టాయిలెట్ కడితే కబాలీ టికెట్స్ ఫ్రీ | Build toilets, get free ticket for Rajnikant's latest flick: Puducherry govt | Sakshi
Sakshi News home page

టాయిలెట్ కడితే కబాలీ టికెట్స్ ఫ్రీ

Published Fri, Jul 1 2016 8:47 AM | Last Updated on Tue, Aug 28 2018 5:25 PM

టాయిలెట్ కడితే కబాలీ టికెట్స్ ఫ్రీ - Sakshi

టాయిలెట్ కడితే కబాలీ టికెట్స్ ఫ్రీ

పుదుచ్ఛేరి: 'మీ ఇంట్లో టాయిలెట్ నిర్మించుకోండి.. మీ అభిమాన నటుడు రజినీకాంత్ నటించిన కబాలీ టికెట్లను ఉచితంగా పొందండి' అంటూ పుదుచ్ఛేరి ప్రభుత్వం ఓ బ్రహ్మాండమైన ప్రచారం మొదలుపెట్టింది. సెల్లిపెట్ అనే పంచాయత్లో సర్వే చేపట్టిన ప్రభుత్వానికి అక్కడ ఉన్న 772 నివాసాల్లో 447 నివాసాలకు మరుగుదొడ్లు లేవని గుర్తించింది.

దీంతో రజీనీ అంటే పడిచచ్చే అభిమానులను దృష్టిలో పెట్టుకొని పుదుచ్ఛేరి ప్రభుత్వం ఆ పంచాయత్ వరకు ఈ ఆఫర్ ప్రకటించింది. టాయిలెట్ నిర్మించిన వారి ఇంటికి కబాలీ చిత్ర టికెట్లు ఉచితంగా పంపిస్తామని ప్రకటించింది. రజినీ మేనియా ఏమేరకు పనిచేస్తుందో తెలుసుకోవాలంటే కాస్త ఎదురుచూడాలి మరి. ఇప్పటికే పుదుచ్ఛేరిలోని స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్గా ఉండాలంటూ రజినీకాంత్కు ఆ ప్రాంత లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ భేడీ విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement