free bus service
-
ఏపీ మహిళలకు ఉచిత బస్సు లేనట్టేనా?
-
‘మేడారం’ జాతరకూ మహిళలకు ఫ్రీ బస్సు
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం జాతరకు వచ్చే ఆర్టీసీ బస్సుల్లోనూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం వర్తింపజేస్తామని మంత్రి సీతక్క అన్నారు. మేడారం మహాజాతరపై మరో మంత్రి కొండా సురేఖతో కలిసి బుధవారం ఉన్నత స్థాయిలో సమీక్షించారు. అనంతరం సీతక్క మీడియాతో మాట్లాడుతూ అందరి సహకారంతో జాతరను విజయవంతం చేయాలన్నారు. అభివృద్ధి పను ల విషయంలో కాంట్రాక్టర్లు నాణ్యత ప్రమాణాలు పాటించేలా అధికారులు చూడాలని సూచించారు. కాంట్రాక్టర్లకు వంతపాడే అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మహాజాతర అంటే ఎన్ని సౌకర్యాలు కల్పించినా, అక్కడక్కడా చిన్నచిన్న పొరపాట్లు జరుగుతాయన్నారు. వాటిని తన దృష్టికి తీసుకొస్తే తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. 2014 మేడారం మహాజాతరలో సమ్మక్క–సారలమ్మలు గద్దెనెక్కిన రోజు, తెలంగాణబిల్లు రాజ్యసభలో ఆమోదం పొందిన రోజు ఒక్కటే అన్నారు. తెలంగాణ రాష్ట్రం కూడా తల్లుల దీవెనలతోనే ఏర్పడిందని, సోనియాగాంధీ ఇచి్చన తెలంగాణ రాష్ట్రంలో జరిగే మహాజాతరకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని సీతక్క వివరించారు. జాతరను విజయవంతం చేస్తాం: మంత్రి కొండా సురేఖ మహాజాతరను విజయవంతం చేసేందుకు సమ్మక్క–సారలమ్మల స్ఫూర్తితో మంత్రి సీతక్కతో కలిసి పనిచేస్తానని మంత్రి సురేఖ అన్నారు. వరంగల్ ఆడబిడ్డలుగా జాతరలో పనిచేయడం తమ అదృష్టమన్నారు. భక్తుల సౌకర్యార్థం చేపట్టిన అభివృదిŠధ్ పనులు ఈ నెలాఖరు వరకు పూర్తి చేస్తామని చెప్పారు. ప్రజాధనం దుర్వింనియోగం కాకుండా చూస్తూ అధికారుల వెంట పడి పరిగెత్తించి పనులు పూర్తి చేయిస్తామని తెలిపారు. దేవాదాయ శాఖ నుంచి రూ.1.50కోట్లతో పూజారుల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశామన్నారు. ప్రతిపక్షాలకు విమర్శించే అర్హత లేదని, సలహాలు, సూచనలు అందించి జాతర విజయవంతానికి సహకరించాలన్నారు. గత ప్రభుత్వ హయాంలో యాదాద్రిలో అభివృద్ధి పేరిట మూల విరాట్‌ను కదిలించి యాదాద్రిని నిర్మించారని, అది శాస్త్రీయంగా తప్పిదమని తెలిపారు. గిరిజన జాతరలో పూజారుల పాత్ర కీలకమని, వారి కోసం ప్రభుత్వం 10 గదులతో అతిథి గృహనిర్మాణం చేపడుతుందని, వచ్చే మినీ జాతర నాటికి అతిథి గృహాన్ని అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి సురేఖ తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శబరీష్, అడిషనల్ ఎస్పీ సదానందం, అటవీశాఖ అధికారి రాహుల్ కిషన్ జాదవ్, ఐటీడీఏ పీఓఅంకిత్, అదనపు కలెక్టర్లు శ్రీజ, వేణుగోపాల్, దేవాదాయశాఖ కమిషనర్ అనిల్‌కుమార్, ఏటూరునాగారం ఏఎస్పీ సంకీర్త్, ఓఎస్డీ అశోక్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. మొదలైన భక్తుల సందడి మేడారం జాతరకు నెల రోజుముందుగానే భక్తుల తాకిడి మొదలైంది. సంక్రాంతి సెలవుల చివరి రోజు కావడంతో బుధవారం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు మేడారానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. అమ్మవార్ల గద్దెల వద్ద బంగారం, చీర, సారె, పూలు, పండ్లు, పసుపు కుంకుమలు సమర్పించి మొక్కులు సమర్పించారు. -
ఫ్రీ బస్ ఎఫెక్ట్: జుట్లు పట్టుకొని కొట్టుకున్న మహిళలు
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహాలక్ష్మి ఫ్రీ బస్ పథకానికి భారీ స్పందన వస్తోంది. బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఏ బస్సులో చూసిన 70శాతం వరకు మహిళలే కనిపిస్తున్నారు. పలు రూట్లలో బస్ సర్వీసులు సరిపోకపోవడంతో ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఉచితంగా ప్రయాణించే వెసులుబాటును కొందరు మహిళలు దుర్వినియోగం చేస్తున్నారన్న వెల్లువెత్తుతున్నాయి. మహిళల సీట్లు నిండిపోవడంతో పురుషుల సీట్లలోనూ కూర్చుంటున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. అంతేగా సీట్ల కోసం పలుచోట్ల పంచాయితీలు కూడా జరుగుతున్నాయి. తాజాగా భద్రాచలంలో ఆర్టీసీ బస్సులో ఇద్దరు మహిళలు గొడవకు దిగారు. క్రిస్మస్ పండగ కావడంతో మహిళలు అధిక సంఖ్యలో ప్రయాణాలు కొనసాగించారు. ఈ క్రమంలో సీటులో కూర్చునే విషయంలో ఇద్దరు మహిళల మధ్య ఘర్షణ మొదలైంది. ఇది పెరిగి పెద్దది కావడంతో ఒకరి జుట్టు మరొకరు పట్టుకొని కొట్టుకున్నారు. చివరికి మిగిలిన మహిళలు సర్ధిచెప్పడంతో వివాదం అక్కడితో సద్దుమణిగింది. ఇదిలా ఉండగా కర్ణాటకలో ఫ్రీ బస్ ఎఫెక్ట్ బాగానే ఉంది. ఏదో విషయంలో గొడవ పడిన కొదరు మహిళలు బస్సు దిగి దారుణంగా కొట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. -
ఫ్రీ బస్ ఎఫెక్ట్: పొట్టుపొట్టు కొట్టుకున్న మహిళలు
-
TS: రేపటి నుంచి మహిళలకు ఉచిత ప్రయాణం.. మార్గదర్శకాలు ఇవే..
సాక్షి, హైదరాబాద్: మహాలక్ష్మి స్కీమ్‌లో భాగంగా రేపటి(శనివారం) నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ప్రారంభించనున్నట్లు టీఎస్ఆర్టీసీ సీఎండీ సజ్జనార్ తెలిపారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. శనివారం మధ్యాహ్నం ఒంటిగంటకు అసెంబ్లీ వద్ద సీఎం రేవంత్ రెడ్డి ‘మహాలక్ష్మీ స్కీమ్’ను ప్రారంభిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా మంత్రులు ఎమ్మెల్యేలు పాల్గొంటారని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఫ్రీగా జీరో అమౌంట్ టికెట్‌తో ప్రయాణించవచ్చని తెలిపారు. ఆధార్ లేదా ఏదైనా గుర్తింపు కార్డు చూపించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. నాలుగైదు రోజులు గుర్తింపు కార్డు లేకుండా ప్రయాణించవచ్చుని తెలిపారు. ప్రయాణీకుల సంక్షేమం కోసం ఆర్టీసీ యాజమాన్యం కృషి చేస్తోందని అన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళలకు ఫ్రీ ప్రయాణం మంచి స్కీమ్ అని కొనియాడారు. స్కీమ్‌తో ఆర్టీసీకి ఆదరణ మరింత పెరుగుతోందని చెప్పారు. ప్రస్తుతం రోజుకు 40 లక్షల మంది ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తారని వెల్లడించారు. ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడకుండా ఏర్పాట్లు చేశామని అన్నారు. ప్రస్తుతం 7290 బస్సులు ఉన్నాయని, రోజు ఆదాయం 14 కోట్ల వరకు వస్తోందని తెలిపారు. మహిళలకు ఫ్రీ ప్రయాణంతో 50 శాతం ఆదాయం తగ్గుతుందని పేర్కొన్నారు. తగ్గే ఆదాయంపై ప్రభుత్వ సహాయంకై విజ్ఞప్తి చేశామని చెప్పారు. -
హవ్వా! మహిళలకు ఉచిత ప్రయాణం అనగానే.. బుర్ఖా ధరించి..
బెంగుళూరు: కర్ణాటకలో ప్రభుత్వం ఇటీవల మహిళలకు శక్తి యోజన కింద ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిన సంగతి తెలిసిందే. ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవడం కోసం ఒక హిందూ వ్యక్తి వేషం మార్చి బుర్ఖా ధరించి పట్టుబడ్డాడు. శక్తి యోజన పథకంలో భాగంగా కర్ణాటక ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ వెసులుబాటును కల్పించింది. అయితే దీన్ని అవకాశంగా చేసుకుని ధార్వాడ్ జిల్లాలో మత్తపాటి వీరభద్రయ్య అనే వ్యక్తి కొంచెం అటు ఇటుగా కటౌట్ మార్చుకుని బుర్ఖా ధరించి సాహసానికి తెగించాడు. ఎవ్వరికీ అనుమానం రాకుండా బస్ స్టాప్ లోకి వచ్చి కూర్చున్నాడు. అతడిని చూడగానే అక్కడి వారికి అనుమానం రావడంతో ప్రశ్నలు మీద ప్రశ్నలు సంధించారు. వారడిగిన ఏ ప్రశ్నకీ అతని వద్ద సమాధానం లేదు. బిక్షాటన చేసుకునేందుకే బుర్ఖా ధరించానని వీరభద్రయ్య చెప్పినా కూడా ఆ సమాధానానికి అక్కడివారు సంతృప్తి చెందలేదు. దీంతో బలవంతంగా ముసుగు తీశాక అసలు బాగోతం బయటపడింది. పైగా అతడి వద్ద మహిళ పేరుతో ఒక ఆధార్ కార్డు కూడా ఉండడం విశేషం. కర్ణాటకలో జరిగిన ఈ సంఘటన వైరల్ గా మారింది. ఇది కూడా చదవండి: మణిపూర్ అల్లర్లు: పాఠశాల ఎదుటే మహిళ దారుణ హత్య -
ఉచిత ప్రయాణం... డ్రైవర్ కు కష్టాలు
కర్ణాటక: రాష్ట్ర వ్యాప్తంగా కేఎస్ ఆర్టీసీ బస్సులు మహిళా ప్రయాణికులతో కిక్కిరిసి సంచరిస్తున్నాయి. శక్తి యోజన పథకం కింద బస్సుల్లో ఉచిత ప్రయాణం కావడంతో మహిళలు పోటెత్తుతున్నారు. సాధారణ రోజులకంటే వీకెండ్ రోజుల్లో ఎక్కువ మంది ప్రయాణిస్తున్నారు. విహారయాత్రలకు వెళ్లేందుకు ఉత్సాహం చూపుతున్నారు. ఈక్రమంలో బస్సులు కిక్కిరిస్తున్నాయి. శనివారం ఒక్కరోజే 1,06,09.835 మంది ప్రయాణించగా అందులో 58,14,524 మంది మహిళలు ఉన్నారు. ఇది సరాసరి 54.80 శాతం. దీంతో ప్రభుత్వంపై కోట్ల రూపాయలమేర భారం పడింది. కేఎస్ఆర్టీసీలో 17.29 లక్షల మంది మహిళలు ప్రయాణించగా రూ.4.92 కోట్లు, బీఎంటీసీలో 18.95 లక్షల మంది ప్రయాణించగా రూ.2.41 కోట్లు, వాయువ్య రవాణా సంస్థలో 14 లక్షలమంది ప్రయాణించగా రూ.3.50 కోట్ల భారం పడింది. కల్యాణ కర్ణాటక రవాణా సంస్థపై రూ.2.55 కోట్ల భారం పడింది. సీట్ల కోసం ఎగబడుతున్న జనం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి మహిళలు పెద్ద ఎత్తున తరలివస్తుండగా సీట్ల కొరత ఏర్పడుతోంది. ప్రయాణికులు డ్రైవరు క్యాబిన్ మీదుగా లోపలకు ప్రవేశించి సీట్ల కోసం పోటీ పడుతున్న దృశ్యాలు నిత్యకృత్యం అయ్యాయి. -
మహిళల ఉచిత ప్రయాణంలో మార్పులు...
కర్ణాటక: ఉచితంగా మహిళలకు బస్సు ప్రయాణాల పథకంలో స్వల్ప మార్పు చేస్తామని రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి అన్నారు. సోమవారం విధానసౌధలో మాట్లాడుతూ... 15 రోజులు పాటు చూసి ఆ తరువాత అవసరమైన మార్పులు చేస్తామన్నారు. ఈనెల 11న 5 లక్షల 70 వేల మంది బస్సుల్లో ప్రయాణించారు. ఇప్పటికే మూడు కోట్ల మంది మహిళలు ప్రయాణాలు చేశారు. అయితే ఒకేసారి ఇంతమంది వెళ్లరాదని కోరారు. పుణ్యక్షేత్రాలకు అంటూ పెద్ద ఎత్తున తరలివస్తున్నారని, దీని వల్ల ఇతర ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. వారంలో రూ. 70 కోట్ల విలువ చేసే ఉచిత ప్రయాణాలపై స్పందించిన ఆయన ప్రారంభంలో కాబట్టి రద్దీ ఉంటుందని, రోజు వెళ్లరని అన్నారు. ప్రైవేట్ బస్సులకు నష్టం జరుగుతున్న విషయంపై మాట్లాడిన ఆయన, ప్రైవేట్ బస్సువారు కూడా ట్యాక్స్ చెల్లిస్తున్నారు. వారి జీవితము గడవాలి. ప్రస్తుతం ఉత్సాహంలో మహిళలు ప్రయాణం చేస్తు న్నారు. ముందు రోజుల్లో మహిళల సంఖ్య తగ్గుతుందోమో చూడాలని అన్నారు. -
ఉచిత ప్రయాణం... ప్రభుత్వం మా పొట్ట కొడుతోంది...
గౌరిబిదనూరు: ప్రభుత్వం తీసుకువచ్చిన శక్తి యోజన పథకం తమను పూర్తిగా రోడ్డున పడేలా చేసిందని పలువురు ప్రైవేట్ బస్సు యజమానులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ బస్సుల వైపే మొగ్గు : గతంలో గ్రామీణ ప్రదేశాలలో నగరానికి ప్రైవేట్ బస్సుల్లోనే ఎక్కువగా ప్రయాణం చేసేవారు. ప్రస్తుతం ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అని ప్రకటించడంతో ఎంత సేపైనా ఆ బస్సుల కోసం మహిళలు వేచి ఉంటున్నారు. సిబ్బందికి జీతాలు చెల్లించలేని పరిస్థితి వస్తుందని బస్సుల నిర్వాహకులు చెబుతున్నారు. అమ్ముదామన్నా కొనేవారే లేరు : బస్సులను అమ్మేస్తామన్నా కొనేవారు లేరు. రెండేళ్ల క్రితం కరోనా పూర్తిగా దెబ్బతీసింది. ఇప్పుడు ఊహించని పరిణామం ఎదురైంది. కుటుంబాలను ఎలా పోషించుకోవాలి, సిబ్బందికి జీతాలు ఎలా చెల్లించాలని అని బస్సుల యజమానులు నిరాశలో ఉన్నారు. మూడు నెలలకు రూ.7,952 రోడ్డు ట్యాక్స్ కట్టాలి, ఏడాదికి రూ. 72,202 బీమా ప్రీమియం, ఎఫ్‌సిలు చేయించాలి, వ్యాపారాలే లేకున్నప్పుడు ఇంత మొత్తం ఎలా చెల్లించాలి అంటూ బస్సుల ఆపరేటర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఉపాధిపై వేటు : కేవలం యజమానులే కాదు బస్టాండ్లలో టికెట్లు ఇచ్చే లోడర్లు, డ్రైవర్, కండక్టర్లు, వారి కుటుంబాలు వీధిన పడాల్సిన పరిస్థితి వచ్చింది. పెద్దల కాలం నుంచి బస్సులపైనే జీవితాలు నడుస్తున్నాయి. ప్రభుత్వం తాజా నిర్ణయం ట్రావెల్ నిర్వాహకులకు అశనిపాతంలా మారింది. కష్టంగా మారింది మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణాలు కల్పించడంతో ప్రైవేట్ బస్సులు ముఖం చూసే వారే కనిపించలేదు, దీంతో ఎలా నెట్టుకు రావాలో అర్థం కావడం లేదు. జీతాలు చెల్లించలేని పరిస్థితి వస్తోంది. – ప్రదీప్, బస్సు యజమాని ఎలా బతకాలి నాలుగైదు బస్టాండ్లలో టికెట్లు విక్రయించి రోజుకు రూ. 200 నుంచి 300 సంపాదించే వారం, ప్రభుత్వం ఇప్పుడు మా పొట్ట కట్టింది. ప్రయాణికులే లేకుంటే మాకు కమీషన్ ఎలా వస్తుంది, కుటుంబాలను ఎలా పోషించాలి. గౌరిబిదనూరు బస్టాండులో 15 మందికిపైగా ఏజెంట్లు ఉన్నారు. – నాగేశ్, బస్ ఏజెంట్ -
హాట్సాఫ్ బామ్మ.. నువ్ చాలా గ్రేట్!
-
Viral Video: హాట్సాఫ్ బామ్మ.. నువ్ చాలా గ్రేట్!
చెన్నై: ప్రభుత్వ బస్సులో ఉచిత ప్రయాణమంటే ఎవరు కాదంటారు? ఎగిరి గంతేసి ఫ్రీగా చక్కర్లు కొడుతుంటారు. కానీ, కొందరు అలా ఉండరు. టికెట్ కొనుక్కునే వెళ్తుంటారు. అలాంటి కోవకే చెందుతారు ఈ వృద్ధురాలు. బస్సులో ఉచితంగా ప్రయాణించనని, తనకు టికెట్ ఇవ్వాలని కండక్టర్‌తో గొడవ పడుతున్న బామ్మ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ సంఘటన తమిళనాడులోని కోయంబత్తూర్‌లో జరిగింది. రాష్ట్ర ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు అధికార డీఎంకే పార్టీ.. రాష్ట్రంలోని మహిళలు ప్రభుత్వ ఆర్డినరీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు వీలు కల్పించింది. మధుకరాయ్ నుంచి పాలథురాయ్ వెళ్తున్న ఓ బస్సులో వృద్ధురాలు ఎక్కింది. బస్సులో పురుషుల వద్ద టికెట్లు తీసుకుంటున్నాడు కండక్టర్. తనకూ టికెట్ ఇవ్వాలని కండక్టర్ వద్దకు వెళ్లి డబ్బులు ఇవ్వబోయింది వృద్ధురాలు. ముందుగా అందుకు నిరాకరించిన కండక్టర్.. డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని, ఉచితంగానే వెళ్లొచ్చని ఆమెకు వివరించే ప్రయత్నం చేశాడు. అయితే.. తాను ఫ్రీగా వెళ్లాలనుకోవట్లేదని, టికెట్ ఇవ్వాల్సిందేనని పట్టుబట్టింది. దీంతో చేసేదేమీ లేక టికెట్‌కు సరిపడ రూ.15 తీసుకుని టికెట్ ఇచ్చాడు. ఇదీ చదవండి: చైనీయులకు 2 రోజుల్లో అమెరికా వీసా.. భారతీయులకు రెండేళ్లు! -
