గత ఏడు దశాబ్దాలుగా ఒక పెద్దమానవ సమూహం మనదేశంలో వివక్షకు, అన్యాయానికి, అవకా శాల లేమికి, హక్కుల ఉల్లంఘనకు గురవుతూ ఉంది. వారి జీవన ప్రమాణాల్లో చెప్పుకోదగిన మార్పులేదు. అభద్రతా భావం వారిని వెంటాడు తూనే ఉంది. అనుమానపు దృక్కులు వారిని చిత్ర వధ చేస్తూనే ఉన్నారుు. ఈనాటికీ దేశ ముస్లిం జనా భాలో 60 శాతం మంది ప్రజలు దారిద్య్రరేఖ దిగు వన దుర్భర జీవనం గడుపుతున్నారు. ఏ సంక్షేమ పథకాలూ వారికి అందవు.
ఎన్నో కమిటీలు, కమిషన్లు వారి వెనుకబాటును, దాని కారణాలను వివరంగా తెలియజేశారుు. పాలక పక్షాలు ఇప్పటికైనా స్పందించి ముస్లిం జనాభా ప్రాతిపదికన అన్ని రంగాల్లో తగిన ప్రాతినిధ్యం కల్పిస్తూ, పంచారుుతీ మొదలు పార్లమెంటు వరకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలి. మైనారిటీ కార్పొరేషన్, మైనారిటీ ఎడ్యుకేషన్ బోర్డు, ముస్లిం పర్సనల్ లా, ఉర్దూ అకాడమీ, వక్ఫ్ బోర్డుల పరిరక్షణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలి. విద్య, ఉద్యోగ, ఉపాధి, ఆర్థిక, సామా జిక, రాజకీయ రంగాలన్నింటిలో ముస్లింలకు సము చితమైన అవకాశాలు, ప్రాతినిధ్యం కల్పించాలి.
మైనారిటీల పట్ల ఏమాత్రం బాధ్యత ఉన్నా కనీసం జస్టిస్ సచార్ సిఫార్సులనైనా తక్షణం అమలు చేసి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. దేశంలోని ప్రజాస్వామ్యప్రియులు, హక్కుల నేతలు, లౌకిక వాదులు, ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలి. ప్రజాస్వామ్య శక్తులు, సంస్థలు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, పౌర సమాజం సహకారంతో ముస్లిం నేతలు, సంఘాలు ఐక్యకార్యాచరణ రూపొందించుకొని ఉద్యమాలకు పూనుకోవాలి. జాతీయ మైనారిటీ సంక్షేమ దినో త్సవం సందర్భంగానైనా పాలక పక్షాలు సకారాత్మ కంగా ఆలోచిస్తాయని ఆశిద్దాం.
(నేడు జాతీయ మైనారిటీ సంక్షేమ దినోత్సవం)
యండి. ఉస్మాన్ ఖాన్, అక్షర సాహితీ అధ్యక్షులు మొబైల్ : 9912580645