vemulawada rajarajeswara temple
-
వేములవాడ రాజన్నను దర్శించుకున్న ప్రముఖ దర్శకుడు
Sampath Nandi Visits Vemulawada Sri Raja Rajeshwara Swamy Temple: తెలంగాణలోని ప్రముఖ పుణ్య క్షేత్రాల్లో ఒకటైనా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని ప్రముఖ దర్శకుడు సంపత్ నంది దంపతులు దర్శించుకున్నారు. అనంతరం కోడె మొక్కులు చెల్లించుకున్నారు. దంపతులిద్దరికి ఆలయ అర్చకులు ఆశీర్వచనం అందించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు ఇచ్చారు. సంపత్ నంది వెంట కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్, పలువురు ఉన్నారు. తన తదుపరి సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ను స్వామి వారి పాదాల వద్ద ప్రత్యేక పూజలు చేశామని సంపత్ నంది తెలిపారు. త్వరలో నందమూరి నటసింహం బాలకృష్ణతో సినిమా తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించారు. అలాగే సంపత్ నంది 'బ్లాక్ రోజ్, ఓదెల రైల్వేస్టేషన్' చిత్రాలకు కథ అందించారు. 'ఏమైంది ఈవేళ' సినిమాతో తెరంగ్రేటం చేసి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'రచ్చ' చిత్రంతో హిట్ కొట్టిన డైరెక్టర్ సంపత్ నంది. తర్వాత బెంగాల్ టైగర్, గౌతమ్ నంద, సిటీమార్ చిత్రాలతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. దర్శకుడిగానే కాకుండా పేపర్ బాయ్, గాలిపటం సినిమాలతో రచయితగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల విడుదలైన సిటీమార్ 2021లో భారీ హిట్ సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. కబడ్డీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమాలో గోపిచంద్, మిల్క్ బ్యూటీ తమన్నా, దిగంగన సూర్యవంశీ హీరో హీరోయిన్లుగా నటించారు. ఇదీ చదవండి: పదేళ్లుగా నాకు ఈ స్థాయిలో హిట్ మూవీ రాలేదు : సంపత్ నంది -
రాజన్న సన్నిధిలో కార్తీక సందడి
సాక్షి, వేములవాడ : వేములవాడ రాజన్న ఆలయానికి కార్తీక శోభ సంతరించుకుంది. నెల రోజులపాటు స్వామివారు భక్తుల విశేష పూజలందుకుంటారు. ఆదివారం అమావాస్య అయినప్పటికీ రాజన్నను దర్శించుకునేందుకు 10 వేల మందికి పైగా భక్తులు వచ్చారు. కార్తీకదీపాలు వెలిగించి, మొక్కు తీర్చుకున్నారు. కోవిడ్–19 నిబంధనల మేరకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ నెల 26న సాయంత్రం 6.30 గంటలకు విఠలేశ్వర స్వామికి శ్రీకృష్ణతులసీ కల్యాణం జరిపిస్తున్నట్లు స్థానాచార్యులు అప్పాల భీమాశంకరశర్మ తెలిపారు. 28న వైకుంఠ చతుర్ధశిని పురస్కరించుకుని శ్రీఅనంతపద్మనాభ స్వామి వారికి 12 మంది రుత్విజులతో మహాభిషేకం జరపనున్నట్లు పేర్కొన్నారు. అదేరోజు రాత్రి 7.30 గంటలకు శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామికి మహాపూజ, పొన్నసేవపై స్వామివార్లకు ఊరేగింపు, రాత్రి 8 గంటలకు జ్వాలాతోరణం, 10.30 గంటలకు స్వామివారి నిషిపూజ అనంతరం మహాపూజ ఉంటుందన్నారు. వేములవాడలో దీపావళి వేడుకలు వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో దీపావళి వేడుకలు శనివారం అత్యంత వైభవంగా జరిగాయి. అర్చకులు ఉదయం స్వామివారి సన్నిధిలో నిత్యపూజలు నిర్వహించారు. సాయంత్రం 6 గంటల నుంచి దాదాపు గంటన్నరపాటు కల్యాణ మండపంలో స్థానాచార్యులు అప్పాల భీమాశంకరశర్మ ఆధ్వర్యంలో ధనలక్ష్మీ పూజ ఘనంగా జరిపించారు. అనంతరం శ్రీపార్వతీరాజరాజేశ్వర స్వామి, శ్రీఅనంతపద్మనాభస్వామి వార్ల ఉత్సవమూర్తులను గజ వాహనంపై ఊరేగించారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు, స్థానికులు పాల్గొన్నారు. పూజలు చేస్తున్న అర్చకులు కార్తీకం.. సర్వపాప హరణం! కరీంనగర్ కల్చరల్/విద్యానగర్(కరీంనగర్): కార్తీకమాసం శివుడికి ప్రీతికర మాసం.. అందుకే దీన్ని పవిత్రమాసంగా భావిస్తారు.. సోమవారం నుంచి కార్తీక మాసం ప్రారంభమవుతుంది.. ఈ మాసంలో దీపారాధన చేయ డం ద్వారా సర్వపాపాలు హరించుకుపోతాయని ప్రజల నమ్మకం. తెల్లవారుజామునే నిద్రలేవడం.. కతికా నక్షత్రం అస్తమించేలోగా స్నానమాచరించడం, భోళాశంకురుడికి నిత్యం రుద్రాభిషేకం చేయడం, మెడలో రుద్రాక్షలు, తులసీ పూసల్ని ధరించడం, ఒక్కపూట మాత్రమే భోజనం చేయడం వంటి సంప్రదాయాలను ఆచరిస్తారు. కతికా నక్షత్రానికి అధిపతి అగ్ని, అగ్నికి మారుపేరు రుద్రుడు. ప్రతీ ఆలయంలో ఉదయం, సాయంత్రం దీపారాధన చేయడం వల్ల శుభాలు కలుగుతాయి. పుత్రులు లేని వారికి పుత్రులు, దరిద్రులకు ధనం, పురుషులకు గహస్తులు, భోగమోక్షాలు లభించడంతో పాటు వానప్రస్థ ఆశ్రమాలలో ఉండే వారికి జ్ఞాన వైరాగ్యత, స్త్రీలకు మోక్షం, మహాపుణ్యం కలుగుతాయి. కార్తీకమాసం నేపథ్యంలో దానాలు, పూజలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. శైవక్షేత్రాల్లో అర్చనలు, అభిషేకాలు.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని వేములవాడ, కాళేశ్వరంతో పాటు అన్ని ప్రాంతాల్లోని శివక్షేత్రాల్లో అర్చనలు, అభిషేకాలు జరుగుతాయి. కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమికి చాలా ప్రత్యేక ఉంది. ఈ రోజు దీపదానాలు చేస్తే సకల పాపాలు హరించుకుపోతాయని భక్తుల విశ్వాసం. దానం.. శుభప్రదం కార్తీక మాసంలో ఉసిరికాయలు దానం చేయడం ద్వారా సంతానం లేని స్త్రీలకు సంతానం కలుగుతుంది. శివపూజ చేయడం వల్ల నవగ్రహ దోష నివారణ జరుగుతుంది. గుమ్మడి కాయ దానం చేయడం వల్ల యమదూతలు దూరంగా ఉంటారు. ఆవు నెయ్యితో వత్తులు వెలిగించి, ఆకుడొప్పల్లో ఉంచి, నీటి ప్రవాహంలో వదలడం, కుమార్తెలకు వివాహాలు, కుటుంబ సభ్యులతో వనభోజనాలు, ఉసిరి, తులసి చెట్లకు పూజలు, విష్ణుమూర్తి కల్యాణం, నాగుపాములకు పూజలు, శ్రీ సుబ్రహ్మణ్యస్వామికి పూజలు, దీపారాధన చేయడం మహా మహిమోపితమైనది. ఇంటి ఎదుట ముగ్గులు పెట్టి, తులసి చెట్టు వద్ద దీపం వెలిగించి గౌరీ పూజలు చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందుల నుంచి విముక్తి కలుగుతుంది. ధాత్రి అంటే ఉసిరి. ఇది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది. కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద భోజనం చేయడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది. లక్ష బిల్వార్చనలు, అభిషేకాలు, కాగడ హారతులు, కార్తీక స్నానాలు, మారేడు పత్రాలతో ఈశ్వరుడిని ఆరా ధిస్తే శుభాలు కలుగుతాయని వేదపండితులు చెబుతున్నారు. దీపం.. మోక్ష మార్గం దీపంలో ప్రమిద, వత్తి, నూనె, అగ్ని, వెలుగు.. వీటిలో దేనికదే ప్రత్యేకం. ప్రమిద మనసుకు, వత్తి దైవ స్మరణకై ఆసక్తి, నూనె జ్ఞానానికి, అగ్ని అజ్ఞానాన్ని తొలగించే నిప్పురవ్వకు, వెలుగు మనుషుల్లోని చెడు స్వభావాలను తొలగించి, మోక్ష మార్గానికి ప్రతీకలుగా నిలుస్తాయి. అందుకే కార్తీక పౌర్ణమి రోజు ముఖ్యంగా మహిళలు దేవాలయాల్లో దీపాలను సమర్పిస్తారు. శ్రవణం, కీర్తనం, స్మరణం, అర్చనం, దాస్యం, వందనం, పాద సేవనం, సఖ్యం, ఆత్మ నివేదనం అనే తొమ్మిది భావనలతో పూజలు చేస్తారు. విష్ణు కథాశ్రవణంతో పరీక్షిత్తుడు, కీర్తనతో వ్యాసుని కుమారుడు శుఖుడు, నారదుడు, స్మరణతో ప్రహ్లాదుడు, అర్చనతో పథు చక్రవర్తి, దాస్యంతో హనుమంతుడు, గరుత్మంతుడు, వందనంతో అక్రూరుడు, పాదసేవతో లక్ష్మి, భార్గవి, సఖ్యంతో అర్జునుడు, ఆత్మనివేదనంతో బలి చక్రవర్తి పుణ్యలోకాలను చేరుకున్నారని వేద శాస్త్రాలు ప్రవచిస్తున్నాయి. ఈ కారణంగానే తొమ్మిది రకాల భక్తి భావనలతో పౌర్ణమి రోజు దీప ప్రదానంతో పుణ్యలోకాలను అందుకునేందుకు ప్రయత్నిస్తారు. మని షి పతనానికి హేతువులైన అరిష«ఢ్వర్గాలను జయించేందుకు గోధుమ పిండితో ఆరు దీపపు ప్రమిదలను చేసి, నెయ్యితో వెలిగిస్తారు. సకల శాంతి, సౌభాగ్యాల కోసం ధాత్రి నారాయణ, తులసీ కల్యాణం జరుపుతారు. కార్తీక మాసోత్సవం.. కీసర: ప్రఖ్యాత శైవ క్షేత్రమైన కీసరగుట్టలో సోమవారం నుంచి వచ్చేనెల 14వ తేదీ వరకు కార్తీక మాసోత్సవాలు నిర్వహించనున్నారు. దాదాపు నెల రోజుల పాటు కీసరగుట్టలో కొనసాగనున్న ప్రత్యేక పూజా కార్యక్రమాలకు నగర నలుమూలల నుంచి కీసరగుట్ట శ్రీభవానీరామలింగేశ్వర స్వామి దర్శనార్థం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ చైర్మన్ తటాకం శ్రీనివాస్‌శర్మ, ఈఓ సుధాకర్‌రెడ్డి తెలిపారు. మొదటిరోజు సోమవారం ఆలయంలో మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, ఆకాశదీపోత్సవంతో పూజలు ప్రారంభం కానున్నట్లు తెలిపారు. కోవిడ్ నేపథ్యంలో దేవాదాయశాఖ ఆదేశానుసారం గుట్టలో ఏర్పాట్లు చేపడుతున్నట్లు తెలిపారు. కోవిడ్ నేపథ్యంలో గర్భాలయ అభిషేకాలు, సత్యనారాయణ స్వామి వత్రాలు, అన్నదానం తదితర వాటిని రద్దు చేశామని వారు వివరించారు. మాస్కులు, శానిటైజర్లు, భౌతికదూరం పాటిస్తూ స్వామివారిని దర్శించుకోవాలన్నారు. -
మహాశివరాత్రి జాతర: ఎములాడ జాతరకెళ్దాం..
సాక్షి, వేములవాడ: తెలంగాణ జిల్లాల్లోనే పేదల దేవుడిగా..దక్షిణకాశీగా ఎముడాల రాజన్న ఆలయం వెలుగొందుతోంది. రాజన్న సన్నిధానంలో ఈ నెల 20 నుంచి మహాశివరాత్రి జాతర మహోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఈ ఉత్సవాలకు రాష్ట్ర నలుమూలల నుంచేకాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా మూడు లక్షల మంది భక్తులు వస్తారని జిల్లా అధికారులు అంచనా వేస్తున్నారు. రాజన్న జాతర ఉత్సవాలను రూ. 2.50 కోట్లతో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. రాజన్న గుడి చెరువు ఖాళీ స్థలంలో శివార్చన అనే ప్రత్యేక సాంస్క ృతిక కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఆలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. వేములవాడకు చేరుకునే ఐదు ప్రధాన రహదారుల్లో భక్తులకు స్వాగతం పలికేందుకు భారీ స్వాగతతోరణాలు ఏర్పాటు చేశారు. స్థల పురాణవిుదీ.. ఈ క్షేత్రంలో స్వామి వారి లింగరూపుడై గర్భగుడిలో భక్తులకు దర్శనమిస్తాడు. రాజన్న గుడికి సంబంధించిన అనేక పురాతన గాథలున్నాయి. పూర్వం నారద మహాముని భూలోకంలో సంచరిస్తూ పాపాలతో బాధపడుతున్న జనాన్ని చూసి వారికి విముక్తి కలిగించేందుకు పరమశివుడిని వేడుకోగా స్వామి కాశీలో శివుడు ఉద్భవించినట్లు చెబుతుంటారు. అక్కడ శివుడు సంతప్తి చెందక వేములవాడకు చేరుకున్నాడని, శివుడి వెంట భాస్కరుడు వచ్చాడని ప్రతీతి. అందుకే ఈ క్షేత్రాన్ని భాస్కర క్షేత్రంగానూ.. హరిహరక్షేత్రంగా పిలుస్తారు. చారిత్రక విశిష్టత... క్రీ.శ.750 నుంచి 973 వరకు చాళుక్యరాజులు వేములవాడను రాజధానిగా చేసుకుని పరిపాలన గావించారని చారిత్రక ఆధారాలుండగా, వీరికి పూర్వమే శాతవాహనులు పరిపాలించినట్లు ఆధారాలున్నట్లు చెబుతుంటారు. శాతవాహనుల కాలం నాటికే వేములవాడలో జైనులు, బౌద్ధుల ఆచార వ్యవహారాలు తెలిపే విగ్రహాలు అనేకం నేటికి ఉన్నాయి. రాజన్న చెంతకు చేరుకోవడం ఇలా... రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు 160 కిలోమీటర్లు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేంద్రానికి 32 కిలోమీటర్లు . రాజన్నను దర్శించుకోవాలంటే రోడ్డు మార్గం ఒక్కటే. హైదరాబాద్ నుంచి ప్రతీ అరగంటకో బస్సు, కరీంనగర్ నుంచి ప్రతీ పది నిమిషాలకో బస్సు సౌకర్యం ఉంది. రైల్వే సౌకర్యం లేదు. పెద్దపల్లి, వరంగల్, కామారెడ్డికి రైల్వే మార్గంలో వచ్చి అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా వేములవాడకు చేరుకోవచ్చు. హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్లు సిద్దిపేట ద్వారా, వరంగల్ నుంచి వచ్చే వారు కరీంనగర్ మీదుగా వేములవాడకు చేరుకునే రోడ్డు మార్గం ఉంది. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా గుడి చెరువు కట్టకింద ప్రత్యేక బస్టాండ్ ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యార్థం కౌంటర్లు ఏర్పాటు చేసి ఆయా ప్రాంతాలకు టికెట్లు అందుబాటులో ఉంచుతున్నారు. దాదాపు 600 బస్సులను ఆర్టీసీ అధికారులు అందుబాటులో ఉంచుతున్నారు. టూరిజం ద్వారా బస్సులు ఏర్పాటు చేశారు. వేములవాడ గుడి చేరుకునేందుకు వీలుగా ఉచిత మినీబస్సులు ఏర్పాటు చేశారు. కోడె మొక్కు విశిష్టత.. మత సామరస్యానికిది ప్రతీక సంతానం లేని దంపతులు ఈ ఆలయంలో కొడుకు పుడితే కోడె కట్టేస్తా రాజన్నా అంటూ మొక్కుకుంటారు. సంతానం కల్గిన అనంతరం వేములవాడకు చేరుకుని స్వామి వారికి కోడె మొక్కు చెల్లించుకుంటారు. వ్యవసాయం బాగుండాలని మొక్కుకునే రైతుల సంఖ్య అధికంగానే ఉంటుంది. తమ పాడిపంటలు బాగుండాలని మొక్కుకున్న రైతులు తమ ఇంటివద్ద పెంచి పెద్దచేసిన కోడెలను (నిజకోడె) స్వామి వారికి అప్పగించి మొక్కులు తీర్చుకుంటారు. కోడెలను కట్టేసే ఆచారం ఇక్కడ ప్రత్యేకత. ఆలయంలోని గర్భగుడి సమీపంలో మతసామరస్యానికి ప్రతీకగా దర్గా ఉంది. స్వామి వారిని దర్శించుకున్న భక్తులు దర్గాలోని ఖాజాబఖశ్వార్ను దర్శించుకుంటారు. ధర్మగుండం స్నానాలు... తలనీలాల మొక్కులు మొట్టమొదట ఈ ధర్మగుండం మడుగుగా ఉండేది. నరేంద్రమహారాజు కుషు్టవ్యాధితో బాధపడుతూ ఈ క్షేత్రాన్ని సందర్శించి ధర్మగుండంలో స్నానమాచరించడంతో కుష్టువ్యాధి నయమైనట్లు స్థలపురాణం కథనం. అందుకే దీర్ఘకాలిక చర్మ వ్యాధులతో బాధపడే వారు ధర్మగుండంలో స్నానాలు చేస్తే వ్యాధి నుంచి విముక్తి లభిస్తుందని భక్తుల విశ్వాసం. ధర్మగుండంలో ఉచితంగా స్నానం చేయొచ్చు. అనంతరం కల్యాణకట్టలో రూ.10 చెల్లించి టికెట్ తీసుకుని తలనీలాలు సమర్పించుకుంటుంటారు. రాజన్న మొక్కులు చెల్లించుకున్న భక్తులు బద్దిపోచమ్మకు బోనాలు సమర్పించుకుంటారు. పూజలు– దర్శనీయ స్థలాలు రాజన్న జాతర సందర్భంగా ఆర్జిత సేవలన్నీ రద్దు చేసి కేవలం స్వామి వారి దర్శనాలు, కోడె మొక్కులు మాత్రమే అనుమతిస్తారు. రాజన్న ఆలయంతోపాటు వేములవాడ పరిసరాల్లో అనుబంధంగా అనంతకోటి పద్మనాభస్వామి, భీమేశ్వరాలయం, బద్దిపోచమ్మ, నగరేశ్వరాలయం, కేదారీశ్వర, వేణుగోపాల స్వామి, నాంపల్లి లక్ష్మీ నరసింహస్వామి, అగ్రహారం జోడాంజనేయ స్వామి దేవాలయాలున్నాయి. రాజన్నను దర్శించుకున్న భక్తులు ఈ ఆలయాల్లోనూ పూజలు చేస్తారు. వసతి గదులు... ప్రసాదాలు స్వామి వారి సన్నిధికి చేరుకున్న భక్తులు ముందుగా ఆలయ విచారణ కార్యాలయానికి చేరుకుని అద్దె గదులు తీసుకుంటారు. స్వామి వారి గదులు లభించని భక్తులు ప్రైవేటు లాడీ్జలను ఆశ్రయిస్తారు. భక్తుల కోసం 476 వసతి గదులున్నాయి. అయితే జాతర సందర్భంగా ఈ గదులను అద్దెకు ఇవ్వకుండా జాతర ఏర్పాట్ల కోసం వచ్చిన అతిథులకు కేటాయిస్తారు. దీంతో భక్తులు ప్రైవేట్ లాడ్జ్‌లు లేదా ఆలయం వారు వేసిన చలవపందిళ్ల కిందే వంటావార్పు చేసుకుని మొక్కులు చెల్లించుకుంటారు. ప్రైవేట్ లాడ్జ్‌ల నిర్వాహకులు రద్దీని బట్టి గదుల రేట్లను పెంచేస్తారు. ఒక్కో గదికి రూ.500 నుంచి మొదలుకుని రూ.1500 వరకు వసూలు చేస్తుంటారు. రాజన్నను దర్శించుకున్న భక్తులకు ప్రసాదాలు అందించేందుకు ధర్మగుండం పక్కనే ఉన్న ప్రసాదాల కౌంటర్, పాతఆం«ధ్రాబ్యాంకు భవనంలో ప్రసాదాల కౌంటర్ ఏర్పాటు చేశారు. లడ్డూ రూ.15, పులిహోరా పాకెట్ రూ.10 చొప్పున భక్తులకు అందిస్తారు. రాజన్న జాతర పూజలు... మహాజాతర సందర్భంగా ఆలయంలో మూడు రోజులపాటు ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించారు. ఈ నెల 20 నుంచి ప్రారంభమయ్యే జాతర ఉత్సవాల సందర్భంగా నిరంతర దర్శనాలు అందుబాటులో ఉంటాయి. ఇందుకు ఫ్రీగా ధర్మదర్శనం, రూ.50 చెల్లించి స్పెషల్ దర్శనాలు, రూ.100 చెల్లించి కోడె మొక్కులు, రూ.200 స్పెషల్ కోడె మొక్కులు, రూ.100 శీఘ్రదర్శనం టికెట్లు తీసుకుని దర్శించుకోవచ్చు. ఈ నెల 20న రాత్రి 9.30 గంటలకు నిషిపూజ అనంతరం సర్వదర్శనం కొనసాగుతుంది. రాత్రి 12 గంటల నుంచి 3 గంటల వరకు స్థానికుల దర్శనాలు (ఈ సమయంలో భక్తుల దర్శనాలు నిలిపివేస్తారు), 3.30 గంటల వరకు కౌన్సిలర్లు, ప్రజాప్రతిని«ధులకు, 21న ఉదయం 7 గంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం పక్షాన అక్కడి అర్చకుల ప్రత్యేక బృందం, 8 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ప్రభుత్వ ప్రతినిధి స్వామి వారికి రాష్ట్ర మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్, ఇంద్రకరణ్‌రెడ్డి పట్టువస్త్రాలు అందిస్తారు. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు అద్దాల మంటపంలో మహాలింగార్చన, రాత్రి 11.35 గంటల నుంచి వేకువజామున 3.30 గంటల వరకు లింగోద్భవ సమయంలో స్వామి వారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం పూజలు (ఈ సమయంలో భక్తుల దర్శనాలకు అనుమతిస్తారు) నిర్వహిస్తారు. రాజన్న భక్తులకు 3 లక్షల లడ్డూలు వేములవాడ : ఎములాడ రాజన్న భక్తులకు మూడు లక్షల లడ్డూలు సిద్ధమవుతున్నాయి. జాతరకు వచ్చే భక్తులకు లడ్డూ ప్రసాదం అందించేందుకు ఆలయ ప్రసాదాల గోదాం ఇన్చార్జీలు రెండు రోజులుగా పనుల్లో వేగం పెంచారు. అదనపు కార్మికులతో పెద్దఎత్తున లడ్డూ ప్రసాదం తయారు చేయిస్తున్నారు. ఇప్పటికే 2 లక్షల లడ్డూ ప్రసాదం సిద్ధంగా ఉంది. 