ఆ ఊరంతా అద్దెకు.. ఒక్క రోజుకు ఎంతంటే? | Rent This Entire Village in Italy,Near the Adriatic Sea | Sakshi
Sakshi News home page

ఆ ఊరంతా అద్దెకు.. ఒక్క రోజుకు ఎంతంటే?

Published Sun, Dec 11 2022 1:49 PM | Last Updated on Sun, Dec 11 2022 2:43 PM

 Rent This Entire Village in Italy,Near the Adriatic Sea - Sakshi

ఏదైనా ఊరికి బదిలీ అయితే, ఆ ఊళ్లో ఇల్లు అద్దెకు తీసుకోవడం మామూలు. కొద్దిరోజుల పనికోసమే అయితే, హోటల్‌ గది అద్దెకు తీసుకోవడమూ మామూలే. ఇటలీలోని ఒక చిత్రమైన ఊరుంది. ఎవరైనా నిర్ణీత మొత్తం చెల్లిస్తే, ఏకంగా ఆ ఊరంతటినీ అద్దెకు తీసుకోవచ్చు. ఇటలీ నడిబొడ్డున ఉండే లె మార్షె ప్రాంతంలో ఉన్న ఈ మధ్యయుగాల నాటి ఊరి పేరు పెట్రిటోలి.

రోమన్‌ నాగరికత కాలం నాటి పురాతన కట్టడాలు, వాటిలోని నేలమాళిగలు, బోటిక్‌ లాడ్జింగులు, వాటితో పాటే ముప్పయ్యేడు పడకగదుల భారీ రాచప్రాసాదం, ఒక రంగస్థల వేదిక ఈ ఊరి ప్రత్యేకతలు. వీటన్నిటితో కూడిన ఈ ఊరును అద్దెకు తీసుకోదలచుకున్న వారు రోజు 1303 పౌండ్లు (రూ.1,28,577) చెల్లించాల్సి ఉంటుంది.

యూరోప్‌లోని సంపన్నుల్లో చాలామంది కుటుంబ సమావేశాలు, పెళ్లిళ్లు, పుట్టినరోజు వేడుకలు వంటి కార్యక్రమాల కోసం దీనిని అద్దెకు తీసుకుంటున్నారు. సముద్రమట్టానికి మూడువందల మీటర్ల ఎత్తున ఉండే ఈ ఊరి వాతావరణం చల్లగా ఆహ్లాదభరితంగా ఉంటుంది.


చదవండిWinter Festivals: శీతకాలంలో ఇక్కడ మనుషులు బతకలేరని రాయడంతో! శీతాకాల సంబరాల విశేషాలు..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement