
చిన్నప్పుడూ తప్పు చేస్తే గుంజీలు తీసే పనిష్మెంట్ ఇచ్చేవారు మాష్టార్లు. ఇది అందరికి అనుభవమే. ఐతే ఇక్కడొక దేశంలో మాత్రం ప్రజలు గుంజీలు తీసి.. ఫ్రీగా బస్సు టిక్కెట్ పొందుతారు. ఇదేంటి అని అనుకుంటున్నారా!. ఔను అక్కడ సుమారు 20 గుంజీలు తీస్తే.. ఫ్రీగా బస్సులో తిరిగేయవచ్చు. యూరప్‌లోని రొమానియా అనే నగరంలో అక్కడి ప్రభుత్వం ప్రజలకు ఇలాంటి మంచి ఆఫర్‌ని అందిస్తోంది.
దీన్ని అక్కడి ప్రభుత్వం స్పోర్ట్స్ ఫెస్టివల్ అనే ఆరోగ్య కార్యక్రమంలో భాగంగా ఈ అద్భుతమైన ఆఫర్‌ని ప్రజలకు ఇస్తోంది. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా దీన్ని ప్రవేశపెట్టిందట అక్కడి ప్రభుత్వం. ఈ ఉచిత టిక్కెట్‌ను అక్కడి ప్రజలు హెల్త్ టిక్కెట్‌గా పిలుస్తారు. అంతేకాదండోయ్ కేవలం రెండు నిమిషాల్లో 20 గుంజీలు తీస్తేనే ఫ్రీగా బస్సు టిక్కెట్ పొందగలరు.
అందుకు సంబంధించిన వీడియోని అలీనా బ్జోల్కినా అనే వినియోగదారుడు ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేయడంతో నెట్టింట వైరల్ అవుతోంది. ఆ వీడియోలో... ఒక అమ్మాయి ఒక మిషన్ బూత్ ముందు నిలబడి 20 గంజీలు తీస్తుంది. అయిపోగానే టిక్కెట్ మిషన్ నుంచి బయటకు వచ్చినట్లు కనిపిస్తోంది.
(చదవండి: అంతా ఈజీ కాదు దొంగతనం! ఎంత కూల్‌గా దొంగను బంధించాడు!)
Comments
Please login to add a commentAdd a comment