గతంలో ఏ ఆస్తి అమ్మితే ఆ ఆస్తినే మళ్లీ కొంటే పన్ను భారం ఉండదని తెలుసుకున్నాం. ఈవారం ఏ మూలధన ఆస్తి అమ్మినా మీకు మినహాయింపు రావాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం.
54 ఉఉ ప్రకారం సారాంశం ఏమిటంటే..
♦ ఇది వ్యక్తులకు, హిందూ కుటుంబాలకు వర్తిస్తుంది
♦ ఏ మూలధన ఆస్తి (దీర్ఘకాలికం) అమ్మినా, వచ్చిన లాభాలను ఇన్వెస్ట్ చేయాలి
♦అమ్మినా 6 నెలల్లోగా చేయాలి
♦01–04–2019కి ముందు జారీ చేసిన యూనిట్లలో లేదా గవర్నమెంటు నోటిఫై చేసిన వాటిలో మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి
♦గరిష్ట పరిమితి రూ. 50,00,000
♦ఎంత ఇన్వెస్ట్ చేశారో అంతకే మినహాయింపు ఉంటుంది
♦వీటిలో లాక్–ఇన్ పీరియడ్ 3 సంవత్సరాలు
♦3 సంవత్సరాల లోపల ఈ యూనిట్లు లేదా నోటిఫై చేసిన వాటిని అమ్మినా / బదిలీ చేసినా మినహాయింపు రద్దు అయిపోతుంది.
54 ఉఇ ప్రకారం ముఖ్యమైన విశేషాలు ఏమిటంటే..
♦ఈ సెక్షన్ అందరికీ వర్తిస్తుంది
♦2018–19 అసెస్‌మెంట్ వరకూ ఏ మూలధన ఆస్తి అమ్మినా వర్తించింది (దీర్ఘకాలికం).
♦2019–20 అసెస్‌మెంట్ నుండి కేవలం భూమి, భవనం, జాగాతో కలిపి ఇల్లు (భవనం, ఫ్లాటు అన్నీ వస్తాయి) అమ్మగా ఏర్పడ్డ దీర్ఘకాలిక మూలధన లాభాలకు మాత్రమే వర్తిస్తుంది
♦బదిలీ జరిగిన తేదీ నుండి ఆరు (6) నెలల్లోగా ఇన్వెస్ట్ చేయాలి
♦నేషనల్ హైవే అథారిటీ, రూరల్ ఎలక్ట్రికల్ కార్పొరేషన్ జారీ చేసిన బాండ్లలో మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి
♦ఈ బాండ్ల కాలపరిమితి 5 సంవత్సరాలు
♦వీటి మీద వచ్చే వడ్డీపై పన్ను వర్తిస్తుంది
♦ఇక 5వ పాయింట్లో చెప్పిన రెండూ కాకుండా ప్రభుత్వ రంగ ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ జారీ చేసే బాండ్లను కూడా కేంద్రం నోటిఫై చేసింది. మినహాయింపు కావాలంటే వీటిలోనూ ఇన్వెస్ట్ చేయొచ్చు.
♦మీరు అన్నింట్లోనూ పెట్టుబడి పెట్టొచ్చు లేదా ఏదైనా ఒక దానిలోనైనా ఇన్వెస్ట్ చేయొచ్చు.
♦మీరు కొన్న బాండ్లు కొన్న తేదీ నుండి 5 సంవత్సరాల వరకు బదిలీ చేయకూడదు. అలా చేస్తే మినహాయింపును రద్దు చేస్తారు.
♦ఎక్కువ ఇన్వెస్ట్ చేసినా లాభానికి వర్తించే దానికి మించి మినహాయింపు ఇవ్వరు. తక్కువ చేస్తే, చేసినంత మేరకే ఇస్తారు. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 50,00,000 దాటి ఇన్వెస్ట్ చేయరాదు
♦అలా అని మొదటి సంవత్సరం రూ. 50,00,000, రెండో ఏడాది రూ. 50,00,000 చేయడానికి వీలు లేదు (డిసెంబర్ తర్వాత అమ్మినప్పుడు ఇలాంటి అవకాశం ఉంది).
♦ఈ ఇన్వెస్ట్‌మెంట్‌కు 80సి మినహాయింపు లేదు.
♦వీటిని తనఖా పెట్టి అప్పు తీసుకుంటే ఆ అప్పుగా వచి్చన మొత్తం అంతా కూడా అమ్మకం ద్వారా వచ్చినట్లు లెక్క. అలా అప్పు తీసుకోకండి.
♦చివరగా కేవలం పన్ను భారాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకుని ఆలోచించకండి. మీ కుటుంబానికి సంబంధించిన ప్రాధాన్యతలు, మీ బాధ్యతలు ..పెళ్లి / చదువు / ముఖ్యమైనవి / రుణాలు చెల్లించడం మొదలైనవి చేయడం కూడా మంచి ప్లానింగే. చింత ఉండదు. శాంతి నెలకొంటుంది.
ఇలా చేస్తే ఏ స్థిరాస్తి అమ్మినా .. పన్ను భారం లేకుండా..
Published Mon, Jul 4 2022 11:31 AM | Last Updated on Mon, Jul 4 2022 1:39 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment