బెంగుళూరు: కర్ణాటకలో ప్రభుత్వం ఇటీవల మహిళలకు శక్తి యోజన కింద ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిన సంగతి తెలిసిందే. ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవడం కోసం ఒక హిందూ వ్యక్తి వేషం మార్చి బుర్ఖా ధరించి పట్టుబడ్డాడు.
శక్తి యోజన పథకంలో భాగంగా కర్ణాటక ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ వెసులుబాటును కల్పించింది. అయితే దీన్ని అవకాశంగా చేసుకుని ధార్వాడ్ జిల్లాలో మత్తపాటి వీరభద్రయ్య అనే వ్యక్తి కొంచెం అటు ఇటుగా కటౌట్ మార్చుకుని బుర్ఖా ధరించి సాహసానికి తెగించాడు. ఎవ్వరికీ అనుమానం రాకుండా బస్ స్టాప్ లోకి వచ్చి కూర్చున్నాడు.
అతడిని చూడగానే అక్కడి వారికి అనుమానం రావడంతో ప్రశ్నలు మీద ప్రశ్నలు సంధించారు. వారడిగిన ఏ ప్రశ్నకీ అతని వద్ద సమాధానం లేదు. బిక్షాటన చేసుకునేందుకే బుర్ఖా ధరించానని వీరభద్రయ్య చెప్పినా కూడా ఆ సమాధానానికి అక్కడివారు సంతృప్తి చెందలేదు. దీంతో బలవంతంగా ముసుగు తీశాక అసలు బాగోతం బయటపడింది. పైగా అతడి వద్ద మహిళ పేరుతో ఒక ఆధార్ కార్డు కూడా ఉండడం విశేషం. కర్ణాటకలో జరిగిన ఈ సంఘటన వైరల్ గా మారింది.
ఇది కూడా చదవండి: మణిపూర్ అల్లర్లు: పాఠశాల ఎదుటే మహిళ దారుణ హత్య
Comments
Please login to add a commentAdd a comment