ఓటు హక్కు వినియోగించుకున్న రజనీకాంత్!
Published Thu, Apr 24 2014 10:03 AM | Last Updated on Wed, Aug 15 2018 2:14 PM
చెన్నై: సూపర్ స్టార్ రజనీకాంత్ గురువారం ఉదయం ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోయెస్ గార్డెన్ ప్రాంతంలోని ఓ పోలింగ్ బూత్ లో రజనీ ఓటు వేశారు. తమిళనాడులో 39 లోకసభ స్థానాలకు, ఓ అసెంబ్లీకి ఉప ఎన్నిక జరుగుతోంది.
బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ ఇటీవల రజనీకాంత్ ను ఆయన నివాసంలో కలుసుకుని బీజేపీ కూటమికి మద్దతివ్వాలని కోరిన సంగతి తెలిసిందే.
మోడీ అభ్యర్ధనకు సానుకూలంగా స్పందించినప్పటికి.. బహిరంగంగా ఎలాంటి మద్దతు ప్రకటించలేదు. తమిళనాడులోని పలుపార్టీలతో బీజేపీ పొత్తు కుదుర్చుకుని బలమైన కూటమిగా ఏర్పడేందుకు కృషి చేసిన సంగతి తెలిసిందే.
Advertisement
Advertisement