Property sales
-
రియల్టీ బుకింగ్స్ జోరు
న్యూఢిల్లీ: రియల్టీ రంగ దిగ్గజాలు ప్రాపరీ్టల అమ్మకాలలో గత ఆర్థిక సంవత్సరం(2023–24) స్పీడందుకున్నాయి. 18 లిస్టెడ్ కంపెనీలు మొత్తం రూ. 1.17 లక్షల కోట్ల విలువైన బుకింగ్స్‌ను సాధించాయి. ఈ జాబితాలో గోద్రెజ్ ప్రాపరీ్టస్, ప్రెస్టీజ్ ఎస్టేట్స్, డీఎల్ఎఫ్, మాక్రోటెక్ డెవలపర్స్, సిగ్నేచర్ గ్లోబల్ తదితరాలు అగ్రపథంలో నిలిచాయి. గోద్రెజ్ ప్రాపర్టీస్ రూ. 25,527 కోట్ల విలువైన అమ్మకాల బుకింగ్స్ సాధించి తొలి స్థానాన్ని పొందింది. అంతక్రితం ఏడాది(2022–23)తో పోలిస్తే కొద్దిపాటి కంపెనీలను మినహాయిస్తే ప్రధాన సంస్థలన్నీ అమ్మకాల బుకింగ్స్‌లో జోరు చూపాయి. ఇందుకు ప్రధానంగా రెసిడెన్షియల్ ప్రాపర్టీలకు పుట్టిన పటిష్ట డిమాండ్ కారణమైంది. ప్రధాన నగరాలలో ప్రత్యేకంగా విలాసవంత గృహాలకు భారీ డిమాండ్ కనిపించడం తోడ్పాటునిచి్చంది! శోభా, బ్రిగేడ్, పుర్వంకారా.. రియల్టీ రంగ లిస్టెడ్ దిగ్గజాలలో గతేడాది ప్రెస్టీజ్ ఎస్టేట్స్ రూ. 21,040 కోట్ల అమ్మకాల బుకింగ్స్‌తో రెండో ర్యాంకులో నిలిచింది. ఇక డీఎల్ఎఫ్ రూ. 14,778 కోట్లు, లోధా బ్రాండ్ మాక్రోటెక్ రూ. 14,520 కోట్లు, గురుగ్రామ్ కంపెనీ సిగ్నేచర్ గ్లోబల్ రూ. 7,270 కోట్లు చొప్పున ప్రీసేల్స్ సాధించి తదుపరి స్థానాల్లో నిలిచాయి. ఈ బాటలో బెంగళూరు సంస్థ శోభా లిమిటెడ్ రూ. 6,644 కోట్లు, బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ రూ. 6,013 కోట్లు, పుర్వంకారా రూ. 5,914 కోట్లు, ముంబై కంపెనీ ఒబెరాయ్ రియల్టీ రూ. 4,007 కోట్లు, కోల్టే పాటిల్ రూ. 2,822 కోట్లు, మహీంద్రా లైఫ్సై్పస్ రూ. 2,328 కోట్లు, కీస్టోన్ రియల్టర్స్ రూ. 2,266 కోట్లు, సన్‌టెక్ రియల్టీ రూ. 1,915 కోట్లు చొప్పున అమ్మకాల బుకింగ్స్ నమోదు చేశాయి. ఇదేవిధంగా ఏషియానా హౌసింగ్ రూ. 1,798 కోట్లు, అరవింద్ స్మార్ట్‌స్పేసెస్ రూ. 1,107 కోట్లు, అజ్మీరా రియల్టీ అండ్ ఇన్ఫ్రా రూ. 1,017 కోట్లు, ఎల్డెకో హౌసింగ్ రూ. 388 కోట్లు, ఇండియాబుల్స్ రియల్టీ రూ. 280 కోట్లు చొప్పున బుకింగ్స్ అందుకున్నాయి. అయితే ఒమాక్సే తదితర కొన్ని కంపెనీల వివరాలు వెల్లడికావలసి ఉంది. ఇతర దిగ్గజాలు.. ఇతర దిగ్గజాలలో టాటా రియల్టీ అండ్ ఇన్ఫ్రా, అదానీ రియలీ్ట, పిరమల్ రియల్టీ, హీరానందానీ గ్రూప్, ఎంబసీ గ్రూప్, కే రహేజా గ్రూప్ తదితరాలు నాన్‌లిస్టెడ్ కంపెనీలుకావడంతో త్రైమాసిక, వార్షిక బుకింగ్స్ వివరాలు వెల్లడించని సంగతి తెలిసిందే. కాగా.. కోవిడ్–19 తదుపరి సొంత ఇంటికి ప్రాధాన్యత పెరగడంతో హౌసింగ్ రంగం ఊపందుకున్నట్లు రియల్టీ రంగ నిపుణులు పేర్కొంటున్నారు. దీంతో పటిష్టస్థాయిలో ప్రాజెక్టులను పూర్తిచేసే కంపెనీల ప్రాపరీ్టలకు డిమాండు పెరిగినట్లు తెలియజేశారు. వెరసి బ్రాండెడ్ గృహాలవైపు కన్జూమర్ చూపుసారించడం లిస్టెడ్ కంపెనీలకు కలసి వస్తున్నట్లు తెలియజేశారు. గతంలో యూనిటెక్, జేపీ ఇన్ఫ్రాటెక్ తదితరాల హౌసింగ్ ప్రాజెక్టులు పూర్తికాకపోగా.. విఫలంకావడంతో గృహ కొనుగోలుదారులు ధర అధికమైనా రిస్‌్కలేని వెంచర్లకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు వివరించారు.33 శాతం వృద్ధిబలమైన కన్జూమర్ డిమాండ్ నేపథ్యంలో గతేడాది దేశీ రియల్టీ రంగంలో రికార్డ్ ప్రీసేల్స్ నమోదయ్యాయి. ఆయా కంపెనీల సమాచారం ప్రకారం లిస్టెడ్ రియల్టీ కంపెనీలు ఉమ్మడిగా రూ. 1,16,635 కోట్ల సేల్స్ బుకింగ్స్‌ను సాధించాయి. 2022–23లో నమోదైన రూ. 88,000 కోట్ల బుకింగ్స్‌తో పోలిస్తే ఇది 33 శాతం అధికం. జాబితాలో శోభా, బ్రిగేడ్, పుర్వంకారా, ఒబెరాయ్ రియలీ్ట, మహీంద్రా లైఫ్‌స్పేస్, కోల్టేపాటిల్, సన్‌టెక్, కీస్టోన్ రియల్టర్స్ తదితరాలు చేరాయి. పటిష్ట బ్రాండ్ గుర్తింపు, డైవర్సిఫైడ్ పోర్ట్‌ఫోలియో, పెట్టుబడుల సులభ సమీకరణ కారణంగా లిస్టెడ్ రియల్టీ కంపెనీలు ఆకర్షణీయ పనితీరు చూపగలుగుతున్నట్లు హౌసింగ్.కామ్, ప్రాప్‌టైగర్ సీఈవో ధ్రువ్ అగర్వాల్ పేర్కొన్నారు. దీనికితోడు ఆధునిక టెక్నాలజీలతో మార్కెటింగ్, అమ్మకాలు చేపట్టడం, మెరుగైన కస్టమర్ సరీ్వసులు తదితరాల ద్వారా మార్కెట్ వాటాను కైవసం చేసుకుంటున్నట్లు తెలియజేశారు. వెరసి నాన్‌లిస్టెడ్ లేదా చిన్న కంపెనీలకంటే పైచేయి సాధించగలుగుతున్నట్లు వివరించారు. -
ఆస్తి అమ్మిన డబ్బుతో.. అలా వద్దండి!
