Rajnikant
-
ముంబై : నీతా అంబానీ ‘ఎన్ఎంఏసీసీ’లో తారల తళుకులు (ఫొటోలు)
-
టాయిలెట్ కడితే కబాలీ టికెట్స్ ఫ్రీ
పుదుచ్ఛేరి: 'మీ ఇంట్లో టాయిలెట్ నిర్మించుకోండి.. మీ అభిమాన నటుడు రజినీకాంత్ నటించిన కబాలీ టికెట్లను ఉచితంగా పొందండి' అంటూ పుదుచ్ఛేరి ప్రభుత్వం ఓ బ్రహ్మాండమైన ప్రచారం మొదలుపెట్టింది. సెల్లిపెట్ అనే పంచాయత్‌లో సర్వే చేపట్టిన ప్రభుత్వానికి అక్కడ ఉన్న 772 నివాసాల్లో 447 నివాసాలకు మరుగుదొడ్లు లేవని గుర్తించింది. దీంతో రజీనీ అంటే పడిచచ్చే అభిమానులను దృష్టిలో పెట్టుకొని పుదుచ్ఛేరి ప్రభుత్వం ఆ పంచాయత్ వరకు ఈ ఆఫర్ ప్రకటించింది. టాయిలెట్ నిర్మించిన వారి ఇంటికి కబాలీ చిత్ర టికెట్లు ఉచితంగా పంపిస్తామని ప్రకటించింది. రజినీ మేనియా ఏమేరకు పనిచేస్తుందో తెలుసుకోవాలంటే కాస్త ఎదురుచూడాలి మరి. ఇప్పటికే పుదుచ్ఛేరిలోని స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండాలంటూ రజినీకాంత్‌కు ఆ ప్రాంత లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ భేడీ విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. -
సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా బంగారద మనుష్య!
సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా సాక్షి, బెంగళూరు : కన్నడ సినీ రంగంలో డెబ్బైయవ దశకంలో ట్రెండ్‌ను సృష్టించిన సినిమా ‘బంగారద మనుష్య’. కన్నడ కంఠీరవుడు డాక్టర్ రాజ్‌కుమార్, ప్రముఖ నటి భారతి జంటగా నటించిన ఈ సినిమాకు సిద్ధలింగయ్య దర్శకత్వం వహించారు. ప్రముఖ రచయిత టీకే రామారావ్ నవల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలను అందుకోవడంతో పాటు చదువుకున్న వారు కూడా వ్యవసాయ రంగంలోకి రావాల్సిన ప్రాధాన్యతను చాటిచెప్పింది. ఈ సినిమా విడుదల 42 ఏళ్లు గడిచిపోయిన తర్వాత ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నారు అనుకుంటున్నారా.. అందుకో కారణం ఉందండోయ్. త్వరలోనే ఈ సినిమా తమిళంలో రీమేక్ అయి రానుందని గాంధీ వర్గాల సమాచారం. సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా ‘బంగారద మనుష్య’ తమిళంలో రీమేక్ కానుంది. ప్రస్తుతం ‘లింగా’ సినిమా షూటింగ్లో రజనీ బిజీగా ఉన్నారు. అయితే లింగా కంటే ముందుగానే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లాల్సి ఉండగా, కొన్ని కారణాల వల్ల వాయిదా పడ్డట్లు తెలుస్తోంది. ఈ విషయంపై రజనీకాంత్ ఆప్తమిత్రుడు రాజ్ బహద్దూర్ మాట్లాడుతూ....‘1972లో నేను బస్‌డ్రైవర్‌గా రజనీ అదే బస్‌కు కండక్టర్‌గా ఉన్న సమయంలో ‘బంగారద మనుష్య’ సినిమా విడుదలైంది. అప్పట్లో మేమిద్దరం కలిసి ఆ సినిమా చూశాం. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఆ సినిమాను రజనీకాంత్‌తో రీమేక్ చేయించాలని నేను అనుకున్నాను. ఇదే విషయాన్ని రజనీకాంత్ వద్ద ప్రస్తావించినపుడు మళ్లీ మేమిద్దరం కలిసి ఆ సినిమా చూశాం. ఈ సినిమా రీమేక్‌లో కథానాయకుడిగా కనిపించేందుకు రజనీ కూడా ఆసక్తి కనబరుస్తున్నారు’ అని తెలిపారు. ప్రస్తుతం రజనీ ‘లింగా’ సినిమాతో బిజీగా ఉండడం వల్ల బహుశా వచ్చే ఏడాది ‘బంగారద మనుష్య’ రీమేక్ వర్షన్ సెట్స్ పకి వెళ్లే అవకాశాలున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. -
ఓటు హక్కు వినియోగించుకున్న రజనీకాంత్!
చెన్నై: సూపర్ స్టార్ రజనీకాంత్ గురువారం ఉదయం ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోయెస్ గార్డెన్ ప్రాంతంలోని ఓ పోలింగ్ బూత్ లో రజనీ ఓటు వేశారు. తమిళనాడులో 39 లోకసభ స్థానాలకు, ఓ అసెంబ్లీకి ఉప ఎన్నిక జరుగుతోంది. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ ఇటీవల రజనీకాంత్ ను ఆయన నివాసంలో కలుసుకుని బీజేపీ కూటమికి మద్దతివ్వాలని కోరిన సంగతి తెలిసిందే. మోడీ అభ్యర్ధనకు సానుకూలంగా స్పందించినప్పటికి.. బహిరంగంగా ఎలాంటి మద్దతు ప్రకటించలేదు. తమిళనాడులోని పలుపార్టీలతో బీజేపీ పొత్తు కుదుర్చుకుని బలమైన కూటమిగా ఏర్పడేందుకు కృషి చేసిన సంగతి తెలిసిందే.