సాక్షి, విజయవాడ: శ్రావణమాసం శుక్రవారం కావడంతో ఇంద్రకీలాద్రి దుర్గమ్మ ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. దుర్గమ్మ దర్శనం కోసం భక్తులు భారీగా తరలి రావడంతో ఇంద్రకీలాద్రి దర్దీగా మారింది. ఉదయం నుంచి దర్శనాలు కొనసాగుతున్నాయి. నేడు వరలక్ష్మి అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు.
శ్రావణ శుక్రవారం సందర్భంగా దుర్మమ్మకు ఆలయ అర్చకులు 31 రకాల విశేష పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో భ్రమరాంబ ఉదయాన్నే భక్తులు రద్దీని పరిశీలించారు. కాగా దుర్గమ్మ ఆలయంలో సెప్టెంబర్ 8న ఉచితంగా సామూమిక వరలక్ష్మి వ్రతం నిర్వహించనున్నారు.
వరంగల్ భద్రకాళి అమ్మావారికి పోటెత్తిన భక్తులు
శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతాలతో అమ్మవారు ఆలయాలు భక్తులతో కిటకిటలాడున్నాయి. వరంగల్‌లోని భద్రకాళి అమ్మవారు ఆలయానికి భక్తులు పోటెత్తారు. వేకువజాము నుంచే భక్తులు బారులు తీరి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలతో తరిస్తున్నారు. హంటర్ రోడ్‌లోని సంతోషిమాత ఆలయంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహిస్తున్నారు. భారీగా తరలివచ్చిన భక్తులతో అమ్మవారు ఆలయాలు భక్తజనసంద్రంగా మారాయి.
Comments
Please login to add a commentAdd a comment