కర్ణాటక: ఉచితంగా మహిళలకు బస్సు ప్రయాణాల పథకంలో స్వల్ప మార్పు చేస్తామని రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి అన్నారు. సోమవారం విధానసౌధలో మాట్లాడుతూ... 15 రోజులు పాటు చూసి ఆ తరువాత అవసరమైన మార్పులు చేస్తామన్నారు. ఈనెల 11న 5 లక్షల 70 వేల మంది బస్సుల్లో ప్రయాణించారు. ఇప్పటికే మూడు కోట్ల మంది మహిళలు ప్రయాణాలు చేశారు.
అయితే ఒకేసారి ఇంతమంది వెళ్లరాదని కోరారు. పుణ్యక్షేత్రాలకు అంటూ పెద్ద ఎత్తున తరలివస్తున్నారని, దీని వల్ల ఇతర ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. వారంలో రూ. 70 కోట్ల విలువ చేసే ఉచిత ప్రయాణాలపై స్పందించిన ఆయన ప్రారంభంలో కాబట్టి రద్దీ ఉంటుందని, రోజు వెళ్లరని అన్నారు. ప్రైవేట్ బస్సులకు నష్టం జరుగుతున్న విషయంపై మాట్లాడిన ఆయన, ప్రైవేట్ బస్సువారు కూడా ట్యాక్స్ చెల్లిస్తున్నారు. వారి జీవితము గడవాలి. ప్రస్తుతం ఉత్సాహంలో మహిళలు ప్రయాణం చేస్తు న్నారు. ముందు రోజుల్లో మహిళల సంఖ్య తగ్గుతుందోమో చూడాలని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment