
వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజన్నను దర్శించుకునేందుకు వస్తున్న భక్తు లు గుడివద్దకు వెళ్లేందుకు పడుతున్న ఇబ్బందులు తప్పించేందుకు మంత్రి కేటీఆర్, దేవాదాయశాఖ అధికారులు, ఆలయ ఈవో రాజేశ్వర్ యత్నిస్తున్న క్రమంలో రెండు మినీబస్సులు ఇచ్చేందుకు ఖమ్మం జిల్లాకు చెందిన గాయత్రి గ్రానైట్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ వద్దిరాజు రవిచంద్ర, విజయలక్ష్మి దంపతులు ముందుకొచ్చారు. త్వరలోనే ఈ బస్సులను భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తామని ఆలయ అధికారులు తెలి పారు. భక్తుల కోసం మినీ బస్సులను స్వామి వారికి విరాళంగా అందించనున్నట్లు రవిచంద్ర, విజయలక్ష్మి దంపతులు ఈ నెల 13న ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment