన్ని ప్రవేశ పెట్టారు. ళీ కుటుంబ వార్షికాదాయం రూ. 80 వేల కంటే తక్కువగా ఉన్నవారికి మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రూ.30 వేల నుంచి రూ.లక్ష వరకు సబ్సిడీ రుణాల పంపిణీ ళీ దీపం పథకం ద్వారా ముస్లిం మహిళలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ళీ రాష్ట్రంలోని 15 జిల్లాల్లో రెండో అధికార భాషగా ఉర్దూను అమలు కోసం రాష్ట్ర ఉర్దూ అకాడమీ ద్వారా ప్రత్యేక నిధులు కేటాయించారు. ళీ మధ్యలో చదువు ఆపేసిన పిల్లల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 100కు పైగా ఓపెన్ స్కూల్స్ ఏర్పాటు. ళీ మదరసాల్లో చదివే విద్యార్థుల కోసం కంప్యూటర్ల ఏర్పాటు ళీ యువతకు ఐటీ, వృత్తి కోర్సుల్లో శిక్షణ ఇచ్చి కంపెనీల్లో ఉద్యోగాల కల్పన. జగన్ సంకల్పం వైఎస్సార్ హయాంలో ప్రవేశపెట్టిన అన్ని మైనార్టీ పథకాలనూ నూతనంగా ఏర్పడబోయే రాష్ట్రంలో కూడా కొనసాగిస్తాం. నాలుగు శాతం ముస్లిం రిజర్వేషన్, స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్, మాస్ మ్యారేజెస్, ఉర్దూ భాషాభివృద్ధి, ఉర్దూ మీడియం స్కూళ్లలో వసతులు, ఉర్దూ టీచర్ల నియామకం, ఉర్దూ అకాడమీకి మరిన్ని నిధులు, మైనారిటీ విద్యాసంస్థలకు గ్రాంట్ ఇన్ ఎయిడ్, పవిత్ర హజ్ యాత్రలో సబ్సిడీ, వక్ఫ్ భూముల పరిరక్షణ చట్టం, అర్హులైన అందరికీ గృహనిర్మాణాలు మొదలైనవన్నిటినీ అమలుచేస్తాం. మతపరమైన దాడులు జరగకుండా చట్టాలను కఠినతరం చేస్తాం. ముస్లింల కోసం ప్రస్తుతమున్న బడ్జెట్‌ను పెంచుతాం. ముస్లిం అమ్మాయిలకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యతో పాటు సైకిళ్లు, యూనిఫామ్‌లను అందిస్తాం. మధ్యలో చదువు మానేసిన ముస్లిం విద్యార్థుల కోసం, అమ్మాయిలకు వృత్తి విద్యలో శిక్షణ ఇచ్చి స్వయం ఉపాధి కల్పిస్తాం. నిరుద్యోగ యువతకు రూ. 5 లక్షల వరకు వడ్డీ రుణాలు ఇస్తాం. మసీదుల నిర్మాణం, మరమ్మతుల కోసం ఆర్థిక సహాయాన్ని అందిస్తాం. ప్రభుత్వంలోని ప్రతి సంక్షేమ పథకంలో ముస్లిం జనాభా ప్రతిపాదికన వాటా కల్పిస్తాం. పేద ముస్లిం అమ్మాయిల వివాహం కోసం ఒక అన్నయ్యలా వారి నిఖా సందర్భంగా 50 వేల రూపాయలను కానుకగా అందించి అర్థికంగా అదుకుంటా. మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్‌ను పటిష్ఠపరిచి తద్వారా చిన్న తరహా వ్యాపారులకు రుణాలు అందేలా చేస్తాం.