అనాథ వృద్ధురాళ్లకు రాములోరి దర్శనం.. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఔదార్యం
భద్రాచలం: టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఔదార్యంతో కొందరు అనాథ వృద్ధురాళ్లు భద్రాచలం రామయ్య దర్శనం చేసుకోగలిగారు. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలం వావివలస గ్రామానికి చెందిన పాలూరు సిద్ధార్థ తన భార్య సుధారాణితో కలిసి ఓ స్వచ్ఛంద సేవా సంస్థను నిర్వహిస్తున్నారు. ఈ సంస్థ ద్వారా అనాథలు, దివ్యాంగ మహిళలకు అండగా ఉంటూ భోజన సౌకర్యం కల్పిస్తున్నారు. అక్కడ నివసిస్తున్న కొందరు వృద్ధురాళ్లకు భద్రాచలం రామయ్యను దర్శించుకోవాలనేది చిరకాల కోరిక. దీంతో సిద్ధార్థ తన పరిచయస్తుల ద్వారా విషయాన్ని తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన సజ్జనార్ విశాఖపట్నం నుంచి భద్రాచలం, భద్రాచలం నుంచి పర్ణశాల, తిరిగి విశాఖపట్నం వరకు పూర్తిగా ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించారు. ఈమేరకు 20 మంది వృద్ధురాళ్లు గురువారం ఉదయం భద్రాచలం చేరుకుని పవిత్ర గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించాక రామయ్యను దర్శించుకున్నారు. అనంతరం పర్ణశాలను కూడా సందర్శించారు. వీరికి భద్రాచలం పట్టణ సీఐ టి.స్వామి భోజన, వసతి, ఆలయ ఈవో శివాజీ దర్శనానికి ఏర్పాట్లు చేశారు. తమ చిరకాల కోరిక తీర్చిన ఎండీ సజ్జనార్, ఏర్పాట్లు చేసిన అధికారులకు వృద్ధురాళ్లు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపి విశాఖ తిరుగు పయనమయ్యారు. -
మారుమూల పల్లెలకు బడిబస్సులు
సాక్షి, అమరావతి: పాఠశాల విద్యార్థుల కోసం ఆర్టీసీ నడుపుతున్న ఉచిత బస్సులపై గత ప్రభుత్వాలు పూర్తి నిర్లక్ష్యం ప్రదర్శిస్తే సీఎం వైఎస్ జగన్ సర్కారు మాత్రం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోంది. కళాశాల విద్యార్థులకు రాయితీ బస్‌పాస్ పరిధిని కూడా పెంచింది. గతంలో ఎన్నడూ లేని విధంగా మారుమూల పల్లెలకూ బడి బస్సులు నడుపుతోంది. మొత్తం మీద విద్యార్థుల చదువులకు పెద్దపీట వేస్తూ అందుకు రవాణా ఇబ్బందులు లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా.. ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో చదువుకునే విద్యార్థులకు ప్రత్యేకంగా డెడికేటెడ్ రవాణా సౌకర్యం కూడా కల్పించింది. దీంతో రాష్ట్రంలో టెన్త్ లేదా 18 ఏళ్లలోపు ఆడపిల్లలు, 12 ఏళ్లలోపు (ఏడో తరగతి) విద్యార్థులు ఉచితంగా బస్‌పాస్‌లు పొంది తమ చదువులను ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగిస్తున్నారు. అలాగే, గ్రామీణ ప్రాంతాల్లో 20 కి.మీ.లోపు.. పట్టణ, నగర ప్రాంతాల్లో 22 కి.మీ.లోపు ఉచిత ప్రయాణాన్ని కూడా ఆర్టీసీ విద్యార్థులకు కల్పిస్తోంది. మరోవైపు.. ఇంటర్మీడియెట్, డిగ్రీ, పాలిటెక్నిక్, ఐటీఐ, ఇంజనీరింగ్ చదివే విద్యార్థులకు 80–90 శాతం వరకు రాయితీ బస్‌పాస్‌లను అందిస్తోంది. గతంలో విద్యార్థులకు ఉచిత, రాయితీ పాస్లిచ్చినప్పటికీ ఆర్టీసీ సరిగ్గా బస్సులను నడిపేది కాదు. టీడీపీ హయాంలో అయితే ఆర్టీసీ బస్సులను డ్వాక్రా మహిళలను సభలకు తరలించేందుకు, పోలవరం యాత్రలకు పంపడమే తప్ప బడి బస్సులను ఏర్పాటుచేసిన దాఖలాల్లేవు. దీంతో మారుమూల గ్రామాల్లోని విద్యార్థులు స్కూళ్లు, కాలేజీలకు వెళ్లడానికి నానా యాతన పడేవారు. బస్సుల కోసం విద్యార్థులు ధర్నాలు చేసిన ఘటనలున్నాయి. కానీ, వైఎస్ జగన్ సర్కారు వచ్చాక విద్యార్థుల అవస్థలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. రాష్ట్రంలో అన్ని రీజియన్ల నుంచి కేవలం పాఠశాల, కళాశాల విద్యార్థుల కోసమే ఆర్టీసీ 480 డెడికేటెడ్ బస్సులకు శ్రీకారం చుట్టింది. రాయితీ బస్‌పాస్‌ల పరిధి పెంపు విద్యార్థులకు అందించే రాయితీ బస్‌పాస్‌లను గతంలో 35 కిలోమీటర్లకు పరిమితం చేశారు. దీంతో విద్యార్థులు అప్పట్లో నానా ఇబ్బందులు పడేవారు. ఎందుకంటే.. రాష్ట్రంలో అధిక శాతం విద్యాసంస్థలు నగర శివార్లలో నెలకొన్నాయి. దీంతో విద్యార్థులు తమ ఇంటి నుంచి పాఠశాల, కళాశాలకు వెళ్లాలంటే 40–50 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వచ్చేది. ఈ కారణంగా రాయితీ బస్‌పాస్‌లు ఉపయోగకరంగా ఉండేవి కావు. విద్యా సంస్థల బస్సుల్లో వెళ్లాలంటే రవాణా ఛార్జీలు అధికమయ్యేవి. విధిలేని పరిస్థితుల్లో షేర్ ఆటోల్లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకునే ప్రయాణించే వారు. ఈ ఇబ్బందుల్ని గుర్తించిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం.. రాయితీ బస్‌పాస్‌ల కిలోమీటర్ల పరిధిని 35 నుంచి 50 కిలోమీటర్లకు పెంచింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 660 విద్యా సంస్థలు 35 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉన్నట్లు ప్రభుత్వం లెక్కగట్టి ఆ మేరకు పరిధిని పెంచుతూ జీఓ జారీచేసింది. ఈ నిర్ణయంతో 15 వేల మంది విద్యార్థులు లబ్ధిపొందారు. అలాగే, పరిధి పెంపుతో ప్రభుత్వంపై ఏటా 18.50 కోట్ల అదనపు భారం ప్రభుత్వంపై పడింది. బస్‌పాస్‌లకు వంద శాతం రీయింబర్స్మెంట్ ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో ఆర్టీసీ మొత్తం 57,042 ఉచిత, 76,099 రాయితీ బస్‌పాస్‌లను జారీచేసింది. ఇందుకు సంబంధించిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం నూరు శాతం ఆర్టీసీకి రీయింబర్స్ చేస్తోంది. ఇలా ఏటా రూ.450 కోట్ల మేర ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లిస్తోంది. కాగా, ఆర్టీసీలో పనిచేసే ఔట్ సోర్సింగ్ సిబ్బంది 5 వేల మందికి కూడా సంస్థ ఉచిత పాస్‌లు అందించింది. అలాగే, ఉద్దానం ప్రాంతంలోని కిడ్నీ వ్యాధిగ్రస్తులకూ వీటిని ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఉచిత బస్‌పాస్‌తో చదువుకు ఆటంకాల్లేవు మాది పూర్తి గిరిజన ప్రాంతం పాడేరు వద్ద మారుమూల పల్లె. ప్రతిరోజూ పాడేరులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు వెళ్లాలంటే రానూపోను రూ.25 వరకు ఖర్చవుతుంది. ప్రభుత్వం ఉచిత పాస్ ఇవ్వడంతో మాకు ఆర్థికంగా కొంత వెసులుబాటు కలిగింది. – కె.లిఖిత, ఏడో తరగతి విద్యార్థిని, ములియపట్టు గ్రామం ప్రతీరోజూ ఠంఛనుగా బస్సు పాడేరు పరిధిలోని మా ఊరి నుంచి హుకుంపేట మండల కేంద్రంలో పాఠశాలకు వెళ్లాలంటే చాలా ఇబ్బందులు. ఆర్టీసీ బస్సు లేకపోతే నేను చదువు మానుకోవాల్సి వచ్చేది. కానీ, ఇప్పుడు ఠంఛనుగా ఆర్టీసీ బస్సు వస్తుండడంతో ఇబ్బందులు లేకుండా చదువు కొనసాగిస్తున్నా. – పొంగి సంతోష్‌కుమార్, 8వ తరగతి, జోగులాపుట్ గ్రామం ఎలాంటి ఆటంకాల్లేకుండా నడుపుతున్నాం బడి బస్సులను ఎలాంటి ఆటంకాలు లేకుండా నడుపుతున్నాం. విద్యార్థులు చదువుకు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశ్యంతో మారుమూల గ్రామాలకు బస్సుల్ని పంపుతున్నాం. – బ్రహ్మానందరెడ్డి, ఈడీ (ఆపరేషన్స్) -