20, 21, 22వ తేదీల్లోనూ భక్తులు వచ్చే రద్దీని బట్టి మరో లక్షలడ్డూల వరకు తయారు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. దేవాదాయశాఖ లడ్డూ తయారీలో ప్రత్యేక శ్రద్ధచూపుతోంది. ఓపెన్‌స్లాబ్‌లో ప్రసాదాల విక్రయాల కౌంటర్లు అందుబాటులో ఉంచుతున్నారు. గోదాం ఇన్చార్జి వరి నర్సయ్య మాట్లాడుతూ జాతరకు వచ్చే భక్తులకు 3 లక్షల లడ్డూలు సిద్ధంగా ఉంచాలని ఈవో ఆదేశించారని తెలిపారు. ఉచిత భోజనం.. తాగునీటి సౌకర్యం జాతర సందర్భంగా మూడురోజులపాటు స్థానిక వైశ్యసత్రం ఆధ్వర్యంలో లక్ష్మీగణపతి కాంప్లెక్సులో ఉచితంగా భోజన సౌకర్యం, పార్వతీపురంలో స్వామి వారి అన్నదానంలో ఉచిత భోజన వసతి కలదు. భక్తుల దాహార్తి తీర్చేందుకు 4 లక్షల నీటి పాకెట్లను అందుబాటులో ఉంచుతున్నారు. వీటిని క్యూలైన్లలోని భక్తులకు అందిస్తారు. వీటితోపాటు ప్యూరిఫైడ్ వాటర్‌ను కూడా భక్తులకు అందిస్తారు. అత్యవసర సేవలు జాతర పర్వదినాల సందర్భంగా ఆలయం ఎదుట పోలీస్ కంట్రోల్‌రూమ్ ఏర్పాటు చేశారు. ఇందుకు టోల్‌ఫ్రీ నంబర్ 18004252037 ఇచ్చేశారు. ఇవే కాకుండా నిరంతరం పోలీసు గస్తీ బృందాలను ఎస్పీ రాహుల్‌హెగ్డే అందుబాటులో ఉంచారు. ఆలయం ముందున్న అమ్మవారి కాంప్లెక్స్‌లో తాత్కాలిక వైద్యశాల ఏర్పాటు చేశారు. జిల్లా వైద్యాధికారి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో నిరంతరం వైద్యసేవలు అందుబాటులో ఉంచారు. పార్కింగ్ స్థలాలు, వసతి గదుల వద్ద కూడా నిరంతరం వైద్యసేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. వీటిన్నింటిని పర్యవేక్షించేందుకు ఒక స్పెషల్ ఆఫీసర్‌తోపాటు 13 మంది నోటల్ ఆఫీసర్లను కలెక్టర్ కృష్ణభాస్కర్ నియమించారు. వీటితోపాటుగా అంబులెన్స్, ఫైర్సేవలు కూడా అందుబాటులోకి తెచ్చారు. భక్తులకు ఇబ్బందులు రానివ్వం రాజన్న జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రానివ్వం. ఇప్పటికే జిల్లా అధికార యంత్రాంగం, ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. వివిధశాఖల అధికారుల సమన్వయంతో జాతర ఉత్సవాలు విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నాం. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికార యంత్రాంగం ఎల్లవేళలా అప్రమత్తంగా ఉంటున్నాం. – కృష్ణవేణి, ఆలయ ఈవో రాయదండి శ్రీరామేశ్వరుడు రామగుండం:అంతర్గాం మండల పరిధిలోని రాయదండి గ్రామంలో స్వయంభూగా వెలిసిన శ్రీచిలుకల రామేశ్వరాలయం శివరాత్రి వేడుకలకు ముస్తాబైంది. రెండురోజులపాటు జరిగే వేడుకలకు ఆలయ కమిటీ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. రాయదండి ఆలయానికి ఎనిమిది శతాబ్దాల చరిత్ర క్రీస్తు పూర్వం ఎనిమిది శతాబ్దాల క్రితం ఇక్కడ చాళక్యులు, చోళరాజులు పాలించినటువంటి ప్రాంతంగా పూర్వీకులు చెబుతారు. ఇక్కడ రాజులు దండిగా ఉండేవారు కావడంతో రాజులదండి పేర్కొంటుండగా కాలక్రమేణా దీనికి రాయదండిగా పేరు వచ్చింది. చిలుకల రామేశ్వరాలయం గర్భగుడిలో అమ్మవారి ముక్కు పుడక, కాళ్లకు గజ్జెలు ధరించిన విగ్రహ రూపం, గణపతి, నలుదిక్కుల నాలుగు నందీశ్వరుడి ఉత్సవ విగ్రహాలు వీటితోపాటు శ్రీలక్షి్మనర్సింహాస్వామి, సుబ్రహ్మణేశ్వరస్వామి, నాలుగు దిశలలో ఆంజనేయస్వామి విగ్రహాలుండేవి. వల్లుబండ, సనాతన ఆలయంలో ప్రతీరోజు రాజుల అన్నదానంతో ప్రాంతమంతా పూర్తి ఆధ్యాత్మికత వాతావరణంలో ఉన్నట్లు చరిత్రలో ఉంది. తొంభై రకాల ఆంజనేయస్వామి రూపాలు ఉండేవి. ప్రస్తుతం ఆలయానికి దక్షిణంలో దాసాంజనేయస్వామి విగ్రహం మాత్రమే మిగిలి ఉన్నట్లు పేర్కొన్నారు. కల్యాణ మహోత్సవ వేడుకల షెడ్యూలు భక్తులు సంప్రదాయ వస్త్రాలు ధరించాలనే నిబంధన అమలు చేస్తున్నారు. ఈ నెల 21వ తేదీన శుక్రవారం ఉదయం వేకువజామున సుప్రభాతసేవ, సామూహిక రుద్రాభిషేకం నిత్యారాదణ, తొమ్మిది గంటలకు గణపతి పుణ్యహవచనం, ప్రదోషకాలపూజ ఉత్సవ విగ్రహాలకు అభిషేకాలు, స్వామివారికి వస్త్రాలు సమర్పణ, రాత్రి 8.05 గంటలకు స్వామి కల్యాణ మహోత్సవం, అనంతరం మహా మంగళహారతి, మంత్రపుష్పం తీర్థవితరణ, అర్ధరాత్రి 12లకు లింగోద్భావ కాలములో ఉపన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, తదనంతరం జాగరణ, భజన కార్యక్రమంతో ముగింపు. మరుసటి రోజు (శనివారం)లింగోద్భావ కాలంలో స్వామివారి నాగవెళ్లి, పల్లకీసేవ, అన్నదానంతో ముగింపు. తొంబర్రావుపేట పాలరాతి శివుడు మేడిపెల్లి(వేములవాడ): సాధారణంగా అన్ని శివాలయాల్లో శివుడు లింగాకారంలో దర్శనం ఇస్తే ఇక్కడ మాత్రం శివుడి నిజరూపదర్శనం భాగ్యం లభించడం ఇక్కడి ప్రత్యేకత. ఆసియాలోనే అతిపెద్ద పాలరాతి శివుడి విగ్రహంగా ప్రసిద్ధిచెందింది. అదే మేడిపెల్లి మండలంలోని తొంబర్రావుపేట శివాలయంలోని శివుడి విగ్రహం. ఐదు ఫీట్ల ఎత్తుతో ఏకశిల పాలరాతితో ద్యానముద్రలో ఉన్న శివుడి విగ్రహాన్ని ఇక్కడ నెలకొల్పారు. ఇక్కడికి చుట్టు పక్కల గ్రామాల ప్రజలే కాకుండా ఇతర మండలాలు, జిల్లాల ప్రజలు, భక్తులు వచ్చి శివుడిని దర్శించుకుంటారు. లక్షి్మసత్యనారాయణస్వామి విగ్రహాలు కూడా పాలరాతివే ప్రతిష్టించారు. రామలక్ష్మణులు, సీతా, హన్మంతుడి విగ్రహాలు కూడా ఇక్కడ నెలకొల్పారు. 45 ఏళ్లకిందట మామూలు గుడిగా.. గ్రామానికి చెందిన అడ్లగట్ట గంగారాం ముంబాయిలో పని చేసుకుంటుంటుండేవాడు. ఈ నేపథ్యంలో 1965లో ఆయనకు శివుడి విగ్రహం ఏర్పాటు చేయాలనే ఆలోచన వచ్చి అMý్కడే పూనేలోని పాలరాతి విగ్రహాలు తయారు చేసే ప్రదేశానికి వెళ్లాడు. అక్కడ పాలరాతి శివుడి విగ్రహాన్ని చూసిన గంగారాం ఆ విగ్రహాన్ని తమ గ్రామంలో ఏర్పాటు చేయాలని కొనుగోలు చేశాడు. ఇక్కడికి తీసుకొచ్చి సొంతఖర్చులతో చిన్నగుడి కట్టి అందులో ప్రతిష్టించాడు. ఆలయానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి శివుడి విగ్రహంతోపాటు సత్యనారాయణస్వామి, రాముడు,సీతా, లక్ష్మణుడు, హన్మంతుడు వంటి విగ్రహాలు ఏర్పాటు చేసి ఆలయాన్ని విస్తృతపరిచారు. నవగ్రహ మంటపాన్ని కూడా ఏర్పాటు చేశారు. శివరాత్రికి ఏర్పాట్లు పూర్తి.. మహాశివరాత్రిని పురస్కరించుకొని ఈ నెల 20 నుంచి 23 వరకు నాలుగురోజులపాటు ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి. 20న స్వస్తిపుణ్యహవచనం, స్థాపిత దేవతలపూజ, అభిషేకాలు, 21న స్వామివారి కల్యాణం, జాగారణ, లింగోధ్బావ, 22న రథోత్సవం, అన్నదానం, 23న బద్దిపోచమ్మకు బోనాలు ఉంటాయి. టెంపుల్ టౌన్ మంథని మంథని: ప్రాచీనచరిత్రకు నిలువుటద్దంగా నిలిచిన మంత్రపురి వేదాలకు పుట్టినిల్లుగా చెప్పవచ్చు. వేయి సంవత్సరాలకుపైగా మహోన్నత చరిత్ర కలిగిన మంథని దేవాలయాలకు నిలయమై టెంపుల్‌టౌన్‌గా ప్రసిద్ధికెక్కింది. దేశంలో ఎక్కడా లేని విధంగా వినాయకుడి గుడి, దక్షిణ భారతదేశంలో ఏకైక పశ్చిమ ముఖ శివలింగం మంథనిలోనే దర్శనమిస్తాయి. మంథనిలో అన్ని దేవతలకు సంబంధించిన దేవాలయాలు పురాణకాలంలోనే నిర్మించారు. మహా శివరాత్రి పర్వదినాన శివాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఓంకారేశ్వరుడు, శ్రీలేశ్వర సిద్దేశ్వర దేవాలయం,పశి్చమ ముఖం గల శివలింగం ఉన్నాయి. ప్రాచీన చరిత్ర కలిగిన మంథనిలో ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు. సమాచార ఫోన్ నెంబర్లు ఇవీ.. జాతర ఉత్సవాల చైర్మన్, జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్– 7093364111 జిల్లా ఎస్పీ రాహుల్‌హెగ్డే – 8332831100 డీఎస్పీ చంద్రకాంత్‡– 8500149182 కార్యనిర్వాహణ అధికారి కృష్ణవేణి – 9491000743 ఏఈవోలు, ఉమారాణి– 9247307754 స్థానిక వైద్యాధికారి మహేశ్‌రావు– 9440078901 డీఎం ఆర్టీసీ భూపతిరెడ్డి – 9959225926 టౌన్ సీఐ సీహెచ్ శ్రీధర్– 9440795165 రాజన్న జాతర టోల్‌ఫ్రీ నంబర్. 18004252037 -
రాజన్నకు కేసీఆర్ కుటుంబం ప్రత్యేక పూజలు
-
రాజన్నను దర్శించుకున్న కేసీఆర్ కుటుంబం
సాక్షి, వేములవాడ: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సోమవారం కుటుంబ సమేతంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆలయంలో రాజన్నకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకు ముందు ముఖ్యమంత్రికి ఆలయ పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం సీఎం కేసీఆర్‌కు తీర్థ ప్రసాదాలు అందచేశారు. మధ్యాహ్నం 1 గంటకు కరీంనగర్ సమీపంలోని తీగలగుట్టపల్లి ఉత్తర తెలంగాణ భవన్‌కు చేరుకుంటారు. అక్కడే మధ్యాహ్న భోజనం చేసి మూడు గంటలకు హైదరాబాద్ బయల్దేరతారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు ఈటెల రాజేందర్, కొప్పుల ఈశ్వర్, ఇంద్రకరణ్‌రెడ్డి, గంగుల కమలాకర్ ఉన్నారు. గోదావరికి జల హారతి అంతకు ముందు ఆయన సిరిసిల్ల బ్రిడ్జ్ దగ్గర కాళేశ్వరం జలాలకు పూజలు చేశారు. తంగళ్లపల్లి వంతెనపై మానేరు నదికి కేసీఆర్ జలహారతి ఇచ్చారు. అలాగే మిడ్ మానేరు బ్యాక్ వాటర్‌ను ఆయన పరిశీలించారు. కాగా రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ముఖ్యమంత్రి అధికారికంగా ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. అయితే పార్టీ నాయకులు మాత్రం సీఎం కేసీఆర్‌కు ఘనంగా స్వాగతం పలికారు. -
సూర్యగ్రహణంతో ఆలయాలన్నీ మూసివేత..