అన్ని జాగ్రత్తలు తీసుకుని, సంబంధిత కాగితాలు భద్రపర్చుకుని, బ్యాంకులో జమ అయిన మొత్తంతో ఏం చేయాలి అనేది ఆలోచించాలి. కాస్సేపు ఇలా అమ్మగా వచ్చిన మొత్తాన్ని ‘ప్రతిఫలం’ అని అందాం. ఈ ప్రతిఫలం నగదు రూపంలో వద్దండి! బ్యాంకులోనే జమ అయ్యేలా చూసుకోండి. ఎందుకంటే ఈ సమాచారం వెనువెంటనే కాకపోయినా .. త్వరగా కాకపోయినా.. అంతిమంగా సబ్ రిజిస్ట్రార్‌కి విధించిన గడువులోగా ఇన్‌కంట్యాక్స్ డిపార్టుమెంటు వారికి చేరుతుందన్న విషయాన్ని మర్చిపోవద్దు. ప్రతిఫలాన్ని ఏం చేయాలన్న ప్రశ్నకు జవాబుగా ఆదాయపు పన్ను చట్టప్రకారం మరీ ఎక్కువగా ఆలోచించకుండా తమ కుటుంబ సభ్యుల అవసరం ఏమిటి అనే దానికే ప్రాముఖ్యత ఇచ్చి హాయిగా కాలం గడుపుతున్న కొంత మందిని ఈ వారం మీకు పరిచయం చేస్తున్నాం. ➤ ఆ ఊళ్లో సాంబశివరావుగారు మంచి టీచర్. మానవతా విలువలతో పాటు విద్యావిలువలు తెలిసిన పెద్ద మనిషి. స్థిరాస్తి అమ్మకంతో వచ్చిన ప్రతిఫలంతో ఏర్పడ్డ పన్ను భారాన్ని చెల్లించేసి, మిగతా మొత్తంతో పిల్లల పేరు మీద ఫిక్సిడ్ డిపాజిట్ చేశారు. ఆ మొత్తాన్ని వారి వారి చదువులకు ఖర్చు పెట్టి వారిని వృద్ధిలోకి తీసుకొచ్చారు. అందరూ భారత్‌లోనే ఉన్నారు. ➤ పిల్లలను విదేశాల్లో చదివించాలన్న విశ్వేశ్వరరావు కూడా అదే బాటని ఆశ్రయించారు. పన్ను భారం చెల్లించాక మిగిలిన మొత్తంతో కొడుకుని విదేశాల్లో ఉన్నత విద్యల కోసం పంపించి హాయిగా ఉన్నారు. ➤ చెల్లి పెళ్లి అప్పులతో తండ్రి చేశాడు. క్రమేణా కాలం కలిసొచ్చింది కల్యాణరావుకి. మావగారు ఇచ్చిన ఇల్లుకి రింగ్ రోడ్ ధర్మమా అని రేటు రాగానే అమ్మేశాడు, పన్ను కట్టాకా మిగిలిన మొత్తంతో ఇద్దరు ఆడపిల్లలకు పెళ్ళి చేసేసి, మనవళ్ళతో ఆడుకుంటున్నాడు. ➤ శివరావుగారి తాతగారు ఎప్పుడో గుడి కట్టించారు. అది శిథిలం అయ్యింది. తండ్రి ఏమి చేయలేకపోయాడు. కానీ గుడిని పునరుద్ధరించాలనేది ఆయన చిరకాల కోరిక. శివరావుగారు తనకు వచ్చిన ‘ప్రతిఫలం’లో మిగిలిన మొత్తంతో గుడిని బాగుచేయించారు. తన శ్రమ శక్తి వల్ల ఏర్పడ్డ స్థిరాస్తి అమ్మకం.. శివభక్తికి అలా ఉపకరించింది. భార్య పార్వతమ్మ సంతోషం అంతా ఇంతా కాదు. ➤ తన స్కూలు చదువంతా ఎండా, వానల్లోనే. కాలేజీకి వచ్చే వరకు బెంచీలు చూడని విద్యాధరరావు డబ్బు సంపాదించి, ఇల్లు కొన్నాడు. అమ్మవలసినప్పుడు, అన్ని బాధ్యతలను తీర్చివేసి ఊళ్లో స్కూల్లో అన్ని తరగతులవారికి బెంచీలు కొన్నాడు. ➤ బంగార్రాజు పేరుకే బంగార్రాజు. పెళ్లాం లక్ష్మీ ప్రతిరోజూ పేచీయే బంగారం కొనమని. అనుకోకుండా అన్నదమ్ముల స్థిరాస్తి పంపకాల్లో ఆస్తి అమ్మాల్సి వచ్చింది. పన్ను కట్టేసి మిగిలిన మొత్తంతో పెళ్లాం లక్ష్మమ్మని ఏడువారాల నగలు, వడ్డాణం కొని ‘లక్ష్మీదేవి’గా చేశాడు బంగార్రాజు. ➤ అమీర్‌పేటలో ఇరుకు ఇంట్లో నలభై ఏళ్లు కాపురం చేసి విసిగిపోయిన రాజారావు.. ’ప్రతిఫలం’తో ఓ విల్లా కొనుక్కుని, నార్సింగిలో సరదాగా ఉన్నాడు. పన్ను మినహాయింపులు కూడా పొందాడు. ➤ మొదటి నుంచి ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉండటం వల్ల ’ప్రతిఫలం’ మొత్తాన్ని నిర్దేశిత బాండ్లలో ఇన్వెస్ట్ చేసి, ఆ వడ్డీలతో ఏ అప్పు లేకుండా పబ్బం గడుపుతున్నాడు ’లక్ష్మీపతి’. ➤ పాత ఇండస్ట్రీ షెడ్డుని అమ్మేసి, ఆ డబ్బుతో కొత్త షెడ్డు కొని వ్యాపారం చేస్తున్నారు నాయుడుగారు. ➤ అన్ని ఆస్తులు అమ్మినా, సరైన ప్లానింగ్ లేకుండా అప్పుల పాలైన అప్పారావూ ఉన్నారు. ఏదేమైనా ‘ప్రతిఫలం’ మొత్తాన్ని సద్వినియోగం చేసుకునే విషయంలో ఆలోచించాలి. సరైన నిర్ణయం తీసుకోవాలి. పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.comకు ఈ–మెయిల్ పంపించగలరు. -
డిమాండ్ పెరిగింది.. సరఫరా తగ్గింది
హైదరాబాద్: హైదరాబాద్ ప్రాపర్టీ మార్కెట్లో డిమాండ్ – సరఫరా మధ్య అసమతుల్యత నెలకొందని, దీని ఫలితంగా మార్చి త్రైమాసికంలో ప్రాపర్టీల ధరలు 5.8 శాతం పెరిగినట్టు ‘మ్యాజిక్‌బ్రిక్స్ ప్రాప్ ఇండెక్స్’ నివేదిక వెల్లడించింది. 2023 జనవరి–మార్చి కాలానికి ఈ సంస్థ ఓ నివేదికను విడుదల చేసింది. ఇళ్లకు డిమాండ్ త్రైమాసికం వారీగా 6 శాతం పెరగ్గా, అదే సమయంలో ఇళ్ల సరఫరా 14.2 శాతం తగ్గినట్టు తెలిపింది. పశ్చిమ హైదరాబాదులో గచ్చిబౌలి, మియాపూర్, కొండాపూర్ ప్రాంతాలకు నివాస పరంగా అధిక డిమాండ్ నెలకొందని, ప్రధాన ఉపాధి కేంద్రాలకు, నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్)కు చేరువగా ఉండడమే అధిక డిమాండ్ కు కారణమని వివరించింది. ఇళ్ల మార్కెట్లో డిమాండ్ అందుబాటు ధరల నుంచి మధ్య స్థాయి (రూ.5000 – 7000 చదరపు అడుగు)కి మారిందని, ప్రస్తుతం నగరంలోని ఇళ్ల డిమాండ్, సరఫరాలో ఈ విభాగమే 50 శాతం వాటా ఆక్రమిస్తోందని తెలిపింది. విశాలమైన ఇళ్లకు ప్రాధాన్యత పెరిగిందని తెలియజేస్తూ.. 90 శాతం డిమాండ్ రెండు, మూడు పడక గదుల ఇళ్లకే ఉన్నట్టు పేర్కొంది. ‘‘ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం ఉన్నప్పటికీ 2022–23 ఆర్థిక సంవత్సరానికి భారత ఆర్ధిక వ్యవస్థ 6–7 శాతం వరకు పెరుగుతుందని ఎన్నో ఏజెన్సీలు అంచనా వేశాయి. ఇటీవలి కేంద్ర బడ్జెట్ సైతం పలు ప్రోత్సాహక కార్యక్రమాలకుతోడు పిఎంఏవై, యూఐడిఎఫ్కు గణనీయమైన కేటాయింపులు చేసింది. ఈ చర్యలు ఉపాధి అవకాశాలను, మౌలిక సదుపాయాల అభివృద్ధిని పెంచుతాయి. సరసమైన, మధ్యస్థాయి విభాగాల్లో రాబోయే త్రైమాసికాలలో డిమాండ్ బాగుంటుందని ఆశిస్తున్నాం’’అని మ్యాజిక్‌బ్రిక్స్ సీఈవో సుధీర్ పాయ్ తెలిపారు. మార్చి త్రైమాసికంలో అత్యధికంగా మెహిదీపట్నం ప్రాంతంలో ప్రాపర్టీ ధరలు 4.27 శాతం పెరగ్గా (త్రైమాసికం వారీగా), కొండాపూర్‌లో 3.96 శాతం, బాలా నగర్లో 3.75 శాతం చొప్పున పెరిగినట్టు ఈ నివేదిక తెలిపింది. అలాగే, బంజారాహిల్స్‌లో 3.94 శాతం, బోడుప్పల్లో 3.77 శాతం, నానక్‌రామ్ గూడలో 3.39 శాతం చొప్పున తగ్గినట్టు పేర్కొంది. -
అమ్మకానికి గ్రామం.. ధర రూ.2.1 కోట్లు.. మరీ అంత తక్కువెందుకంటే?
మ్యాండ్రిడ్: చాలా మందికి ఒక ఇల్లు లేదా విల్లా కొనుగోలు చేయలానే కల ఉంటుంది. కానీ, ఎవరికైనా ఒక గ్రామాన్ని కొనుగోలు చేయాలనుంటుందా? బాగా డబ్బు ఉన్న వాళ్లు రెండు మూడు ప్రాంతాల్లో నివాస గృహాలు కొనుగోలు చేయటం సహజమే. అయితే, ఒక గ్రామం మొత్తం అమ్మకానికి ఉంటే.. అది కేవలం ఒక ఇంటి ధరకే వస్తే..? ఆ ఆలోచనే నమ్మశక్యంగా లేదు కదా! స్పానిస్లోని ఓ గ్రామం ఇప్పుడు అమ్మకానికి వచ్చింది. దాని ధర కేవలం 227,000 యూరోలు(రూ.2,16,87,831) మాత్రమే. సాల్టో డీ కాస్టో అనే ఈ గ్రామం జమోరా రాష్ట్రంలో పోర్చుగల్ సరిహద్దుల్లో ఉంటుంది. మ్యాండ్రిడ్ నుంచి కేవలం మూడు గంటల ప్రయాణం మాత్రమే. ఆ గ్రామంలో 44 ఇళ్లు, ఒక హోటల్, ఒక చర్చి, ఒక స్కూలు, ఒక మున్సిపల్ స్విమ్మింగ్ పూల్ వంటివి ఉన్నాయి. 2000 తొలినాళ్లలో ఓ వ్యక్తి ఆ గ్రామాన్ని కొనుగోలు చేసి.. దానిని ప్రధాన టూరిస్ట్ ప్రాంతంగా మార్చాలనుకున్నాడు. అయితే, ఆర్థిక సంక్షోభంతో అది సాధ్యం కాలేదు. రాయల్ ఇన్వెస్ట్ యజమానికి రోని రోడ్రిగౌజ్ ఇప్పటికీ అక్కడ పర్యాటకం అభివృద్ధి చెందుతుందని నమ్ముతున్నారు. ఐడియాలిస్టా అనే స్పానిస్ స్థిరాస్తి రిటైల్ వెబ్సైట్లో ఈ గ్రామాన్ని అమ్మకాన్ని ఉంచారు. తాను పట్టణవాసినని, గ్రామం నిర్వహణను చూసుకోలేకపోతున్నందునే అమ్మకాని పెట్టినట్లు యజమాని పేర్కొన్నారు. ఈ గ్రామంపై పెట్టుబడి పెడితే 100 శాతం అభివృద్ధి సాధించవచ్చని, అందుకు 2 లక్షల యూరోలకు మించి ఖర్చు కాదని తెలిపారు. వెబ్సైట్లో ఈ ప్రాపర్టీని ఇప్పటి వరకు 50వేల మంది వీక్షించారు. బ్రిటన్, ఫ్రాన్స్ బెల్జియం, రష్యాల నుంచి 300 మందికిపైగా కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించినట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: USA Airshow: ఎయిర్ షోలో ఘోర ప్రమాదం.. ఆకాశంలోనే ఢీకొన్న యుద్ధ విమానాలు -
‘ప్రీమియం’ రిజిస్ట్రేషన్ రెడీ
సాక్షి, అమరావతి: ఆస్తుల క్రయ విక్రయాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఓ పెద్ద ప్రహసనం. అడుగడుగునా అవినీతి, డాక్యుమెంట్ రైటర్లు, మధ్యవర్తుల ప్రమేయం ఎక్కువ. ఇటువంటి కష్టాలు, అవినీతి లేకుండా ప్రజలకు సులభంగా, అత్యాధునిక పద్ధతుల్లో రిజిస్ట్రేషన్ సేవలు అందించాలన్నది సీఎం వైఎస్ జగన్ లక్ష్యం. ఇందుకోసం సీఎం జగన్ నేతృత్వంలో ప్రీమియం రిజిస్ట్రేషన్ సర్వీస్ సెంటర్లకు అధికారులు రూపకల్పన చేశారు. అవినీతికి ఆస్కారం లేకుండా, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా, వినియోగదారులకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా ప్రభుత్వం ప్రీమియం రిజిస్ట్రేషన్ సెంటర్లను అందుబాటులోకి తెస్తోంది. పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల తరహాలో కార్పొరేట్ స్థాయిలో అత్యాధునిక సౌకర్యాలతో ఇక్కడ సేవలు అందుతాయి. తొలి దశలో 9 సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు. పైలట్ ప్రాజెక్టుగా విశాఖపట్నం, శ్రీకాకుళంలో రెండు సెటర్లు ఏర్పాటు చేస్తున్నారు. వీటి ఏర్పాటుపై ఇప్పటికే నోటిఫికేషన్ వెలువడింది. విశాఖ మధురవాడ సెజ్‌లోని టవర్–బిలో ఏర్పాటు చేసిన తొలి ప్రీమియం రిజిస్ట్రేషన్ సర్వీస్ సెంటర్ ఇప్పటికే అన్ని హంగులతో సిద్ధమైంది. దీనిని త్వరలోనే ప్రారంభించనున్నారు. ఆ తర్వాత శ్రీకాకుళంలో రెండోది ఏర్పాటు చేస్తారు. అనంతరం విజయవాడ, గుంటూరు, కాకినాడ, నెల్లూరు, తిరుపతి, కర్నూలు, కడపలో ఏర్పాటు చేస్తారు. సోమవారం దీనిపై ముఖ్యమంత్రితో అధికారులు సమావేశమవనున్నారు. ఆయన అంగీకరించిన వెంటనే విశాఖలో పైలట్ ప్రాజెక్టు మొదలు పెడతారు. ఈ సెంటర్ల పనితీరు, ప్రజల నుంచి వచ్చిన స్పందననుబట్టి దశలవారీగా రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఆన్లైన్ స్లాట్ బుకింగ్.. సింగిల్ విండో రిజిస్ట్రేషన్లు ఈ సెంటర్లలో ఫ్రంట్ ఎండ్ (ముందు భాగం)లో అవుట్సోర్సింగ్ సిబ్బంది, డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఉంటారు. బ్యాక్ ఎండ్‌లో సబ్ రిజిస్ట్రార్, ఇతర సిబ్బంది పనిచేస్తారు. మొదట కొద్ది రోజులు ఆఫ్‌లైన్ సేవలు అందించినా, ఆ తర్వాత అన్నీ ఆన్లైన్ సేవలే ఉండేలా వీటిని డిజైన్ చేశారు. వినియోగదారులు ఆన్లైన్లో స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. దాని ప్రకారం సెంటర్‌కు వెళ్లి సింగిల్ విండో కింద రిక్వెస్ట్ పెడితే ఆన్లైన్లో సంబంధిత సేవా ప్రక్రియ మొదలవుతుంది. వినియోగదారులే తమ సమాచారాన్ని నమోదు (డేటా ఎంట్రీ) చేసుకోవచ్చు. అది ఆన్లైన్లోనే సబ్ రిజిస్ట్రార్‌కి వెళుతుంది. సబ్ రిజిస్ట్రార్ పరిశీలించి ఆధార్ వెరిఫికేషన్ చేస్తారు. అనంతరం ప్రోపర్టీ వెరిఫికేషన్‌ను సంబంధిత ప్రభుత్వ శాఖ వెబ్సైట్ ద్వారా పరిశీలిస్తారు. అది సక్రమంగా ఉంటే రిజిస్ట్రేషన్ ప్రక్రియ వెంటనే పూర్తి చేస్తారు. ఇక్కడ డాక్యుమెంట్ రైటర్ల ప్రమేయం ఏమాత్రం ఉండదు. రిజిష్ట్రేషన్ అయిన వెంటనే చేయించుకున్న వారికి పూర్తయినట్లు మెసేజ్ వెళుతుంది. రిజిస్ట్రేషన్లు, మార్కెట్ విలువ మదింపు, ఈసీలు, సీసీలు, స్టాంపుల అమ్మకాలన్నీ ఇక్కడే జరుగుతాయి. స్టాంప్ డ్యూటీ కలెక్షన్లను స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ నిర్వహిస్తుంది. ఇందుకోసం ఆ సంస్థ అక్కడ ఒక బ్రాంచిని ఏర్పాటు చేస్తుంది. దాని ద్వారా అక్కడికక్కడే ఆన్లైన్లో చెల్లింపులు చేయొచ్చు. ప్రస్తుతానికి ఇప్పటికే పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ సిబ్బందిని వినియోగించనున్నారు. అవసరాన్నిబట్టి ఫ్రంట్ ఎండ్ సేవలను అవుట్సోర్సింగ్ ఏజెన్సీకి అప్పగించే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉంది. ఈ సెంటర్లలో వినియోగదారుల కోసం విశ్రాంతి గది, కెఫెటేరియా వంటి సదుపాయాలుంటాయి. అవినీతి రహితంగా, సులభంగా రిజిస్ట్రేషన్లు అవినీతి రహిత రిజిస్ట్రేషన్ సేవలు అందించడమే ప్రీమియం సెంటర్ల ప్రధాన ఉద్దేశం. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సులభంగా రిజిస్ట్రేషన్ సేవలు అందుతాయి. మధ్యవర్తుల ప్రమేయం ఉండదు. – డాక్టర్ రజత్ భార్గవ, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ -
దుమ్ము లేపిన హైదరాబాద్‌లో ఇల్లు అమ్మకాలు
-
6 నెలల్లో గృహ ప్రవేశం!
సాక్షి, హైదరాబాద్: సొంతిల్లు ప్రతి ఒక్కరి జీవితాశయం. పొదుపు చేసిన సొమ్ముతో, బ్యాంక్ రుణంతో ఎలాగోలా కల నెరవేర్చుకోవాలని భావిస్తుంటారు. కరోనా, లాక్డౌన్ సమయంలో నిర్మాణ పనులు నిలిచిపోయాయి. కానీ, కస్టమర్లకు గడువులోగా నిర్మాణం పూర్తి చేసి ఇవ్వాలి. అప్పుడే వాళ్లకు ఆనందం. అందుకే నిర్మాణ పనులు తుది దశకు చేరిన తర్వాత అమ్మకాలు ప్రారంభిస్తే కొనుగోలుదారులకు సులువుగా గృహ ప్రవేశం చేసే వీలుంటుంది. ఇదే లక్ష్యంతో 80% నిర్మాణ పనులు పూర్తయిన తర్వాత లాంచింగ్ చేసింది ఎస్ఎంఆర్ హోల్డింగ్స్. కొండాపూర్ నిర్మిస్తున్న ఐకానియాలో ఫేజ్–3 కింద హామిల్టన్, లోగాన్ టవర్లను ప్రారంభించాం. బుకింగ్ చేసిన 6, 18 నెలల్లో పూర్తయ్యే విధంగా వివిధ దశలలో టవర్ల నిర్మాణాలున్నాయని కంపెనీ సీఎండీ రాంరెడ్డి తెలిపారు. 22.5 ఎకరాలలో 55 లక్షల చ.అ. బిల్టప్ ఏరియాలో 2,500 ఫ్లాట్లను నిర్మిస్తుంది. 2025 చివరి నాటికి ప్రాజెక్ట్ మొత్తం పూర్తవుతుంది. ఫేజ్–1 నిర్మాణం పూర్తయింది. 3 బేస్మెంట్స్ + 20 అంతస్తులలో మొత్తం 400 ఫ్లాట్లుంటాయి. కొనుగోలుదారులు నివాసం ఉంటున్నారు. ఫేజ్–2లో స్టాన్లీ టవర్. త్రీ బేస్మెంట్లు + 27 అంతస్తులలో 538 యూనిట్లు. ఇప్పటికే 150 యూనిట్లు కొనుగోలుదారులకు అందించాం. 10–15 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి కూడా. మిగిలిన వాటిల్లో ఇంటీరియర్ పనులు జరుగుతున్నాయి. 3 నెలల్లో పూర్తవుతాయి. ♦ఫేజ్–3లో హామిల్టన్ టవర్. త్రీ బేస్మెంట్స్ + 30 అంతస్తులలో 240 యూనిట్లు. 80 శాతం నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఈ డిసెంబర్ నాటికి పూర్తి చేస్తాం. త్రీ బేస్మెంట్లు + 27 ఫ్లోర్లలో లోగాన్ టవర్ ఉంటుంది. ఇందులో 405 యూనిట్లుంటాయి. 60 శాతం నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ♦వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేస్తాం. శివాలిక్ టవర్ నిర్మాణం 40 శాతం పూర్తయింది. ఇందులో 589 యూనిట్లుంటాయి. 2024 చివరి నాటికి పూర్తవుతుంది. రానున్న విజయ దశమికి ఫేజ్–5లో ఎవరెస్ట్ టవర్‌ను ప్రారంభించనున్నాం. త్రీ బేస్మెంట్స్ + 35 అంతస్తుల్లో 280 ఫ్లాట్లుంటాయి. వినియోగంలో రెండు క్లబ్ హౌస్‌లు.. ఐకానియా ప్రాజెక్ట్‌లో రెండు క్లబ్ హౌస్లుంటాయి. ఒక్కోటి 60 వేల చ.అ.లలో ఉంటుంది. ఇప్పటికే వీటిని నివాసితులు వినియోగిస్తున్నారు కూడా. జిమ్, స్విమ్మింగ్ పూల్, బాంక్వెట్ హాల్, మినీ క్రికెట్ స్టేడియం, ఇండోర్ అండ్ ఔట్‌డోర్ గేమ్స్ వంటి అన్ని రకాల వసతులున్నాయి. ఇందులో గుడిని కూడా నిర్మిస్తున్నారు. అద్దె రూ.60 వేలపైనే.. ఐకానియాలో ఎక్కువగా కన్సల్టెంట్లు, సీనియర్ ఐటీ ఎగ్జిక్యూటివ్స్, అప్‌గ్రేడ్ హోమ్స్ ఫ్యామిలీలు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ఇందులో 3 బీహెచ్‌కే ఫ్లాట్ అద్దె నెలకు రూ.60–65 వేలు, 4 బీహెచ్‌కే రూ.70–75 వేలుగా ఉన్నాయి. 1.50 లక్షల చ.అ. కమర్షియల్ స్పేస్.. 1.50 లక్షల చ.అ. కమర్షియల్ స్పేస్‌ను కూడా అభివృద్ధి చేస్తుంది. ఉద్యోగుల కోసం కో–వర్కింగ్ స్పేస్, 40 వేల చ.అ. ఆసుపత్రి, డయాగ్నస్టిక్ సెంటర్‌తో పాటు సూపర్ మార్కెట్, బాంక్వెట్ హాల్, స్పా, బ్యాంక్, కన్వెన్షన్ సెంటర్ వంటి అన్ని రకాల వసతులుంటాయి. -
ఇలా చేస్తే ఏ స్థిరాస్తి అమ్మినా .. పన్ను భారం లేకుండా..
గతంలో ఏ ఆస్తి అమ్మితే ఆ ఆస్తినే మళ్లీ కొంటే పన్ను భారం ఉండదని తెలుసుకున్నాం. ఈవారం ఏ మూలధన ఆస్తి అమ్మినా మీకు మినహాయింపు రావాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం. 54 ఉఉ ప్రకారం సారాంశం ఏమిటంటే.. ♦ ఇది వ్యక్తులకు, హిందూ కుటుంబాలకు వర్తిస్తుంది ♦ ఏ మూలధన ఆస్తి (దీర్ఘకాలికం) అమ్మినా, వచ్చిన లాభాలను ఇన్వెస్ట్ చేయాలి ♦అమ్మినా 6 నెలల్లోగా చేయాలి ♦01–04–2019కి ముందు జారీ చేసిన యూనిట్లలో లేదా గవర్నమెంటు నోటిఫై చేసిన వాటిలో మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి ♦గరిష్ట పరిమితి రూ. 50,00,000 ♦ఎంత ఇన్వెస్ట్ చేశారో అంతకే మినహాయింపు ఉంటుంది ♦వీటిలో లాక్–ఇన్ పీరియడ్ 3 సంవత్సరాలు ♦3 సంవత్సరాల లోపల ఈ యూనిట్లు లేదా నోటిఫై చేసిన వాటిని అమ్మినా / బదిలీ చేసినా మినహాయింపు రద్దు అయిపోతుంది. 54 ఉఇ ప్రకారం ముఖ్యమైన విశేషాలు ఏమిటంటే.. ♦ఈ సెక్షన్ అందరికీ వర్తిస్తుంది ♦2018–19 అసెస్మెంట్ వరకూ ఏ మూలధన ఆస్తి అమ్మినా వర్తించింది (దీర్ఘకాలికం). ♦2019–20 అసెస్మెంట్ నుండి కేవలం భూమి, భవనం, జాగాతో కలిపి ఇల్లు (భవనం, ఫ్లాటు అన్నీ వస్తాయి) అమ్మగా ఏర్పడ్డ దీర్ఘకాలిక మూలధన లాభాలకు మాత్రమే వర్తిస్తుంది ♦బదిలీ జరిగిన తేదీ నుండి ఆరు (6) నెలల్లోగా ఇన్వెస్ట్ చేయాలి ♦నేషనల్ హైవే అథారిటీ, రూరల్ ఎలక్ట్రికల్ కార్పొరేషన్ జారీ చేసిన బాండ్లలో మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి ♦ఈ బాండ్ల కాలపరిమితి 5 సంవత్సరాలు ♦వీటి మీద వచ్చే వడ్డీపై పన్ను వర్తిస్తుంది ♦ఇక 5వ పాయింట్లో చెప్పిన రెండూ కాకుండా ప్రభుత్వ రంగ ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ జారీ చేసే బాండ్లను కూడా కేంద్రం నోటిఫై చేసింది. మినహాయింపు కావాలంటే వీటిలోనూ ఇన్వెస్ట్ చేయొచ్చు. ♦మీరు అన్నింట్లోనూ పెట్టుబడి పెట్టొచ్చు లేదా ఏదైనా ఒక దానిలోనైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. ♦మీరు కొన్న బాండ్లు కొన్న తేదీ నుండి 5 సంవత్సరాల వరకు బదిలీ చేయకూడదు. అలా చేస్తే మినహాయింపును రద్దు చేస్తారు. ♦ఎక్కువ ఇన్వెస్ట్ చేసినా లాభానికి వర్తించే దానికి మించి మినహాయింపు ఇవ్వరు. తక్కువ చేస్తే, చేసినంత మేరకే ఇస్తారు. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 50,00,000 దాటి ఇన్వెస్ట్ చేయరాదు ♦అలా అని మొదటి సంవత్సరం రూ. 50,00,000, రెండో ఏడాది రూ. 50,00,000 చేయడానికి వీలు లేదు (డిసెంబర్ తర్వాత అమ్మినప్పుడు ఇలాంటి అవకాశం ఉంది). ♦ఈ ఇన్వెస్ట్‌మెంట్‌కు 80సి మినహాయింపు లేదు. ♦వీటిని తనఖా పెట్టి అప్పు తీసుకుంటే ఆ అప్పుగా వచి్చన మొత్తం అంతా కూడా అమ్మకం ద్వారా వచ్చినట్లు లెక్క. అలా అప్పు తీసుకోకండి. ♦చివరగా కేవలం పన్ను భారాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకుని ఆలోచించకండి. మీ కుటుంబానికి సంబంధించిన ప్రాధాన్యతలు, మీ బాధ్యతలు ..పెళ్లి / చదువు / ముఖ్యమైనవి / రుణాలు చెల్లించడం మొదలైనవి చేయడం కూడా మంచి ప్లానింగే. చింత ఉండదు. శాంతి నెలకొంటుంది. -
ఎగబడి కొంటున్న జనం! హైదరాబాద్‌లో ఈ ధర ఇళ్లకు యమ డిమాండ్!
సాక్షి, హైదరాబాద్: ఒకవైపు కరోనా మహమ్మారి, మరోవైపు రాత్రికి రాత్రే పెరుగుతున్న నిర్మాణ సామగ్రి ధరలతో హైదరాబాద్ స్థిరాస్తి మార్కెట్ పీకల్లోతు కష్టాల్లో కొట్టుమిట్టాడుతుంది. ఇలాంటి సమయంలో రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు సరైన నిర్ణయం కాదని, దీంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు గృహాలను కొనలేరని స్థిరాస్తి నిపుణులు ప్రభుత్వాన్ని వేడుకున్నారు. అయినా సరే ప్రభుత్వం ఏవీ పట్టించుకోకుండా ఫిబ్రవరి 1 నుంచి రిజిస్ట్రేషన్ చార్జీలతో పాటూ మార్కెట్ విలువలను కూడా పెంచేసింది. ఫలితంగా గత నెలలో నగరంలో రిజిస్ట్రేషన్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోయాయి. మధ్య తరగతి గృహాల మార్కెట్‌గా పేరొందిన హైదరాబాద్ రియల్టీపై రిజిస్ట్రేషన్ చార్జీల పెంపు నిర్ణయం గట్టి దెబ్బే వేసింది. రూ.25 లక్షల కంటే తక్కువ ధర ఉన్న అపార్ట్మెంట్లపై రిజిస్ట్రేషన్ చార్జీల పెరుగుదల ఎక్కువ ప్రభావం చూపించింది. గత నెలలో ఈ కేటగిరీ కేవలం 844 అపార్ట్మెంట్లు మాత్రమే అమ్ముడుపోయాయి. అదే గతేడాది ఫిబ్రవరిలో ఈ విభాగంలో 2,888 ఫ్లాట్లు అమ్ముడుపోవటం గమనార్హం. 2021 ఫిబ్రవరిలో నగరంలోని గృహ విక్రయాలలో రూ.25 లక్షలలోపు ధర ఉన్న అపార్ట్మెంట్ల వాటా 42% కాగా.. ఈ ఏడాది ఫిబ్ర వరి నాటికిది 16%కి పడిపోయింది. ఈ ఏడాది జనవరిలో చూస్తే ఈ విభాగం విక్రయాల వాటా 32 శాతంగా ఉంది. క్షీణత రెండోసారి: 2022 ఫిబ్రవరిలో నగరంలో రూ.2,722 కోట్ల విలువ చేసే 5,146 యూనిట్లు విక్రయమయ్యాయి. ఇందులో 52 శాతం యూనిట్లు రూ.25–50 లక్షల మధ్య ధర ఉన్నవే. కాగా.. ఈ ఏడాది జనవరిలో రూ.2,695 కోట్ల విలువ చేసే 5,568 యూనిట్లు అమ్ముడుపోయాయి. గతేడాది ఫిబ్రవరిలో 6,877 యూనిట్లు విక్రయమయ్యాయి. అంటే ఏడాది కాలంతో పోలిస్తే అమ్మకాలు 25 శాతం తగ్గాయి. సేల్స్‌లో క్షీణత నమోదవటం 2022 ఆర్ధిక సంవత్సరంలో ఇది రెండోసారని నైట్‌ఫ్రాంక్ ఇండియా నివేదిక వెల్లడించింది. హైదరాబాద్‌లో ఈ ధర ఇళ్లకు డిమాండ్: గతేడాది ఫిబ్రవరిలో జరిగిన అపార్ట్మెంట్ విక్రయాలలో హైదరాబాద్ వాటా 20 శాతం ఉండగా..ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి 10 శాతానికి క్షీణించింది. మేడ్చల్–మల్కాజ్గిరి వాటా 39 శాతం నుంచి 42 శాతానికి, రంగారెడ్డి వాటా 37 శాతం నుంచి 43 శాతానికి, సంగారెడ్డి వాటా 4 శాతం నుంచి 5 శాతానికి పెరిగాయి. "రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షల మధ్య ధర ఉన్న గృహాల విక్రయాలు గతేడాది ఫిబ్రవరిలో 34 శాతం ఉండగా.. ఇప్పుడవి 52 శాతానికి వృద్ధి చెందాయి. అలాగే రూ.75 లక్షల నుంచి రూ.కోటి మధ్య ధర ఉన్న గృహాలు 7 శాతం నుంచి 9 శాతానికి, రూ.కోటి కంటే ఎక్కువ ధర ఉన్న గృహ విక్రయాలు 7 శాతం నుంచి 9 శాతానికి" పెరిగాయి. 16 శాతం డౌన్: గతేడాది ఫిబ్రవరిలోని గృహ విక్రయాలలో 1,000 చ.అ.లోపు విస్తీర్ణం ఉండే మధ్యతరగతి అపార్ట్మెంట్ల వాటా 19% ఉండగా.. ఇప్పుడవి 16 శాతానికి పడిపోయాయి. గత నెలలోని అమ్మకాలలో 74 శాతం అపార్ట్మెంట్లు 1,000 చ.అ. నుంచి 2,000 చ.అ. మధ్య విస్తీర్ణాలున్నవే. 2021 ఫిబ్రవరిలో వీటి వాటా 70%గా ఉంది. అలాగే 2,000 చ.అ. కంటే ఎక్కువ విస్తీర్ణమైన గృహాలు కూడా 10% నుంచి 11%కి వృద్ధి చెందాయి. చదవండి: దుమ్ముదులిపేస్తున్న ఇళ్ల అమ్మకాలు, ఆ 7 నగరాల్లో రాకెట్ సేల్స్ -
పీఎస్‌యూల ఆస్తుల విక్రయానికి ఈ–ప్లాట్ఫార్మ్..!
ప్రభుత్వ రంగ సంస్థల(పీఎస్‌యూల)లకు కీలకం కాని, నిరుపయోగంగా ఉన్న భూములు, ఆస్తుల విక్రయానికి ఆన్లైన్ ప్లాట్ఫార్మ్ను ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఆస్తుల నగదీకరణలో భాగంగా ప్రభుత్వ రంగ సంస్థల వద్ద మిగులుగా ఉన్న భూములు, ఆస్తులను కేంద్రం విక్రయిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ ఆస్తులకు సంబంధించి కొన్నింటికి న్యాయ వివాదాలు ఉండటం, ఇతరత్రా కారణాల వల్ల ఈ ఆస్తుల విక్రయం ఆశించినంతగా ఉండటం లేదు. ఈ సమస్యలను అధిగమించడానికి, సత్వరంగా ఆస్తులను విక్రయించడానికి ఆన్లైన్–ప్లాట్ఫార్మ్ను ఏర్పాటు చేయడమే సరైన మార్గమని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్లాట్ఫార్మ్ ద్వారా రూ.10,000 కోట్లు సమీకరించాలనేది కేంద్రం ఆలోచన. ఈ–ప్లాట్ఫార్మ్పై బడ్జెట్లో ప్రకటన! పీఎస్‌యూలకు సంబంధించి కీలకం కాని ఆస్తులను విక్రయించడానికి ఈ–బిడ్డింగ్ ప్లాట్ఫార్మ్ను రూపొందించాలని కేంద్రం ఇటీవలనే ప్రభుత్వ రంగ సంస్థ, ఎమ్ఎస్టీసీని ఆదేశించిందని సమాచారం. పీఎస్‌యూల భూములు, ఆస్తులకు సంబంధించి ఈ ప్లాట్ఫార్మ్.. వన్–స్టాప్ షాప్‌గా పనిచేస్తుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ ప్లాట్ఫార్మ్ ఏర్పాటుకు కనీసం నెల రోజులు పడుతుందని, దీనికి సంబంధించిన ప్రకటన ఈ ఏడాది బడ్జెట్ ప్రతిపాదనల్లో ఉండే అవకాశాలున్నాయని ఆ వర్గాలు వెల్లడించాయి. ఈ ప్లాట్ఫార్మ్కు దీపమ్(డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్) సమన్వయ సహకారాలనందిస్తుంది. వ్యూహాత్మక వాటా విక్రయానికి ఉద్దేశించిన పీఎస్‌యూల ఆస్తులను తొలుతగా ఈ ప్లాట్ఫార్మ్ ద్వారా విక్రయించే ప్రయత్నాలు చేస్తారు. ఇప్పటికే కొన్ని ఆస్తులను గుర్తించారు. బీఎస్ఎన్ఎల్, ఎమ్టీఎన్ఎల్, బీఈఎమ్ఎల్ తదితర సంస్థల ఆస్తులు దీంట్లో ఉన్నాయి. డిజిటల్ టెక్నాలజీ ఉత్తమం.... కీలకం కాని, వృ«థాగా ఉన్న పీఎస్‌యూల భూములను, ఆస్తులను విక్రయించాలని గత కొన్నేళ్లుగా పీఎస్యూలపై కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెస్తోంది. న్యాయ సంబంధిత వివాదాలు, ఇతరత్రా కారణాల వల్ల పీఎస్‌యూలు ఈ ఆస్తుల విక్రయంలో విఫలమవుతున్నాయి. ఈ వ్యవహారం ఒకడుగు ముందుకు, మూడు అడుగులు వెనక్కు.. అన్న చందంగా తయారైంది. ఇలాంటి ఆస్తుల విక్రయానికి డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించుకోవడం ఉత్తమమని నిపుణులు అంటున్నారు. ఈ ప్లాట్ఫార్మ్ ఎలా పనిచేస్తుందంటే.. ► ఈ–బిడ్డింగ్ ప్లాట్ఫార్మ్ ఏర్పాటు చేస్తారు ► విక్రయించే పీఎస్‌యూల భూములు, ఆస్తులను ఈ ప్లాట్ఫార్మ్పై నమోదు చేస్తారు ► ఎమ్‌ఎస్‌టీసీ, దీపమ్ల పర్యవేక్షణ ఉంటుంది ► రూ.100 కోట్లకు మించిన ఆస్తులనే అమ్మకానికి పెడతారు. ► వేలంలో పాల్గొనే సంస్థలు ఎమ్‌ఎస్‌టీసీ వద్ద నమోదు చేసుకోవాలి ► అసెట్ వేల్యూయార్చే ఆస్తుల విలువ నిర్ధారిస్తారు ► ఆస్తుల కొనుగోళ్లకు ఆసక్తి గల సంస్థల నుంచి బిడ్లు ఆహ్వానిస్తారు ► ఈ–వేలం నిర్వహిస్తారు ► వేలం అనంతర ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేస్తారు -
ఆస్తి అమ్మకాలకు మరింత కష్టకాలం
న్యూఢిల్లీ : రియల్ ఎస్టేట్ స్టాక్స్‌కు మంచి ఏడాది ఏదైనా ఉందంటే అది 2007నే. అప్పటినుంచి ఇప్పటివరకు మార్కెట్లో రియాల్టీ స్టాక్స్ కోలుకోలేని దెబ్బతింటున్నాయి. ప్రతేడాది 85 శాతం కుప్పకూలుతూ వస్తున్నాయి. 2007 డిసెంబర్ నుంచి 2017 జనవరి 25 వరకు బీఎస్ఈ రియాల్టీ సూచీ దాదాపు 90 శాతం పడిపోయింది. దీనికి తోడు పెద్ద నోట్లను రద్దు చేస్తూ 2016 నవంబర్8న కేంద్రం తీసుకున్న సంచలన నిర్ణయం. వీటికి మరింత ప్రతికూలంగా మారింది. బ్లాక్‌మనీకి వ్యతిరేకంగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి 2017లోనూ ఆస్తి అమ్మకాలు మరో 30 శాతం కిందకి పడిపోతాయట. ఫిచ్ రేటింగ్స్ అంచనాల ప్రకారం దేశంలో ప్రాపర్టీ అమ్మకాలు 20-30 శాతం కిందకి పడిపోతాయని తెలిసింది. పెద్ద నోట్ల రద్దు, ఇతర అంశాలు గృహ కొనుగోలుదారుల్లో సెంటిమెంట్‌ను మరింత బలహీనపరిచాయని రేటింగ్ సంస్థ పేర్కొంది. నోట్ల రద్దుతో గృహాల కొనుగోలుకు డిమాండ్ తగ్గడంతో బిల్డర్స్ చుక్కలు చూస్తున్నారు. డిమాండ్ బలహీన దశలో ఉండటంతో ఆస్తుల అమ్మక ధరలు తగ్గించడానికి బిల్డర్స్ వెనుకాడటం లేదు. లిక్విడిటీపై మరిన్ని ఆంక్షలను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఒకవేళ ఈ బడ్జెట్లో లిక్విడిటీపై ఆంక్షలు పెరిగితే రియాల్టీ అమ్మకాలు 2017లోనూ కష్టకాలం ఎదుర్కోవాల్సి వస్తుందని ఫిచ్ తెలిపింది. ఈ ఏడాది గృహ ధరలు భారీగా తగ్గుతాయని ఫిచ్ అంచనావేస్తోంది. నైట్ ఫ్రాంక్ రీసెర్చ్ అంచనా ప్రకారం రెసిడెన్షియల్ ప్రాపర్టీ అమ్మకాలు 2016 చివరి త్రైమాసికంలో యేటికేటికి 44 శాతం పడిపోతాయని, మొత్తంగా అమ్మకాలు 9 శాతం క్షీణిస్తాయని తెలుస్తోంది. దీంతో మార్కెట్లో రియాల్టీ స్టాక్స్ మరింత పడిపోనున్నాయట. యూనిటెక్, హెచ్‌డీఐఎల్, శోభా డెవలపర్స్, ప్రెస్టేజి ఎస్టేట్స్, గోద్రేజ్ ప్రాపర్టీస్ వంటివి భారీగా క్షీణించనున్నాయట. ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్, లోధా డెవలపర్స్ వాటి బ్రాండ్ విలువతో కొంత లాభపడొచ్చని రిపోర్టులు పేర్కొంటున్నాయి.