
భువనేశ్వర్ : పశ్చిమ ఒడిశాలో బరాగర్ జిల్లాలో ఓ విద్యార్థి అదుపుతప్పి జలపాతంలో పడిపోయాడు. 200 మీటర్ల ఎత్తు నుంచి జలపాతంలో యువకుడు పడిపోయిన వీడియో సామాజికమాధ్యమాల్లో వైరల్‌అవుతోంది. అతన్ని డిప్లొమా ఇంజినీర్ విద్యార్థి రాహుల్ దాస్(18)గా గుర్తించారు. డీయోదరా హిల్‌లోని నలీచుహాన్ జలపాతం వద్ద బుధవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. రాహుల్ దాస్ తన ముగ్గురు క్లాస్‌మెట్స్‌తో కలిసి నలీచుహాన్ జలపాతం దగ్గరికి వెళ్లారు.
జలపాతం దగ్గర అందరూ సరదాగా గడుపుతుండగా రాహుల్ తన ఫోన్‌తో ఫోటోలు తీశాడు. అనంతరం ఆఫోన్‌ను పక్కన పెట్టి, తిరిగి మిత్రుల దగ్గరకి వెళ్దామనుకున్నాడు. అయితే నీళ్లలో అడుగుపెట్టగానే షూ జారడంతో అదుపుతప్పి లోయలో పడిపోయాడు. ఈ ప్రమాదంలో రాహుల్ ప్రాణాలతో బయటపడ్డా, వెన్నుముకకు తీవ్ర గాయం కావడంతో గురువారం రాత్రి డాక్టర్లు సర్జరీ చేశారు. సంఘటన జరిగిన సమయంలో బాధితుడి స్నేహితుడు ఈ తతంగాన్నంతా వీడియో తీసి సోషల్‌మీడియాలో పెట్టడంతో వైరల్ అయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment