free ticket
-
హవ్వా! మహిళలకు ఉచిత ప్రయాణం అనగానే.. బుర్ఖా ధరించి..
బెంగుళూరు: కర్ణాటకలో ప్రభుత్వం ఇటీవల మహిళలకు శక్తి యోజన కింద ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిన సంగతి తెలిసిందే. ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవడం కోసం ఒక హిందూ వ్యక్తి వేషం మార్చి బుర్ఖా ధరించి పట్టుబడ్డాడు. శక్తి యోజన పథకంలో భాగంగా కర్ణాటక ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ వెసులుబాటును కల్పించింది. అయితే దీన్ని అవకాశంగా చేసుకుని ధార్వాడ్ జిల్లాలో మత్తపాటి వీరభద్రయ్య అనే వ్యక్తి కొంచెం అటు ఇటుగా కటౌట్ మార్చుకుని బుర్ఖా ధరించి సాహసానికి తెగించాడు. ఎవ్వరికీ అనుమానం రాకుండా బస్ స్టాప్ లోకి వచ్చి కూర్చున్నాడు. అతడిని చూడగానే అక్కడి వారికి అనుమానం రావడంతో ప్రశ్నలు మీద ప్రశ్నలు సంధించారు. వారడిగిన ఏ ప్రశ్నకీ అతని వద్ద సమాధానం లేదు. బిక్షాటన చేసుకునేందుకే బుర్ఖా ధరించానని వీరభద్రయ్య చెప్పినా కూడా ఆ సమాధానానికి అక్కడివారు సంతృప్తి చెందలేదు. దీంతో బలవంతంగా ముసుగు తీశాక అసలు బాగోతం బయటపడింది. పైగా అతడి వద్ద మహిళ పేరుతో ఒక ఆధార్ కార్డు కూడా ఉండడం విశేషం. కర్ణాటకలో జరిగిన ఈ సంఘటన వైరల్ గా మారింది. ఇది కూడా చదవండి: మణిపూర్ అల్లర్లు: పాఠశాల ఎదుటే మహిళ దారుణ హత్య -
మహిళా ప్రయాణికులతో కిక్కిరిసిపోయిన కేఎస్ ఆర్టీసీ బస్సులు
-
గుంజీలు తీయండి..ఫ్రీగా బస్సు టిక్కెట్ పొందండి!
చిన్నప్పుడూ తప్పు చేస్తే గుంజీలు తీసే పనిష్మెంట్ ఇచ్చేవారు మాష్టార్లు. ఇది అందరికి అనుభవమే. ఐతే ఇక్కడొక దేశంలో మాత్రం ప్రజలు గుంజీలు తీసి.. ఫ్రీగా బస్సు టిక్కెట్ పొందుతారు. ఇదేంటి అని అనుకుంటున్నారా!. ఔను అక్కడ సుమారు 20 గుంజీలు తీస్తే.. ఫ్రీగా బస్సులో తిరిగేయవచ్చు. యూరప్‌లోని రొమానియా అనే నగరంలో అక్కడి ప్రభుత్వం ప్రజలకు ఇలాంటి మంచి ఆఫర్‌ని అందిస్తోంది. దీన్ని అక్కడి ప్రభుత్వం స్పోర్ట్స్ ఫెస్టివల్ అనే ఆరోగ్య కార్యక్రమంలో భాగంగా ఈ అద్భుతమైన ఆఫర్‌ని ప్రజలకు ఇస్తోంది. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా దీన్ని ప్రవేశపెట్టిందట అక్కడి ప్రభుత్వం. ఈ ఉచిత టిక్కెట్‌ను అక్కడి ప్రజలు హెల్త్ టిక్కెట్‌గా పిలుస్తారు. అంతేకాదండోయ్ కేవలం రెండు నిమిషాల్లో 20 గుంజీలు తీస్తేనే ఫ్రీగా బస్సు టిక్కెట్ పొందగలరు. అందుకు సంబంధించిన వీడియోని అలీనా బ్జోల్కినా అనే వినియోగదారుడు ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేయడంతో నెట్టింట వైరల్ అవుతోంది. ఆ వీడియోలో... ఒక అమ్మాయి ఒక మిషన్ బూత్ ముందు నిలబడి 20 గంజీలు తీస్తుంది. అయిపోగానే టిక్కెట్ మిషన్ నుంచి బయటకు వచ్చినట్లు కనిపిస్తోంది. View this post on Instagram A post shared by Алина Бжолка (@alinabzholkina) (చదవండి: అంతా ఈజీ కాదు దొంగతనం! ఎంత కూల్‌గా దొంగను బంధించాడు!) -
శబరిమలకి ఆర్టీసీ సర్వీసులు.. ప్రతీ బస్సులో ఐదుగురికి ఉచిత ప్రయాణం
తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ ప్రతీ ఒక్క అవకాశాన్ని గరిష్టంగా వినియోగించుకునే పనిలో ఉంది. ఇప్పటికే కార్తీక మాసం ప్రత్యేక బస్సులను నడుపుతున్న ఆర్టీసీ తాజాగా అయ్యప్ప స్వాముల కోసం శబరిమలకి బస్సు సర్వీసులు ప్రారంభించాలని నిర్ణయించింది. శబరికి బస్సులు కార్తీక మాసం రావడంతో పల్లె పట్నం తేడా లేకుండా అయ్యప్పమాల ధరించిన వారే కనిపిస్తున్నారు. స్వామి శరణం మాట ప్రతీ చోట ధ్వనిస్తోంది. ఎక్కువ మంది భక్తులు అయ్యప్ప మాల విరణమ కోసం శబరిమలకి వెళ్తుంటారు. ఇలా వేళ్లే వారు ఇప్పటి వరకు ఎక్కువగా ప్రైవేటు వెహికల్స్‌నే ఆశ్రయిస్తున్నారను. కాగా అయ్యప్ప భక్తుల కోసం తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపిస్తోంది. ఐదుగురికి ఫ్రీ శబరిమలకి వెళ్లే భక్తులు ఆర్టీసీ బస్సును బుక్ చేసుకుంటే అదే బస్సులో మరో ఐదుగురికి ఉచిత ప్రయాణం కల్పిస్తామని ఆర్టీసీ అధికారులు అంటున్నారు. ఈ మేరకు వరంగల్ 1 డిపో తరఫున ట్విట్టర్లో ప్రచారం కూడా మొదలు పెట్టారు. బుక్ చేసుకున్న బస్సులో అయ్యప్ప భక్తులతో పాటు ఇద్దరు వంట మనుషులు, ఒక అటెండర్, పదేళ్లలోపు ఇద్దరు మునికంట స్వాములకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని ఆర్టీసీ అంటోంది. మొత్తంగా మూడు ఫుల్ టిక్కెట్లు, రెండు ఆఫ్ టిక్కెట్లకు ఎటువంటి రుసుము వసూలు చేయడం లేదు. శబరిమల వెళ్లే భక్తులకు వరంగల్ 1 డిపో నుండి ఆర్టీసీ స్పెషల్ బస్సులు ఇవ్వబడును. వివరాలకు డిపోమేనేజర్ ని సంప్రదించగలరు. #choosetsrtc #shabarimala #rtchirebuses @tsrtcmdoffice @TSRTCHQ pic.twitter.com/dQusTBiyde — Depot Manager WL1 (@dmwgl1) November 16, 2021 ఛార్జీలు ఇలా శబరిమలైకి వెళ్లే భక్తులు అయ్యప్ప దర్శనంతో పాటు ఇతర పుణ్యక్షేత్రాలను కూడా సందర్శిస్తుంటారు. ఈ టూర్‌కి అనుగుణంగా ఆర్టీసీ కిలోమీటర్ల వంతున ఛార్జీలు నిర్ణయించింది. వీటితో పాటు ప్రతీ గంటకు రూ.300ల వంతున వెయిటింగ్ ఛార్జీ్ కూడా ఉంటుంది. గంటకు సగటున 30 కిలోమీటర్ల వంతున ప్రయాణ సమయాన్ని లెక్కిస్తున్నారు. ఆర్టీసీ శబరిమలై బస్సుల ఛార్జీలు ఇలా ఉన్నాయి. - 36 సీట్ల సూపర్ లగ్జరీ బస్సులకు కిలోమీటరుకు రూ.48.96 - 40 సీట్లు ఉన్న డీలక్స్ బస్సులకు కిలోమీటరుకు రూ.47.20 - 48 సీట్లు ఉన్న డీలక్స్ బస్సులకు కిలోమీటరుకు రూ.56.64 - 49 సీట్లు ఉన్న ఆర్టీసీ బస్సులకు కిలోమీటరుకు రూ.52.49 చదవండి:ఆర్టీసీ ఎండీ సజ్జనార్.. ప్రిన్స్ మహేశ్.. అదిరింది సార్! -
టాయిలెట్ కడితే కబాలీ టికెట్స్ ఫ్రీ
పుదుచ్ఛేరి: 'మీ ఇంట్లో టాయిలెట్ నిర్మించుకోండి.. మీ అభిమాన నటుడు రజినీకాంత్ నటించిన కబాలీ టికెట్లను ఉచితంగా పొందండి' అంటూ పుదుచ్ఛేరి ప్రభుత్వం ఓ బ్రహ్మాండమైన ప్రచారం మొదలుపెట్టింది. సెల్లిపెట్ అనే పంచాయత్‌లో సర్వే చేపట్టిన ప్రభుత్వానికి అక్కడ ఉన్న 772 నివాసాల్లో 447 నివాసాలకు మరుగుదొడ్లు లేవని గుర్తించింది. దీంతో రజీనీ అంటే పడిచచ్చే అభిమానులను దృష్టిలో పెట్టుకొని పుదుచ్ఛేరి ప్రభుత్వం ఆ పంచాయత్ వరకు ఈ ఆఫర్ ప్రకటించింది. టాయిలెట్ నిర్మించిన వారి ఇంటికి కబాలీ చిత్ర టికెట్లు ఉచితంగా పంపిస్తామని ప్రకటించింది. రజినీ మేనియా ఏమేరకు పనిచేస్తుందో తెలుసుకోవాలంటే కాస్త ఎదురుచూడాలి మరి. ఇప్పటికే పుదుచ్ఛేరిలోని స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండాలంటూ రజినీకాంత్‌కు ఆ ప్రాంత లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ భేడీ విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే.