కర్ణాటక: రాష్ట్ర వ్యాప్తంగా కేఎస్ ఆర్టీసీ బస్సులు మహిళా ప్రయాణికులతో కిక్కిరిసి సంచరిస్తున్నాయి. శక్తి యోజన పథకం కింద బస్సుల్లో ఉచిత ప్రయాణం కావడంతో మహిళలు పోటెత్తుతున్నారు. సాధారణ రోజులకంటే వీకెండ్ రోజుల్లో ఎక్కువ మంది ప్రయాణిస్తున్నారు. విహారయాత్రలకు వెళ్లేందుకు ఉత్సాహం చూపుతున్నారు. ఈక్రమంలో బస్సులు కిక్కిరిస్తున్నాయి.
శనివారం ఒక్కరోజే 1,06,09.835 మంది ప్రయాణించగా అందులో 58,14,524 మంది మహిళలు ఉన్నారు. ఇది సరాసరి 54.80 శాతం. దీంతో ప్రభుత్వంపై కోట్ల రూపాయలమేర భారం పడింది. కేఎస్‌ఆర్‌టీసీలో 17.29 లక్షల మంది మహిళలు ప్రయాణించగా రూ.4.92 కోట్లు, బీఎంటీసీలో 18.95 లక్షల మంది ప్రయాణించగా రూ.2.41 కోట్లు, వాయువ్య రవాణా సంస్థలో 14 లక్షలమంది ప్రయాణించగా రూ.3.50 కోట్ల భారం పడింది. కల్యాణ కర్ణాటక రవాణా సంస్థపై రూ.2.55 కోట్ల భారం పడింది.
సీట్ల కోసం ఎగబడుతున్న జనం
ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి మహిళలు పెద్ద ఎత్తున తరలివస్తుండగా సీట్ల కొరత ఏర్పడుతోంది. ప్రయాణికులు డ్రైవరు క్యాబిన్ మీదుగా లోపలకు ప్రవేశించి సీట్ల కోసం పోటీ పడుతున్న దృశ్యాలు నిత్యకృత్యం అయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment