శ్రీకాకుళం: ప్రసిద్ద పుణ్యక్షేత్రం అరసవల్లిలో వైశాఖమాసం సందర్భంగా భక్తులు రద్దీ కొనసాగుతోంది. ఉచిత, రూ. 25 క్యూలైన్లు అన్నీ కిటకిటలాడాయి. కేశఖండనశాల, ఇంద్రపుష్కరిణి వద్ద భక్తు లు బారులు తీరారు. అక్కడే మొక్కుబ డులు చెల్లించుకొని స్వామివారి దర్శనం చేసుకున్నారు.
భక్తులు అధికంగా రావడంతో గంటల తరబడి క్యూలైన్లలో నిరీక్షించాల్సిన పరిస్థితి తలెత్తడంతో కొందరు భక్తులు బారికేడ్లు దాటుకొని వెళ్లడం కనిపించింది. పుష్కరిణి వద్ద సెక్యూరిటీ పర్యవేక్షణ లేకపోవడంతో కొందరు భక్తులు ఇనుప గ్రిల్స్ దాటి పుష్కరిణి మధ్యలోకి వెళ్లారు. ఇదే అదనుగా కేశఖండనశాలలో కొందరు భక్తులు క్షురకుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకానొక దశలో స్వామివారి దర్శనానికి క్యూలైన్లలో ఎదురుచూసిన భక్తులను అదుపు చేయడం ఆలయ సిబ్బంది, అక్కడ విధులు నిర్వహిస్తు న్న పోలీసులకు కష్టతరంగా మారింది.