భూమి ఫ్లాట్‌గా ఉందని నిరూపించడానికి యూట్యూబర్ అత్యంత సాహసానికి పూనుకున్నాడు. ఏకంగా రూ. 31 లక్షలతో యాత్ర చేశాడు. చివరికి ఏమైంది? ఆసక్తిగా ఉంది కదూ. పదండి అసలేమైందో ఈ కథనంలో తెలుసుకుందాం.
భూమి బల్లపరుపుగా లేదా ఫ్లాట్‌గా ఉంటుందని గట్టిగా వాదన ఇప్పటిది కాదు. అయితే ఫ్లాట్‌గా ఉంటుందని గట్టిగా నమ్మేవాళ్లు ఎందరో ఉన్నారు. తాజాగా ఫ్లాట్ ఎర్త్ సిద్ధాంతాలపై పేరుగాంచిన యూట్యూబర్ జెరన్ కాంపనెల్లా (Jeron Campanella) భూమి ఆకారం గుండ్రంగా లేదు అని తేల్చాలను కున్నాడు. తన వాదనలను ధృవీకరించడానికి అంటార్కిటికాకు రూ. 31.4 లక్షల (37,000 డాలర్లు) ఖర్చుతో కూడిన యాత్ర చేశాడు.
NEW: Flat Earther travels all the way to Antarctica to prove that the Earth is flat only to find out that it's not.
Lmao.
Flat Earth YouTuber Jeran Campanella went on a $35,000 trip to prove that there was "no 24-hour sun."
"Sometimes you are wrong in life and I thought there… pic.twitter.com/8jvLWawB2J— Collin Rugg (@CollinRugg) December 18, 2024
తన ప్రయాణానికి ముందు, కాంపనెల్లా అంటార్కిటికాలో ఉదయాస్తమాలు లేకుండా సూర్యుడు 24 గంటలూ ఉంటాడనే సిద్ధాంతాన్ని నమ్మలేదు. దక్షిణ ఖండానికి అతని పర్యటన ఈ నమ్మకాలను బద్దలు కొట్టింది.
కాంపనెల్లా ప్రయాణం కొలరాడో పాస్టర్ విల్ డఫీ నేతృత్వంలో తన నమ్మకాన్ని పరీక్షించడానికి కాలిఫోర్నియా(California) నుంచి దాదాపు 14,000 కిలోమీటర్లు ప్రయాణించి అంటార్కిటాకు చేరాడు. అక్కడ మిడ్‌నైట్ సన్‌ని చూసి షాక్ అయ్యాడు. “అంటార్కిటికా ఓ మంచు గోడ, సూర్యుడు రోజూ ఉదయిస్తాడు, అస్తమిస్తాడు” అన్న తన నమ్మకం నిజంకాదని తేల్చుకున్నాడు.
"కొన్నిసార్లు జీవితంలో తప్పు చేస్తాం," అంటూ కాంపనెల్లా తన పర్యటన తర్వాత ఒక వీడియోను షేర్ చేశాడు. తన తప్పును అంగీకరిస్తూ, ఫ్యాన్స్‌కు వివరణ ఇచ్చాడు "ఇలా చెప్పినందుకు నన్ను షిల్ అని పిలుస్తారని నాకు తెలుసు. అయినా నష్టంలేదు, నిజాయితీగా ఉండటం ముఖ్యం" అంటూ అసలు విషయాన్ని అంగీకరించాడు.
ట్విస్ట్ ఏంటంటే...
తన ఫ్లాట్ ఎర్త్ మ్యాప్ తప్పని తేలిందని అంగీకరించిన కాంపనెల్లా చేసిన మరో ప్రయోగం కూడా ఉంది. కాంపనెల్లా ప్రయాణం కొలరాడో పాస్టర్ విల్ డఫీ నేతృత్వంలోని ‘ది ఫైనల్ ఎక్స్‌పెరిమెంట్’ అనే కార్యక్రమంలో భాగమే ఈ పర్యటన. భూమి ఫ్లాట్‌గా ఉందని నమ్మే నలుగురు మిడ్‌నైట్ సన్‌ని ప్రత్యక్షంగా చూసేందుకు అంటార్కిటికాకు వెళ్లారు. చివరికి భూమి గోళాకారమని శాస్త్రీయంగా నిరూపించారు.
‘‘ఈ ప్రయోగంతో భూమి ఫ్లాట్‌గా ఉందనే వాదనకు ముగింపు పలకవచ్చు”అని డఫీ ధీమాగా చెప్పారు. దీంతో భూమి ఆకారాన్ని దాచడానికి ఎవరినీ అనుమతించరని ప్రచారంలో ఉన్న వాదనలకు కూడా చెక్‌పడింది. ఎలాంటి ఆంక్షలు లేకుండా ఎవరైనా అంటార్కిటికాను సందర్శించవచ్చని తేలింది.
భూమి గోళాకారంలో అనడానికి నిదర్శనంగా అంటార్కిటికాలో దక్షిణ వేసవిలో సూర్యుడు అస్తమించడు. ఇక్కడ వేసవిలో సూర్యుడు 24 గంటలూ కనిపిస్తాడు. ఈ దృగ్విషయం, ధ్రువ ప్రాంతాలకు ప్రత్యేకమైనది.
కాగా గతంలో భూమి గుండ్రంగా లేదని, బల్లపరుపుగా ఉందని నమ్మే ఓ అమెరికన్ పైలట్ తన అభిప్రాయం నిజమని నిరూపిస్తానంటూ ఈ రాకెట్ ప్రయోగం చేపట్టిన సంగతి గుర్తుందా? సొంతంగా తయారు చేసిన ఆవిరితో ప్రయాణించే రాకెట్ ద్వారా యాత్ర చేపట్టాడు. కానీ రాకెట్ ప్రయోగం విఫలం కావడంతో 64 ఏళ్ల 'మ్యాడ్' మైక్ హ్యూజ్ ప్రాణాలు పోగొట్టుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment