varalakshmi pooja
-
Varalakshmi Vratham: లక్ష్మీ కళ ఉట్టిపడుతున్న నేటి వర మహాలక్ష్ములు (ఫొటోలు)
-
పెన్సిల్వేనియాలో సామూహిక వరలక్ష్మి కుంకుమార్చన
-
న్యూజెర్సీలో సామూహిక వరలక్ష్మి కుంకుమార్చన
-
శ్రావణ శుక్రవారం.. భక్తులతో కిటకిటలాడుతున్న ఇంద్రకీలాద్రి
సాక్షి, విజయవాడ: శ్రావణమాసం శుక్రవారం కావడంతో ఇంద్రకీలాద్రి దుర్గమ్మ ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. దుర్గమ్మ దర్శనం కోసం భక్తులు భారీగా తరలి రావడంతో ఇంద్రకీలాద్రి దర్దీగా మారింది. ఉదయం నుంచి దర్శనాలు కొనసాగుతున్నాయి. నేడు వరలక్ష్మి అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా దుర్మమ్మకు ఆలయ అర్చకులు 31 రకాల విశేష పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో భ్రమరాంబ ఉదయాన్నే భక్తులు రద్దీని పరిశీలించారు. కాగా దుర్గమ్మ ఆలయంలో సెప్టెంబర్ 8న ఉచితంగా సామూమిక వరలక్ష్మి వ్రతం నిర్వహించనున్నారు. వరంగల్ భద్రకాళి అమ్మావారికి పోటెత్తిన భక్తులు శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతాలతో అమ్మవారు ఆలయాలు భక్తులతో కిటకిటలాడున్నాయి. వరంగల్‌లోని భద్రకాళి అమ్మవారు ఆలయానికి భక్తులు పోటెత్తారు. వేకువజాము నుంచే భక్తులు బారులు తీరి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలతో తరిస్తున్నారు. హంటర్ రోడ్‌లోని సంతోషిమాత ఆలయంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహిస్తున్నారు. భారీగా తరలివచ్చిన భక్తులతో అమ్మవారు ఆలయాలు భక్తజనసంద్రంగా మారాయి. -
వరలక్ష్మీ వ్రతం ఇలా చేసుకోండి
శ్రావణమాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం రోజున అమ్మవారిని వరలక్ష్మి రూపంలో కొలుచుకుంటాము. ఒకవేళ ఈ రోజు ఏదన్నా అవాంతరం ఎదురవుతుందని అనుకుంటే మాసంలోని ఇతర శుక్రవారాలలో ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. కులాలకు అతీతంగా, ఎలాంటి ఆడంబరమూ అవసరం లేకుండా చేసుకునే ఈ వ్రతంతో అమ్మవారు తప్పక ప్రసన్నులవుతారని మన నమ్మకం. ఈ వ్రతం ఎలా చేసుకోవాంటే ► వరలక్ష్మీ వ్రతానికి ముందు రోజుగానే ఇంటిని, పూజగదిని శుభ్రం చేసుకోవాలి. ► ఇంటి గుమ్మాలకు పసుపుకుంకుమలను రాసుకోవాలి. ► ఇక పూజ జరిగే రోజున ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి, ఇంటిని మామిడి తోరణాలతో అలంకరించుకోవాలి. ► లక్ష్మీదేవిని ఈశాన్యదిక్కున పూజిస్తే మంచిదని చెబుతారు. కాబట్టి ఇంటి ఈశాన్యభాగంలో ముగ్గులు వేసి పూజకు స్థలాన్ని సిద్ధం చేసుకోవాలి. ► ఆ ముగ్గుల మీద పసుపు, ముగ్గు బొట్లు పెట్టిన పీటని ఉంచాలి. ► ఆ పీట మీద కొత్త తెల్లటి వస్త్రాన్ని పరవాలి. ఆ తెల్లటి వస్త్రం మీద బియ్యం పోసి.. దాని మీద కలశాన్ని ప్రతిష్టించాలి. కలశపు చెంబుకి పసుపు కుంకుమలు అద్ది, దాని మీద కొబ్బరికాయను నిలపాలి. ►ఆ కొబ్బరికాయ మీద పసుపు ముద్దతో అమ్మవారి మొహాన్ని తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తే మరింత మంచిది. కొబ్బరికాయంతో పాటుగా కలశం మీద మామిడి ఆకులను ఉంచడమూ శుభసూచకమే! ► అమ్మవారిని అష్టోత్తరశతనామావళితో పూజించిన తర్వాత తోరగ్రంధిపూజ చేస్తారు. ఇందుకోసం మూడు లేదా అయిదు తోరాలను సిద్ధం చేసుకోవాలి. ఈ తోరాల కోసం దారాలకు పసుపు రాస్తూ, తోరపూజలోని ఒకో మంత్రం చదువుతూ ఒకో ముడి చొప్పున తొమ్మిది ముడులు వేయాలి. వాటి మధ్యలో కుంకుమ బొట్లు పెడుతూ...అలా కుంకుమ బొట్టు పెట్టిన చోట పూలను ముడివేయాలి. అమ్మవారికి ఇష్టమైన ద్రవ్యాలు అమ్మవారికి ఆవు నెయ్యి అంటే చాలా ఇష్టమట. అందుకని పూజలో ఆవునేతితో చేసిన దీపం వెలిగిస్తే మంచిది. అలాగే ఆవుపాలతో చేసిన పరమాన్నం కానీ పాయసం కానీ నివేదిస్తే అమ్మవారు ప్రసన్నులవుతారు. వీటితో పాటుగా మన శక్తి కొలదీ తీపిపదార్థాలను అమ్మవారికి నివేదించవచ్చు. కొబ్బరికాయ అన్నా, అరటిపండన్నా కూడా లక్ష్మీదేవికి ప్రీతికరం. కాబట్టి ఈ పండ్లను కూడా అమ్మవారికి నివేదించడం మరువకూడదు. వరలక్ష్మీ పూజలో భాగంగా ఎలాగూ అష్టోత్తరశతనామావళి, మహాలక్ష్మి అష్టకమ్ తప్పకుండా చదువుతాము. వీటితో పాటుగా కనకధారాస్తవం, లక్ష్మీ సహస్రనామం, అష్టలక్ష్మీ స్తోత్రం చదివితే అమ్మవారు మరింత ప్రసన్నులవుతారన్నది పెద్దల మాట. ఇలా నిష్టగా సాగిన పూజ ముగిసిన తర్వాత ఒక ముత్తయిదువుని అమ్మవారిగా భావించి ఆమెను ఆతిథ్యం ఇవ్వమని చెబుతారు. వరలక్ష్మీ పూజ రోజున ఇంట్లో శాకాహారమే భుజించాలి. ముత్తయిదువను సాగనంపిన తర్వాత భోజనం చేయాలి. సాయంత్రం వేళ వీలైనంతమంది ముత్తయిదువులను పిలిచి తాంబూలాలు ఇవ్వాలి. అమ్మవారి పూజ ముగిసినా కూడా ఎట్టిపరిస్థితుల్లోనూ ఉద్వాసన చెప్పకూడదు. అలా చెబితే ఇంటి నుంచి లక్ష్మీదేవిని పంపినట్లే అవుతుంది. కలశానికి ఇరువైపులా ఏనుగు ప్రతిమలను పెట్టడం మర్చిపోకూడదు. ఏనుగు ప్రతిమలు లేని పక్షంలో ఏనుగు రూపంలోని పసుపుముద్దలు కానీ, పసుపుకొమ్ములని కానీ అమ్మవారికి అభిముఖంగా నిలపాలి. ఈ రోజున ఉపవాసం కానీ జాగరణ కానీ ఉండాలన్న ఖచ్చితమైన నియమం లేదు. కానీ పూజ ముగిసేదాకా ఎలాంటి ఆహారమూ తీసుకోకూడదు. ఇలాంటి జాగ్రత్తలన్నింటినూ సాగే వరలక్ష్మీ వ్రతం ఆడవారి జీవితంలో ఎలాంటి అమంగళమూ జరగకుండా కాపాడి తీరుతుంది. -
