స్పెయిన్‌లోని ఓ గ్రామంలో స్థానిక ఎన్నికలు పూర్తవడానికి 30 సెకన్ల సమయం కూడా పట్టలేదట. అదేంటి ఎన్నికలంటే పెద్ద తతంగం. రోజంతా ఓటింగ్ జరిగినా 60 నుంచి 80 శాతం పోలింగ్ కావడం కూడా కష్టమే. పోలింగ్ సమయంలో ఏ చిన్న తప్పు జరిగినా అది సరిచేసేందుకు గంటల తరబడి సాగే వ్యవహారం. ఒక్కోసారి అర్థరాత్రి వరకు పోలింగ్ జరిగిన ఘటనలు కూడా చేసే ఉంటాం. అలాంటి ఆ గ్రామంలో అర నిమిషంలో స్థానిక ఎన్నికలు పూర్తయ్యాయి. వినడానికి విడ్దూరంగా ఉన్నప్పటికీ ఇది వాస్తవమే.
ఇంతకు తక్కువ సమయంలో ఓటింగ్ పూర్తవడానికి కారణమేమంటే... లా రియోజా ప్రావిన్స్‌లోని విల్లారోయా అనే గ్రామంలో ఓటు హక్కు ఏడు మందికి మాత్రమే ఉంది. దీంతో అతి తక్కువ సమయంలో ఎన్నికల అధికారులు ఓటింగ్ ప్రక్రియను పూర్తి చేయగలుగుతున్నారు. ఈ ఏడాది గ్రామస్థులు తమ ఓటు హక్కును కేవలం 29 సెకన్లలో వినియోగించుకున్నారు. గతంలో ఉన్న 32 సెకన్ల రికార్డును ఈ సారి బద్దలు కొట్టగలిగారు. ఈ ఎన్నికలపై స్థానిక మేయర్ సాల్వడార్ పెరెజ్ మీడియాతో మాట్లాడుతూ.. గ్రామస్థులు ఓట్లు ఎవరికి వేశారో తెలియదు గానీ తన గెలుపుపై ఆయన విశ్వాసం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు.
తమ గ్రామంలో ఓటర్లకి ఓటు ఎలా వేయాలనేదానిపై శిక్షణ పొందారని అందుకే పోలింగ్ ప్రక్రియ అంత వేగంగా ముగుస్తోందని చెప్పారు. కాగా, ఆయన 1973 నుంచి ఆ గ్రామానికి మేయర్‌గా ఎన్నికవుతూ ఉన్నారు. ఇటీవల జరిగిన స్పెయిన్ స్థానిక ఎన్నికలు ఈ ఏడాది చివరిలో జరగనున్న పార్లమెంటరీ ఎన్నికలకు రెఫరెండంగా భావిస్తారు.
చదవండి: ప్రపంచంలోని దోమలన్నింటినీ అంతం చేస్తే ఏమవుతుంది?... శాస్త్రవేత్తల సమాధానం ఇదే..
Comments
Please login to add a commentAdd a comment