సాక్షి, హైదరాబాద్ : డిసెంబర్ 26న సంపూర్ణ సూర్యగ్రహణం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలన్ని మూసివేయనున్నారు. అనంతరం మరుసటి రోజు భక్తుల దర్శనం కోసం ఆలయ తలుపులు తెరవనున్నారు. తిరుమల : రేపు సూర్యగ్రహణం సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని టీటీడీ అధికారుల మూసివేయనున్నారు. దాదాపు 13 గంటల పాటుగా తలుపులు మూసివేయనున్నారు. ఈ రోజు రాత్రి 11 గంటలకు శాస్త్రోక్తంగా మూత పడి.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఆలయ తలుపులు తెరుస్తారు. ఆలయ శుద్ది అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు సర్వ దర్శనం భక్తులను స్వామి వారి దర్శనం కోసం అనుమతిస్తారు.. రేపు ఉదయం విఐపి బ్రేక్ దర్శనాలు,(ప్రోటోకాల్ దర్శనాలు) టీటీడీ పూర్తిగా రద్దు చేసింది. సూర్యగ్రహణం సందర్భంగా రేపు తిరుప్పావడ, కళ్యాణోత్సవం,ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం ఆర్జిత సేవలను రద్దు చేశారు. శ్రీకాకుళం : మంగళవారం రాత్రి పూజల అనంతరం అరసవల్లి సూర్యదేవాలయాన్ని మూయనున్నారు. తిరిగి రేపు సాయంత్రం 4 గంటలకు సంప్రోక్షణ అనంతరం ఆలయ ద్వారాలు తెరుస్తారు. రాజన్న సిరిసిల్ల : గురువారం సూర్యగ్రహణం సందర్భంగా ఈ రోజు రాత్రి 8.11 గంటలకు వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని మూయనున్నారు. సంప్రోక్షణ అనంతరం రేపు ఉదయం 11.20 నిమిషాలకు ఆలయం భక్తుల దర్శనార్థం తెరుస్తారు. నిర్మల్ : ఈనెల 26న సంపూర్ణ సూర్య గ్రహణం సందర్భంగా 25వ తేదీ సాయంత్రం 6 గంటల 15 నిమిషాల నుంచి 26వ తేదీ ఉదయం 11 గంటల 30 నిమిషాల వరకు బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయం ద్వారాలను అర్చకులుమూసివేయనున్నారు. తిరిగి 26వ తేదీ ఉదయం పదకొండున్నర గంటలకు ఆలయం శుద్ధి, సంప్రోక్షణ , సరస్వతి అమ్మవారి కి అభిషేకం ప్రత్యేక పూజల అనంతరం భక్తులకు సర్వదర్శనం సేవలను కల్పించనున్నట్టు ఆలయ అధికారులు. ఒక ప్రకటనలో తెలిపారు. కర్నూలు : సూర్యగ్రహణం కారణంగా శ్రీశైలం శ్రీభ్రమరాంబామల్లికార్జున స్వామివార్ల దేవాలయాలు ఈ రోజు రాత్రి 10 గంటల నుంచి రేపు ఉదయం 11.30 గంటల వరకు వరకు ఆలయ ధ్వారాలు మూసివేయనున్నారు. రేపు మధ్యాహ్నం 1 గంట తరువాత ఆలయ శుద్ధి అనంతరం భక్తులకు దర్శనం కల్పించనున్నారు. నెల్లూరు : రాపూరు మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోనలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి సేవలో విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి శ్రీశ్రీశ్రీ స్వాత్మనందేంద్ర సరస్వతి స్వామి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, భక్తులు పాల్గొన్నారు. -
శివనామస్మరణతో మారుమోగుతున్న శైవక్షేత్రాలు
సాక్షి, హైదరాబాద్/అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి పర్వదినం వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సోమవారం తెల్లవారుజాము నుంచే శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శివునికి అత్యంత ప్రీతికరమైన సోమవారం నాడే మహాశివరాత్రి పర్వదినం కూడా రావడంతో మహాశివుని దర్శనానికి భక్తులు బారులు తీరారు. శైవక్షేత్రాలన్ని శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. శ్రీశైలం: ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలం భక్తజనంతో కిటకిటలాడుతోంది. పాతాళగంగలో పుణ్యస్నానాలాచరించడానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం రాత్రే నాలుగు లక్షల మందికి పైగా భక్తులు శ్రీశైలం చేరుకున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా మల్లన్న సర్వదర్శనానికి మాత్రమే అనుమతిస్తున్నారు. వేములవాడ: తెలంగాణలోని వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూ లైన్లలో బారులు తీరారు. ప్రభుత్వం తరఫున రాజరాజేశ్వర స్వామి వారికి మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు. టీటీడీ ఆధ్వర్యంలో స్వామివారికి టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు, ప్రధాన అర్చకులు డాలర్ శేషాద్రి పట్టువస్త్రాలు సమర్పించారు. విజయవాడ: మహాశివరాత్రి సందర్భంగా భక్తుల పుణ్యస్నానాలతో దుర్గాఘాట్, భవానీ ఘాట్, పున్నమీ ఘాట్లు కిటకిటలాడుతున్నాయి. విజయవాడలోని పాత శివాలయం, యలనమకుదురు రామలింగేశ్వర స్వామి ఆలయం, దుర్గగుడిలోని మల్లేశ్వరస్వామి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. శివాలయాల్లో తెల్లవారుజాము నుంచే ప్రత్యేక అభిషేకాలు కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని పంచారామ క్షేత్రాలైన అమరావతి, సామర్లకోట, ద్రాక్షారామం, పాలకొల్లు, భీమవరంలోని పరమశివుడి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి దేవదేవుడిని దర్శించుకుంటున్నారు. అర్చనలు, రుద్రాభిషేకాలు, ప్రత్యేకపూజలు నిర్వహిస్తున్నారు. తెలంగాణలోని కీసర రామలింగేశ్వర స్వామి ఆలయం, కాళేశ్వరం, నల్గొండ జిల్లాలోని చెర్వుగట్టు, పానగల్ ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. -
రాజన్న నిత్యాన్నదాన సత్రంలో మంటలు
వేములవాడ: వేములవాడ రాజన్న ని త్యాన్నదాన సత్రం లో బుధవారం ఉద యం బాయిలర్ ము ట్టించే క్రమంలో మంటలు చెలరేగా యి. వెంటనే తేరుకు న్న సిబ్బంది మంటలు ఆర్పేశారు. దీం తో ఎర్రం మల్లేశం అనే వ్యక్తి తలవెం ట్రుకలు కాలిపోయాయి. స్వల్పగాయాలతో బయటపడటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. విషయం తెలుసుకున్న ఏఈవో దేవేందర్, ఎస్పీఎఫ్ హెడ్‌కానిస్టేబుల్ లచ్చన్న, ఎస్బీ పోలీసులు, సత్రానికి చేరుకుని విచారణ చేపట్టారు. జాగ్రత్తలు పాటించాలనీ, నిబంధనల మేరకు సిబ్బందిని అనుమతించాలని ఏఈవో సత్రం ఇన్చార్జీలను ఆదేశించారు. టౌన్ సీఐ ఎన్. వెంకటస్వామి ఘటనపై ఆరా తీశారు. అధికారుల సీరియస్.. రాజన్న ఆలయంలోని పలు విభాగాల్లో ప్రైవేట్ వ్యక్తుల ప్రమేయం రోజురోజుకు పెరిగిపోతుండటంతో ఆలయ ఈవో రా జేశ్వర్ సీరియస్‌గా వ్యవహరించినట్లు తెలిసింది. మంటలు చెలరేగిన సమయంలో గాయపడిన మల్లేశంకు ఆలయానికి ఎలాంటి సంబంధం లేదని.. ప్రైవేట్ వ్యక్తులను ఎందుకు అనుమతి స్తున్నారని సిబ్బందిని మందలించారు. కాగా సత్రం ఇన్చార్జి రాములుకు మ ల్లేశం సమీప బంధువు కావడంతో అ ప్పుడప్పుడు తనకు సాయంగా ఉంటా డని రాములు పేర్కొనడం గమనార్హం. -
తీరు మారలేదు..?
