Buying land
-
ఇలా చేస్తే ఏ స్థిరాస్తి అమ్మినా .. పన్ను భారం లేకుండా..
గతంలో ఏ ఆస్తి అమ్మితే ఆ ఆస్తినే మళ్లీ కొంటే పన్ను భారం ఉండదని తెలుసుకున్నాం. ఈవారం ఏ మూలధన ఆస్తి అమ్మినా మీకు మినహాయింపు రావాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం. 54 ఉఉ ప్రకారం సారాంశం ఏమిటంటే.. ♦ ఇది వ్యక్తులకు, హిందూ కుటుంబాలకు వర్తిస్తుంది ♦ ఏ మూలధన ఆస్తి (దీర్ఘకాలికం) అమ్మినా, వచ్చిన లాభాలను ఇన్వెస్ట్ చేయాలి ♦అమ్మినా 6 నెలల్లోగా చేయాలి ♦01–04–2019కి ముందు జారీ చేసిన యూనిట్లలో లేదా గవర్నమెంటు నోటిఫై చేసిన వాటిలో మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి ♦గరిష్ట పరిమితి రూ. 50,00,000 ♦ఎంత ఇన్వెస్ట్ చేశారో అంతకే మినహాయింపు ఉంటుంది ♦వీటిలో లాక్–ఇన్ పీరియడ్ 3 సంవత్సరాలు ♦3 సంవత్సరాల లోపల ఈ యూనిట్లు లేదా నోటిఫై చేసిన వాటిని అమ్మినా / బదిలీ చేసినా మినహాయింపు రద్దు అయిపోతుంది. 54 ఉఇ ప్రకారం ముఖ్యమైన విశేషాలు ఏమిటంటే.. ♦ఈ సెక్షన్ అందరికీ వర్తిస్తుంది ♦2018–19 అసెస్మెంట్ వరకూ ఏ మూలధన ఆస్తి అమ్మినా వర్తించింది (దీర్ఘకాలికం). ♦2019–20 అసెస్మెంట్ నుండి కేవలం భూమి, భవనం, జాగాతో కలిపి ఇల్లు (భవనం, ఫ్లాటు అన్నీ వస్తాయి) అమ్మగా ఏర్పడ్డ దీర్ఘకాలిక మూలధన లాభాలకు మాత్రమే వర్తిస్తుంది ♦బదిలీ జరిగిన తేదీ నుండి ఆరు (6) నెలల్లోగా ఇన్వెస్ట్ చేయాలి ♦నేషనల్ హైవే అథారిటీ, రూరల్ ఎలక్ట్రికల్ కార్పొరేషన్ జారీ చేసిన బాండ్లలో మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి ♦ఈ బాండ్ల కాలపరిమితి 5 సంవత్సరాలు ♦వీటి మీద వచ్చే వడ్డీపై పన్ను వర్తిస్తుంది ♦ఇక 5వ పాయింట్లో చెప్పిన రెండూ కాకుండా ప్రభుత్వ రంగ ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ జారీ చేసే బాండ్లను కూడా కేంద్రం నోటిఫై చేసింది. మినహాయింపు కావాలంటే వీటిలోనూ ఇన్వెస్ట్ చేయొచ్చు. ♦మీరు అన్నింట్లోనూ పెట్టుబడి పెట్టొచ్చు లేదా ఏదైనా ఒక దానిలోనైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. ♦మీరు కొన్న బాండ్లు కొన్న తేదీ నుండి 5 సంవత్సరాల వరకు బదిలీ చేయకూడదు. అలా చేస్తే మినహాయింపును రద్దు చేస్తారు. ♦ఎక్కువ ఇన్వెస్ట్ చేసినా లాభానికి వర్తించే దానికి మించి మినహాయింపు ఇవ్వరు. తక్కువ చేస్తే, చేసినంత మేరకే ఇస్తారు. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 50,00,000 దాటి ఇన్వెస్ట్ చేయరాదు ♦అలా అని మొదటి సంవత్సరం రూ. 50,00,000, రెండో ఏడాది రూ. 50,00,000 చేయడానికి వీలు లేదు (డిసెంబర్ తర్వాత అమ్మినప్పుడు ఇలాంటి అవకాశం ఉంది). ♦ఈ ఇన్వెస్ట్‌మెంట్‌కు 80సి మినహాయింపు లేదు. ♦వీటిని తనఖా పెట్టి అప్పు తీసుకుంటే ఆ అప్పుగా వచి్చన మొత్తం అంతా కూడా అమ్మకం ద్వారా వచ్చినట్లు లెక్క. అలా అప్పు తీసుకోకండి. ♦చివరగా కేవలం పన్ను భారాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకుని ఆలోచించకండి. మీ కుటుంబానికి సంబంధించిన ప్రాధాన్యతలు, మీ బాధ్యతలు ..పెళ్లి / చదువు / ముఖ్యమైనవి / రుణాలు చెల్లించడం మొదలైనవి చేయడం కూడా మంచి ప్లానింగే. చింత ఉండదు. శాంతి నెలకొంటుంది. -
మళ్లీ భూ సేకరణ !
- ‘కియా’ కోసం మరో 2 వేల ఎకరాలను సేకరించనున్న ప్రభుత్వం ? పెనుకొండ : కియా కార్ల పరిశ్రమకు ప్రస్తుతం 600 ఎకరాల భూమిని సేకరించిన రాష్ట్ర ప్రభుత్వం మరో 2 వేల ఎకరాల భూమిని సేకరించడానికి రంగం సిద్ధమైందన్న వార్తలు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. మొదటి విడతలో సేకరించిన భూమిలో ఇప్పటికే రూ. 177 కోట్లతో భూమి చదును పనులు ప్రారంభం కాగా ఆ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. రైతుకు ఎకరాకు రూ.10.50 లక్షలు పరిహారంగా ఇచ్చిన ప్రభుత్వం చదునుకు మాత్రం ఎకరాకు దాదాపుగా రూ. 30 లక్షలు మంజూరు చేసింది. ఇందులో కూడా భారీ కుంభకోణం దాగి ఉందనే విమర్శలున్నాయి. అయితే దీనిని ఏ మాత్రం పట్టించుకోని ప్రభుత్వం మరోసారి 2 వేల ఎకరాల భూమిని సేకరించడానికి రంగం సిద్ధమైందని రైతులు చెబుతున్నారు. మూడు ప్రాంతాల్లో ఈ భూములను సేకరించి కియా కార్ల సంస్థకు అనుగుణంగా భూమి దగ్గర ప్రాంతంలో ఉండేలా కేటాయించాలని అధికారులు నిర్ణయించారని అంటున్నారు. ఈ ప్రాంతంలో భూములు కొన్న పలువురు ఔత్సాహికులు సైతం ఆందోళనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎకరా భూమిని ఏకంగా కోటి రూపాయలకు దరిదాపుల్లో అగ్రిమెంట్లు కుదుర్చుకున్న బెంగళూరు,. చెన్నై వ్యాపారవేత్తలు ప్రస్తుతం ఆ భూములను అమ్ముకుంటే చాలన్న అభిప్రాయంతో ఉన్నట్లు సమాచారం. దుద్దేబండ రహదారి ప్రక్కన, రైల్వే ట్రాక్ సమీపంలో, ఎర్రమంచి, హరిపురం, వెంకటగిరిపాళ్యం గ్రామాల సమీపంలో ఈ భూసేకరణ ఉంటుందన్న ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. ఆరంభంలోనే ప్రభుత్వం 2500 ఎకరాల భూమిని సేకరించడానికి ప్రయత్నించగా వైఎస్సార్సీపీ తీవ్రంగా వ్యతిరేకించింది. పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి రైతులకు మద్దతుగా అమ్మవారుపల్లి వద్ద సమావేశం కూడా నిర్వహించి ప్రభుత్వ చర్యలను తీవ్రంగా ఖండించారు. రైతుల కోసం రిజర్వాయర్ నిర్మిస్తే దానిని పారిశ్రామిక వేత్తలకు దారాదత్తం చేసినట్లు అవుతోందని విమర్శించారు. దీంతో అప్పట్లో ప్రభుత్వం వెనకడుగు వేసింది. పనులు ప్రారంభం కాగానే మళ్లీ భూసేకరణ పై ఊహాగానాలు జోరందుకోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. రికార్డులు సేకరిస్తున్నాము - ఆర్డీఓ రామమూర్తి ప్రస్తుతం ప్రభుత్వ ఆదేశాల మేరకు రెండో విడతలో 600 ఎకరాలకు రైతుల నుంచి రికార్డులు సేకరిస్తున్నాము. పూర్తి నివేదికను సిద్ధం చేసి ఉన్నతాధికారులకు పంపుతాము. ఇప్పటికే పలువురు రైతులు తమ భూములకు సంబంధించిన రికార్డులు అందించారు. -
మళ్లీ ‘భూమ్’
నగరంలో పుంజుకున్న క్రయవిక్రయాలు వరంగల్, సాగర్, విజయవాడ హైవేలలో అధికం రిజిస్ట్రేషన్ల శాఖకు లక్ష్యానికి మించి ఆదాయం సిటీబ్యూరో: మహా నగరంలో మళ్లీ భూ క్రయవిక్రయాలు జోరందుకుంటున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి అర్థభాగంలో రికార్డు స్థాయిలో క్రయవిక్రయాలు సాగాయి. దీంతో నగరంలో మళ్లీ రియల్ రంగం పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో 1,44,959 రిజిస్ట్రేషన్లతో రూ.1038 కోట్ల ఆదాయం సమకూరింది. రిజిస్ట్రేషన్ల శాఖ టార్గెట్ మేరకు హైదరాబాద్‌లో 98, రంగారెడ్డి జిల్లాలో 80.10 శాతం రిజిస్ట్రేషన్లు జరిగాయి. గత మూడేళ్లతో పోలిస్తే ఈ ఏడాది పరిస్థితి ఎంతో మెరుగుపడింది. వచ్చే ఐదు నెలల్లో మరింత సానుకూలమవుతుందని... ఐటీ జోన్ సహా కరీంనగర్, నిజామాబాద్ రూట్లలోనూ క్రయ విక్రయాలు పెరిగే అవకాశం ఉందని రిజిస్ట్రేషన్ల శాఖ అంచనా. వరంగల్, సాగర్ హైవేలపై ఊపు ప్రస్తుత సంవత్సరంలో నగర శివార్లలో భూ క్రయవిక్రయాలు అధికంగా ఉన్నాయి. ఉప్పల్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం సబ్రిజిస్ట్రార్ల పరిధిలో లక్ష్యానికి మించి రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. యాదాద్రి దేవస్థానం అభివృద్ధికి తోడు బీబీనగర్ ఎయిమ్స్ ఏర్పాటు... ఇన్పోసిస్ విస్తరణ, ఘట్కేసర్ నుంచి ఔటర్ రింగురోడ్డు అందుబాటులోకి రావటంతో ఉప్పల్, బోడుప్పల్ పరిధిలో భూములకు అనూహ్యంగా డిమాండ్ పెరిగింది. ఆదిభట్లలో టాటా ఏరోస్పెస్, టీసీఎస్, ముచ్చర్ల ఫార్మాసిటీ, రాచకొండలో చిత్రనగరి నిర్మాణానికి సన్నాహాలు సాగుతున్నాయి. దీంతో మహేశ్వరం, ఇబ్రహీంపట్నం పరిధిలోనూ ‘భూం’ జోరందుకుంది. హైదరాబాద్- రంగారెడి జిల్లాల్లో గత సంవత్సరంతో పోలిస్తే... ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు దస్తావేజుల సంఖ్య అదనంగా 34,105 పెరుగగా.... రూ.181 కోట్లు అధికంగా ఆదాయం వచ్చింది. ఇప్పటికే రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్‌ల శాఖ 86.5 శాతానికి పైగా లక్ష్యం సాధించినట్టు అధికారులు చెబుతున్నారు. వచ్చే ఆరు నెలల్లో పరిస్థితి మరింత ఆశాజనకంగా ఉంటుందని... మూడేళ్ల తరువాత ఈ ఏడాది లక్ష్యాన్ని దాటబోతున్నామని స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 26 శాతం అధికంగా నమోదు: నగర శివార్లలో మళ్లీ క్రయవిక్రయాలు ఊపందుకోవడం సంతోషకరం. తెలంగాణ జిల్లాలను కలిపే రహదారుల వెంట రిజిస్ట్రేషన్ల సంఖ్య భారీగా పెరుగుతోంది. వరంగల్ హైవేను ఆనుకొని ఉన్న ఉప్పల్ ప్రాంతంలో గత ఏడాదితో పోలిస్తే 26శాతం అధికంగా క్రయ విక్రయాలు సాగాయి. ఇప్పటికే తొమ్మిది వేల డాక్యుమెంట్లు రిజిస్టరయ్యాయి. గోన విష్ణువర్ధన్‌రావు, అధ్యక్షులు, స్టాంప్స్ ఆండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