వరాల తల్లికి పూజలు
శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని జిల్లాలో వరలక్ష్మి వ్రతాలు వైభవంగా జరిగాయి. మహిళలు కుంకుమార్చనలు నిర్వహించారు. ప్రధాన ఆలయాలన్నీ భక్తులతో కిక్కిరిశాయి. -
రత్నగిరిపై వరలక్ష్మీ వ్రత శోభ
అన్నవరం, న్యూస్‌లైన్ : రత్నగిరిపై శ్రీసత్యదేవుని సన్నిధిలో శ్రావణ మాసం రెండో శుక్రవారం, వరలక్ష్మీ వ్రతం పర్వదినం నాడు సామూహిక వరలక్ష్మి పూజ ఘనంగా నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి విచ్చేసిన 900 మంది మహిళలు భక్తి శ్రద్ధలతో ఈ పూజ అచరించారు. స్వామివారి నిత్యకల్యాణమండపంలో సామూహిక వరలక్ష్మి పూజ నిర్వహించారు. ఉదయం 9.30 గంటలకు దేవస్థానం ఈఓ పి. వేంకటేశ్వర్లు దీపారాధన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలుత పండితులు విఘ్నేశ్వరపూజ నిర్వహించారు. అనంతరం సత్యదేవుడు, అమ్మవారికి పూజలు చేశారు. వేదపండితుల వేదస్వస్తితో వరలక్ష్మీ పూజ ప్రారంభమైంది. వరలక్ష్మీ అమ్మవారికి పండితులు శాస్త్రోక్తంగా అష్టోత్తర పూజ చేశారు. పూజలో పాల్గొన్న మహిళలతో కూడా పూజ చేయించి వ్రతకథను చదివి వినిపించారు. చివరలో వరలక్ష్మీ అమ్మవారికి , సత్యదేవుడు, అమ్మవార్లకు నీరాజనమంత్రపుష్పాలు సమర్పించారు. దేవస్థానం వేదపండితులు ముష్టి కామశాస్త్రి, గొర్తి సుభ్రహ్మణ్య ఘనాపాటీ, అర్చకులు ఇంద్రగంటి బుల్లి, కోట శ్రీనువాస్, వ్రతపురోహిత ప్రముఖులు ముత్య సత్యనారాయణ, తదితరులు ఈకార్యక్రమాలను నిర్వహించారు. ఈ పూజలో పాల్గొన్న మహిళలు కొబ్బరికాయ, అరిటిపళ్లు, పూవులు మాత్రం తెచ్చుకోగా, పసుపు, కుంకుమ, హారతికర్పూరం, అగరువత్తులు, గావంచా, పత్రి, అక్షింతలు, తమలపాకులు దేవస్థానమే సమకూర్చింది. వరలక్ష్మి రాగి రూపు, జాకెట్టుముక్క, తోరం, సత్యదేవుని ప్రసాదం 100 గ్రాముల ప్యాకెట్ వారికి అందచేశారు. పూజ అనంతరం మహిళలందరూ సత్యదేవుని దర్శనం చేసుకున్నారు. వీరికి అన్నదానపథకంలో ఉచిత భోజనం ఏర్పాటు చేశారు. దేవస్థానం ఏసీ ఈరంకి జగన్నాథరావు, సూపపరింటెండెంట్ నరసింహారావు, ఆలయ సిబ్బంది ఏర్పాట్లు పర్యవేక్షించారు.