
తిరుమలలో పెరిగిన రద్దీ
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. ఆదివారం సెలవు దినం కావడంతో శ్రీవేంకటేశ్వరస్వామి దర్శించుకునేందుకు తిరుమలకు భక్తులు పోటెత్తారు. 18 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. గదులు ఏవీ ఖాళీ లేవు.
శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక దర్శనానికి రెండు గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 3 గంటల సమయం పడుతోంది. శనివారం స్వామివారిని 77,619 మంది భక్తులు దర్శించుకున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
గదుల వివరాలు:
ఉచిత గదులు - ఖాళీ లేవు
రూ.50 గదులు - ఖాళీ లేవు
రూ.100 గదులు - ఖాళీ లేవు
రూ.500 గదులు - ఖాళీ లేవు
ఆర్జితసేవా టికెట్ల వివరాలు :
ఆర్జిత బ్రహ్మోత్సవం : ఖాళీ లేవు
సహస్ర దీపాలంకరణ సేవ : ఖాళీ లేవు
వసంతోత్సవం : ఖాళీ లేవు.