
తిరుమలకు పోటెత్తిన భక్తులు
తిరుమల: వైకుంఠ ఏకాదశి సందర్భంగా అర్ధరాత్రి నుంచే తిరుమలకు భక్తులు పోటెత్తారు. నేడు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. వైకుంఠం క్యూ క్లాంప్లెక్స్, నారాయణగిరి ఉద్యానవనంలో భక్తులు నిండిపోయారు. మిగతా భక్తులను టీటీడీ సిబ్బంది ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నారు. రాత్రి ఒంటిగంట నుంచి వేకువామున నాలుగు గంటలవరకు వీఐపీలను దర్శనానికి అనుమతించారు. తెల్లవారుజామున 4:10 గంటల నుంచి సామాన్య భక్తులకు సర్వదర్శనం కల్పిస్తున్నారు.
నేటి ఉదయం తొమ్మిది గంటలకు స్వర్థరథంపై స్వామివారిని ఊరేగిస్తారు. ద్వాదశినాడు వారి పుష్కరిణిలో చక్రస్నాన మహోత్సవం నిర్వహిస్తారు. నేటి నుంచి రెండు రోజులపాటు స్వామివారి దివ్యదర్శనం, ప్రత్యేక దర్శనాలతో పాటు సిఫారసు లేఖలు, ఆర్జిత సేవలను టీటీడీ రద్దుచేసిన విషయం తెలిసిందే.