
దాదాపు అరవయ్యేళ్లుగా ఆ ఊరు ఖాళీగానే ఉంటోంది. చిట్టచివరి మనిషి ఈ ఊరిని ఖాళీచేసి వెళ్లిపోయిన నాటి నుంచి ఇక్కడ పిట్టమనిషి కూడా ఉండటం లేదు. స్పెయిన్‌లోని స్వయంపాలిన ప్రాంతమైన ఎస్ట్రెమాడురాలో ఉన్న ఈ ఊరి పేరు గ్రానడిల్లా. ప్రపంచం నలుమూలలా రకరకాల కారణాల వల్ల అక్కడక్కడా ఖాళీ ఊళ్లు కనిపిస్తుంటాయి గాని, గ్రానడిల్లా ఖాళీగా పడి ఉండటానికి కారణం మాత్రం కొంత విచారకరమైనది.
ఈ చిన్న పట్టణాన్ని తొమ్మిదో శతాబ్దిలో అప్పటి ముస్లింపాలకులు నిర్మించారు. ఈ ఊళ్లోని జనాలు ప్రధానంగా ఊరిబయటి భూముల్లో వ్యవసాయం చేసుకుంటూ బతికేవాళ్లు. స్పెయిన్ నియంత ఫ్రాన్సిస్కో ఫ్రాంకో 1950లో ఈ ఊరి సమీపంలోని నది మీద రిజర్వాయర్ నిర్మించనున్నట్లు ప్రకటించాడు. రిజర్వాయర్ పనులు కొనసాగుతుండగా, 1960 ప్రాంతంలో ఊరు మునిగిపోవచ్చని అప్పటి అధికారులు అంచనా వేశారు. దాంతో ఊళ్లోని జనాలు భయపడి ఊరిని ఖాళీచేసేశారు. రిజర్వాయర్ నిర్మాణం పూర్తయినా, ఊరు మునిగిపోలేదు. అయితే, రిజర్వాయర్ కోసం ఊరికి దారితీసే రోడ్లన్నిటినీ కొట్టేశారు. దాంతో ఈ ఊరు బాహ్యప్రపంచంలో సంబంధాలు కోల్పోయి ఒక ద్వీపంలా మారింది.
చదవండి: Pauline Death Mystery: పాలిన్ చనిపోయిందంటున్నారు.. ఇంటికి వచ్చిందెవరు?
Comments
Please login to add a commentAdd a comment