visist
-
దైవసన్నిధిలో హీరో ప్రభాస్.. స్పెషల్ పూజలు కూడా (ఫొటోలు)
-
వేములవాడ రాజన్నను దర్శించుకున్న ప్రముఖ దర్శకుడు
Sampath Nandi Visits Vemulawada Sri Raja Rajeshwara Swamy Temple: తెలంగాణలోని ప్రముఖ పుణ్య క్షేత్రాల్లో ఒకటైనా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని ప్రముఖ దర్శకుడు సంపత్ నంది దంపతులు దర్శించుకున్నారు. అనంతరం కోడె మొక్కులు చెల్లించుకున్నారు. దంపతులిద్దరికి ఆలయ అర్చకులు ఆశీర్వచనం అందించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు ఇచ్చారు. సంపత్ నంది వెంట కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్, పలువురు ఉన్నారు. తన తదుపరి సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ను స్వామి వారి పాదాల వద్ద ప్రత్యేక పూజలు చేశామని సంపత్ నంది తెలిపారు. త్వరలో నందమూరి నటసింహం బాలకృష్ణతో సినిమా తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించారు. అలాగే సంపత్ నంది 'బ్లాక్ రోజ్, ఓదెల రైల్వేస్టేషన్' చిత్రాలకు కథ అందించారు. 'ఏమైంది ఈవేళ' సినిమాతో తెరంగ్రేటం చేసి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'రచ్చ' చిత్రంతో హిట్ కొట్టిన డైరెక్టర్ సంపత్ నంది. తర్వాత బెంగాల్ టైగర్, గౌతమ్ నంద, సిటీమార్ చిత్రాలతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. దర్శకుడిగానే కాకుండా పేపర్ బాయ్, గాలిపటం సినిమాలతో రచయితగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల విడుదలైన సిటీమార్ 2021లో భారీ హిట్ సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. కబడ్డీ బ్యాక్డ్రాప్లో సాగే ఈ సినిమాలో గోపిచంద్, మిల్క్ బ్యూటీ తమన్నా, దిగంగన సూర్యవంశీ హీరో హీరోయిన్లుగా నటించారు. ఇదీ చదవండి: పదేళ్లుగా నాకు ఈ స్థాయిలో హిట్ మూవీ రాలేదు : సంపత్ నంది -
ఫ్యామిలీతో కలిసి ఆలయాన్ని సందర్శించిన కాజల్
తన తాజా హిందీ చిత్రం ‘ఉమ’ కోసం హీరోయిన్ కాజల్ అగర్వాల్ కోల్కతాలో ఉన్న సంగతి తెలిసిందే. ‘ఉమ’ షూటింగ్కు కాస్త విరామం దొరకడంతో తన కుటుంబసభ్యులతో కలిసి దక్షిణేశ్వర దేవాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా తన ఫ్యామిలీతో ఉన్న ఫొటోను కాజల్ షేర్ చేశారు. -
ఆధ్యాత్మికత అలవర్చుకోవాలి
పెద్దాపురం : ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికత అలవర్చుకుని, దైవచింతనతో ఉండాలని కంచి కామకోటి పీఠం ఉత్తరాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి అన్నారు. కార్తిక మాసం పంచారామ క్షేత్ర పర్యటనలో భాగంగా జిల్లాకు వచ్చిన ఆయన మంగళవారం సాయంత్రం ప్రముఖ పారిశ్రామిక వేత్త మట్టే శ్రీనివాస్, మందవిల్లి శ్రీనివాస ముత్యాలు గృహాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక సభలో విజయేంద్ర సరస్వతి మాట్లాడుతూ లోకం శాంతి సౌభాగ్యాలతో విలసిల్లాలని ఆకాక్షించారు. «ఆధ్యాత్మిక భావాలు, దైవచింతన కల్గి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో కంచి మహా సంస్థానం అధ్యక్షలు చంద్రాభట్ల గణపతి శాస్త్రీ, ఆధ్యాత్మిక గురువులు, అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ప్రసన్నాంజనేయస్వామి ఆలయంలో పూజలు సామర్లకోట : స్థానిక ప్రసన్నాంజనేయస్వామి ఆలయంలో కంచి కామకోటి పీఠం ఉత్తరాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి మంగళవారం రాత్రి పూజలు చేశారు. జిల్లా పర్యటనలో భాగంగా పెద్దాపురం నుంచి వచ్చిన ఆయనకు ఆలయ కమిటీ నాయకులు స్వాగతం పలికారు. ఆయన ఆలయంలో పూజలు చేశారు. కంచికామకోటి పీఠం సభ్యులు చంద్రాభట్ల చింతామణి గణపతి శాస్త్రి, పతంజలి శాస్త్రి, విజయేంద్రసరస్వతి శిషులు పాల్గొన్నారు. అనంతరం వేట్లపాలెం గ్రామంలోని రామకృష్ణ సేవా సమితిని సందర్శించారు.