బస్సు, రైలు ప్రయాణం ఫ్రీ
ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల్లో గాలి కాలుష్యం ప్రధానమైంది. వ్యక్తిగత వాహనాలు ఎక్కువైపోవడం దీనికొకకారణం. మనిషి మనుగడకు ముప్పుగా పరిణమించిన వాయు కాలుష్యాన్ని నియంత్రించడానికి ప్రపంచ దేశాలు తమకు చేతనైన ప్రయత్నాలూ చేస్తున్నాయి. ఐరోపాలో బుల్లి దేశమైన లక్సంబర్గ్ ఈ విషయంలో ప్రపంచానికే ఆదర్శంగా నిలవనుంది. త్వరలో లక్సంబర్గ్ ప్రభుత్వం దేశంలో ప్రజా రవాణాను ఉచితం చేయనుంది. అంటే ప్రభుత్వం నడిపే రైళ్లు, ట్రామ్‌లు, బస్సుల్లో టికెట్ కొనాల్సిన పని ఉండదు. అది అమల్లోకి వస్తే ప్రపంచంలో ఇలాంటి విధానం అమలు చేస్తున్న తొలి దేశం లక్సంబర్గే అవుతుంది. 2020 నుంచి దేశంలో ఉచిత ప్రజా రవాణాను ప్రవేశపెట్టనున్నట్టు ప్రధాని గ్జేవియర్ బెటెల్ ప్రకటించారు. ఉచిత రవాణా వల్ల వ్యక్తిగత వాహనాలు తగ్గుతాయని దాంతో గాలి కాలుష్యం కొంత మేర తగ్గే అవకాశం ఉందని ఆయన వివరించారు. అంతేకాకుండా దీనివల్ల ట్రాఫిక్ రద్దీ కూడా తగ్గుతుందన్నారు. బెల్జియం, ఫ్రాన్స్, జర్మనీ దేశాల మధ్య ఉన్న చిన్న దేశం లక్సంబర్గ్. జనాభా 6 లక్షలు. దేశంలో ప్రతి వెయ్యి మందికి 647 కార్లు ఉన్నాయి. ఇక్కడి ప్రజలు ఏడాదిలో 32.21 గంటలు ప్రయాణాల్లోనే గడుపుతున్నారు. ప్రతిరోజూ పొరుగు దేశాల నుంచి లక్షా 90వేల మంది వచ్చి ఇక్కడ పనులు చేసుకుని వెళ్లిపోతుంటారు. వారిలో కొందరు సొంత వాహనాల్లో వస్తే, మరికొందరు ప్రభుత్వ వాహనాలను ఉపయోగిస్తున్నారు. దీనివల్ల దేశంలో ట్రాఫిక్ రద్దీ విపరీతంగా ఉంటోంది. ఎన్నికలప్పుడు ఇదీ కీలక ప్రచారాంశం కూడా అవుతోంది. ఈ నేపథ్యంలో ప్రజా రవాణాను ఉచితం చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం ఇతర దేశాలను కూడా ఈ దిశగా ఆలోచించేలా చేస్తోంది. 2013 లో తలిన్, ఎస్తోనియా దేశాలు రాజధాని నగరాల్లో ఉ చిత రవాణా విధానాన్ని ప్రవేశపెట్టాయి. తలిన్‌లో ప్రజలు 2యూరోలతో హరిత రవాణా పాస్ కొను క్కుని అన్ని మున్సిపల్ బస్సులు, రైళ్లలో ఉచితంగా ప్రయాణించవచ్చు. సీనియర్ సిటిజన్లకు ఎప్పటి నుంచో అక్కడ ఉచిత ప్రయాణ సదుపాయం ఉంది. ఒక్కో కుటుంబానికి రూ.7లక్షలు ఆదా.. ప్రభుత్వ రవాణా వ్యవస్థ వల్ల చాలా ప్రయోజనాలున్నాయని అమెరికన్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్(అప్టా) తెలిపింది. ఈ రంగంలో ప్రభుత్వం పెట్టుబడిగా పెట్టే ప్రతి డాలరుకు 4 డాలర్లు తిరిగి వస్తుందని ఆప్టా తెలిపింది. దీనివల్ల గ్రీన్హౌస్ ఉద్గారాలను గణనీయంగా తగ్గించవచ్చని పేర్కొంది. సొంత వాహనాలను పక్కనపెట్టి ప్రభుత్వ వాహనాలు ఉపయోగించడం వల్ల అమెరికాలో ఒక్కో కుటుంబం ఏడాదికి రూ.7 లక్షలకు పైగా ఆదా చేయవచ్చని ఆప్టా అంచనా వేసింది. -
రాజన్న భక్తులకు ఉచిత బస్సు సేవలు
వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజన్నను దర్శించుకునేందుకు వస్తున్న భక్తు లు గుడివద్దకు వెళ్లేందుకు పడుతున్న ఇబ్బందులు తప్పించేందుకు మంత్రి కేటీఆర్, దేవాదాయశాఖ అధికారులు, ఆలయ ఈవో రాజేశ్వర్ యత్నిస్తున్న క్రమంలో రెండు మినీబస్సులు ఇచ్చేందుకు ఖమ్మం జిల్లాకు చెందిన గాయత్రి గ్రానైట్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ వద్దిరాజు రవిచంద్ర, విజయలక్ష్మి దంపతులు ముందుకొచ్చారు. త్వరలోనే ఈ బస్సులను భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తామని ఆలయ అధికారులు తెలి పారు. భక్తుల కోసం మినీ బస్సులను స్వామి వారికి విరాళంగా అందించనున్నట్లు రవిచంద్ర, విజయలక్ష్మి దంపతులు ఈ నెల 13న ప్రకటించారు. -
ఉచితం.. వివాదం
ద్వారకాతిరుమల(పశ్చిమ గోదావరి జిల్లా): ద్వారకాతిరుమల క్షేత్రంలో తిరుగుతున్న దేవస్థానం ఉచిత బస్సుల కారణంగా తమ వ్యాపారాలు దెబ్బతింటున్నాయంటూ పలువురు వ్యాపారులు సోమవారం ఆవేదన వ్యక్తం చేశారు. క్షేత్రదేవత కుంకుళ్లమ్మ ఆలయం వద్ద ఉచిత బస్సులను అడ్డుకున్నారు. అధికారులు నిర్ణయం మార్చుకునే వరకు బస్సులకు అడ్డుతప్పుకునేది లేదంటూ నిరసనకు దిగారు. దీంతో క్షేత్రానికి వచ్చిన పలువురు భక్తులు ఇబ్బంది పడ్డారు. క్షేత్రానికి చేరుకునే యాత్రికులను స్థానిక గరుడాళ్వార్ సెంటర్ నుంచి ఉచిత బస్సుల ద్వారా దేవస్థానం అధికారులు కొండపైకి చేర్చేవారు. ఇలా చేయడం వల్ల తమ వ్యాపారాలు దెబ్బతింటున్నాయంటూ కొండ కింద వ్యాపారులు లబోదిబోమంటున్నారు. ఈ క్రమంలోనే కొద్దిరోజుల క్రితం దేవస్థానం బస్సులు నిలపడం వల్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని ఆలయ అధికారులకు స్థానిక పంచాయతీ లిఖితపూర్వకంగా తెలియజేసింది. దీంతో యాత్రికులకు ఇబ్బంది కలుగకూడదన్న ఉద్దేశంతో బస్సు సర్వీసులను క్షేత్రదేవత కుంకుళ్లమ్మ ఆల యం వద్ద నుంచి కొండపైకి నడపడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో సోమవారం గ్రామ మాజీ సర్పంచ్ మల్లిపెద్ది వెంకటేశ్వరరావు, కొండ దిగువ వ్యాపారులు కలసి కుంకుళ్లమ్మ ఆలయం వద్దకు చేరుకుని ఉచిత బస్సులను అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న దేవస్థానం ఈవో వేండ్ర త్రినాథరావు సంఘటనా స్థలానికి ఏఈ పి.ప్రసాద్, రొంపిచర్ల హనుమంతాచార్యులను పంపగా వారు మల్లిపెద్దితో చర్చించారు. బస్టాండ్ నుంచి అయితే అభ్యంతరం లేదు స్థానిక గరుడాళ్వార్ సెంటర్ నుంచి కొండపైకి బస్సులు తిప్పడం వల్ల కొండ దిగువ వ్యాపారులు నష్టపోతున్నారన్న విషయాన్ని ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావుకు చెప్పి బస్సులను నడపడం ఆపిస్తే.. మళ్లీ ఇక్కడి నుంచి వాటిని నడపడం ఏంటని మల్లిపెద్ది ఆలయ అధికారులను ప్రశ్నించారు. ఇలా నడుపుతున్నట్టు తమకు తెలియజేయలేదన్నారు. ఉచిత బస్సులను కొత్త బస్టాండ్ నుంచి గాని, దేవస్థానం ఆర్చిగేటు వద్ద నుంచి గాని నడిపితే తమకెలాంటి అభ్యంతరం ఉండదన్నారు. వ్యక్తిగత కక్షలతో వ్యాపారులను ఇబ్బంది పెట్టడం తగదన్నారు. అధికారుల ఆదేశానుసారం బస్సుల్లో భక్తులను కొండపైకి చేర్చుతున్నామని, సమస్య పునరావృతం కాకుండా చూస్తామని ఏఈ అన్నారు. భక్తుల సౌకర్యార్థమే బస్సులు దూర ప్రాంతాల నుంచి క్షేత్రానికి వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించే దిశగా ఉచిత బస్సు సర్వీసులను నడుపుతున్నామని, అయితే ఇలా అడ్డుకోవడం వల్ల యాత్రికులు ఇబ్బంది పడుతున్నారని ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు అన్నారు. విషయాన్ని ఆలయ చైర్మన్ ఎస్వీ సుధాకరరావు దృష్టికి తీసుకెళ్లానని, ఆయన ఆదేశానుసారం తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు.