
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
తిరుమల : తిరుమలలో మంగళవారం ఉదయం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామి దర‍్శనార‍్థం రెండు కంపార్టెమెంట‍్లలో భక్తులు వేచి ఉన్నారు.
శ్రీవారి సర‍్వ దర‍్శనానికి 3 గంటలు, ప్రత‍్యేక దర‍్శనానికి 2 గంటలు, కాలినడకన వచ‍్చే భక్తులకు 3 గంటల సమయం పడుతోంది. స్వామి వారిని సోమవారం 73,092 మంది భక్తులు దర్శించుకోగా.. హుండీ ఆదాయం రూ.2.17 కోట్లు వచ్చిందని ఆలయ అధికారులు తెలిపారు.