![Ambulance Driver Consuming Alcohol Sharing Peg With Patient Odisha - Sakshi](/styles/webp/s3/article_images/2022/12/20/Amublance-driver.jpg.webp?itok=qwKVwLGK)
భువనేశ్వర్: ఏదైన ప్రమాదం జరిగినప్పుడు ముందుగా గుర్తొచ్చేది అంబులెన్స్. వెంటనే ఫోన్ కొట్టి బాధితులను ఆసుపత్రికి తీసుకెళ్లి ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నం చేస్తాం. రోడ్డుపై అంబులెన్స్ వస్తున్నప్పుడు అంతా పక్కకు తప్పుకుని దారి ఇస్తారు. కానీ ఓ అంబులెన్సు డ్రైవరు మాత్రం.. లిక్కర్ కోసం వాహనాన్ని రోడ్డుమీదే కొంతసేపు నిలిపేసిన సంఘటన ఒడిశాలో వెలుగు చూసింది. అంతే కాదండోయ్..! అంబులెన్స్‌లోని రోగికి సైతం ఓ పెగ్గు అందించిన వైనం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
ఒడిశా జగత్సింగ్‌పూర్ జిల్లాలోని తిర్తోల్ హైవేలో ఓ బాధితుడిని తీసుకెళ్తున్న అంబులెన్సు రోడ్డు పక్కన ఆగింది. వాహనం దిగిన డ్రైవర్.. లిక్కర్ బాటిల్ తీసి గ్లాసులో పోసుకొని తాగటం ప్రారంభించాడు. వాహనంలోని పేషెంటుకు ఓ పెగ్గు అందించాడు. కాలికి గాయమై, స్ట్రెచర్‌పై పడుకొని ఉన్న ఆ వ్యక్తి కూడా దానిని సేవించాడు. ఆ సమయంలో బాధితుడి పక్కన ఓ మహిళ, చిన్న అబ్బాయి కూడా ఉన్నారు. దీనిని చూసిన వాహనదారులు.. అంబులెన్సు డ్రైవర్‌తో వాగ్వాదానికి దిగారు. బాధితుడే మద్యం అడిగారని చెప్పడం గమనార్హం. ఈ సంఘటనను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఇదీ చదవండి: కొత్త వేరియంట్లపై అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరిక
Comments
Please login to add a commentAdd a comment