మ్యాండ్రిడ్: చాలా మందికి ఒక ఇల్లు లేదా విల్లా కొనుగోలు చేయలానే కల ఉంటుంది. కానీ, ఎవరికైనా ఒక గ్రామాన్ని కొనుగోలు చేయాలనుంటుందా? బాగా డబ్బు ఉన్న వాళ్లు రెండు మూడు ప్రాంతాల్లో నివాస గృహాలు కొనుగోలు చేయటం సహజమే. అయితే, ఒక గ్రామం మొత్తం అమ్మకానికి ఉంటే.. అది కేవలం ఒక ఇంటి ధరకే వస్తే..? ఆ ఆలోచనే నమ్మశక్యంగా లేదు కదా! స్పానిస్‌లోని ఓ గ్రామం ఇప్పుడు అమ్మకానికి వచ్చింది. దాని ధర కేవలం 227,000 యూరోలు(రూ.2,16,87,831) మాత్రమే.
సాల్టో డీ కాస్టో అనే ఈ గ్రామం జమోరా రాష్ట్రంలో పోర్చుగల్ సరిహద్దుల్లో ఉంటుంది. మ్యాండ్రిడ్ నుంచి కేవలం మూడు గంటల ప్రయాణం మాత్రమే. ఆ గ్రామంలో 44 ఇళ్లు, ఒక హోటల్, ఒక చర్చి, ఒక స్కూలు, ఒక మున్సిపల్ స్విమ్మింగ్ పూల్ వంటివి ఉన్నాయి. 2000 తొలినాళ్లలో ఓ వ్యక్తి ఆ గ్రామాన్ని కొనుగోలు చేసి.. దానిని ప్రధాన టూరిస్ట్ ప్రాంతంగా మార్చాలనుకున్నాడు. అయితే, ఆర్థిక సంక్షోభంతో అది సాధ్యం కాలేదు. రాయల్ ఇన్వెస్ట్ యజమానికి రోని రోడ్రిగౌజ్ ఇప్పటికీ అక్కడ పర్యాటకం అభివృద్ధి చెందుతుందని నమ్ముతున్నారు.
ఐడియాలిస్టా అనే స్పానిస్ స్థిరాస్తి రిటైల్ వెబ్‌సైట్‌లో ఈ గ్రామాన్ని అమ్మకాన్ని ఉంచారు. తాను పట్టణవాసినని, గ్రామం నిర్వహణను చూసుకోలేకపోతున్నందునే అమ్మకాని పెట్టినట్లు యజమాని పేర్కొన్నారు. ఈ గ్రామంపై పెట్టుబడి పెడితే 100 శాతం అభివృద్ధి సాధించవచ్చని, అందుకు 2 లక్షల యూరోలకు మించి ఖర్చు కాదని తెలిపారు. వెబ్‌సైట్‌లో ఈ ప్రాపర్టీని ఇప్పటి వరకు 50వేల మంది వీక్షించారు. బ్రిటన్, ఫ్రాన్స్ బెల్జియం, రష్యాల నుంచి 300 మందికిపైగా కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించినట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: USA Airshow: ఎయిర్ షోలో ఘోర ప్రమాదం.. ఆకాశంలోనే ఢీకొన్న యుద్ధ విమానాలు
Comments
Please login to add a commentAdd a comment