వేములవాడ : వేములవాడ రాజన్న ఆలయ ఉద్యోగుల పనితీరు ఇంకా మారనేలేదు. సరిగ్గా నెలరోజుల క్రితం వివిధ విభాగాల్లో విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. ఆ తర్వాత ఆలయ పర్యవేక్షకుడు రాజేందర్ నివాసాలపై ఏసీబీ అధికారులు మూకుమ్మడి దాడులు చేశారు. అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారనే ఫిర్యాదుల మేరకు సోదాలు చేసిన నిఘా విభాగం.. రాజన్న ఆలయ అధికారులు, ఇన్చార్జీల నుంచి వివరాలు రాబట్టేందుకు ఇంకా విచారిస్తూనే ఉన్నారు. అయినా, కొందరు ఉద్యోగులు దాందా సాగించడం విస్మయానికి గురిచేస్తోంది. శుక్రవారం రాజన్న సన్నిధిలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. దీనిని ఆసరా చేసుకున్న స్పెషల్ కోడెల టికెట్ కౌంటర్లోని సిబ్బంది.. కోడెల టికెట్లపై లడ్డూ ప్రసాదం ఇవ్వకుండా నొక్కేశారు. కేవలం టికెట్లు మాత్రమే భక్తుల చేతికి ఇచ్చి దందా సాగించారు. రూ.200 విలువైన టికెట్ తీసుకున్న భక్తులకు ఉచితంగా లడ్డూ ప్రసాదం ఇవ్వాల్సి ఉన్నా.. ఆపని చేయకుండా సిబ్బంది తమ జేబులో వేసుకున్నారు. స్పెషల్ కోడె భక్తులకు టికెట్‌పై ఇచ్చే ఉచిత లడ్డూను కౌంటర్ సిబ్బంది రీసైక్లింగ్ చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. ఇండెంట్ ప్రకారం ప్రసాదాల గోదాం నుంచి స్పెషల్ టికెట్ల సంఖ్యకు అనుగుణంగా లడ్డూలు కేటాయిస్తారు. ఆ తర్వాత మిగతా ప్రసాదాల విభాగానికి లడ్డూలు అందజేస్తారు. ఈక్రమంలో భక్తులకు ఇవ్వని ఉచిత లడ్డూ ఎక్కడికి వెళ్తోందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సమ్మక్క– సారలమ్మ జాతర సమీపిస్తోంది. ఈక్రమంలో రాజన్నను దర్శించుకునేందుకు భక్తులు వేలసంఖ్యలో తరలివస్తున్నారు. రద్దీ దృష్ట్యా స్వామివారిని దర్శించుకుని, మొక్కులు చెల్లించుకుని వెనువెంటనే తిరుగుపయనమవుతున్నారు. ఈక్రమంలో రూ.200 విలువైన స్పెషల్ కోడె టికెట్‌ను ఆలయ అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే ఈటికెట్ ఇచ్చే కౌంటర్ ఒకచోట ఉంటే... టికెట్‌పై ఉచితంగా ఇచ్చే లడ్డూ ప్రసాదం కౌంటర్‌ను మరోచోట ఏర్పాటు చేశారు. ఈవిషయం తెలియని భక్తులు.. లడ్డూ తీసుకోకుండానే వెళ్లిపోతున్నారు. అయితే రూ.100 కోడె టికెట్లు ఇచ్చిన చోటనే లడ్డూ ప్రసాదం అందించడం గమనార్హం. కొందరు భక్తులు మాత్రం ఇదేమిటని ప్రశ్నిస్తే.. ప్రచార శాఖలో లడ్డూలు ఇస్తున్నారని ఆ తర్వాత సిబ్బంది చెప్పడం గమనార్హం. జెల్ది ఇంటికి పోదామని రెండువందల రూపాయల కోడెల టికెట్టు దీసుకున్నం. దీనిమీద ఉచితంగా లడ్డూ ఇస్తమని రాసిండ్రు. దీనిగురించి కౌంటర్ల అడిగితే.. అక్కడిత్తరని, ఇక్కడిత్తరని జెప్పిం డ్రు. ఎక్కడ తిరిగినా లడ్డూ ఇయ్యలే. మాలాంటోళ్లను గిట్ల గోసవెట్టుడు మంచిదిగాదు. అధికారులు స్పందించి అందరికీ లడ్డూలు ఇప్పించాలె. – రామవ్వ, భక్తురాలు, నర్సంపేట ఇండెంట్ ప్రకారం లడ్డూలు మాకు ఇచ్చిన ఇండెంట్ ప్రకారం కౌంటర్లకు లడ్డూలు అందజేస్తాం. అక్కడివారు వాటిని ఏం ఎలా పంపిణీ చేస్తున్నారో మాకు తెలియదు. దీనిని పర్యవేక్షించాల్సిన అధికారులు వేరు. మేం కేవలం లడ్డూలు అందిస్తాం. అయితే కోడెల టికెట్ ఇచ్చే కౌంటర్ వద్ద కాకుండా మరోచోట ప్రసాదాలు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశారట. అలాగే ప్రచారశాఖలోనూ లడ్డూ ప్రసాదాలు అందజేస్తున్నారు. కానీ భక్తులకు ఇది అందుబాటులో లేదు. ఉన్నతాధికారులు దీనిపై చర్య తీసుకోవాలి. – రాజేశం, ప్రసాదాల గోదాం ఇన్చార్జి -
రాజన్న హుండీలో పాతనోట్ల కట్టలు
కరీంనగర్: కేంద్ర ప్రభుత్వం రూ.500, రూ.వెయ్యి నోట్లను రద్దు చేయడంతో దేవుళ్ల హుండీకీ డిమాండ్ పెరిగింది. చాలామంది భక్తులు రద్దైన రూ. 500, రూ. వెయ్యి నోట్లను హుండీలో కానుకలుగా సమర్పిస్తున్నారు. దీంతో అన్నీ ఆలయాల హుండీలు పాత నోట్ల కట్టలతో కళకళలాడుతున్నాయి. తాజాగా వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ హుండీలో ఇద్దరు అజ్ఞాత వ్యక్తులు లక్షల్లో పాత నోట్లను వేశారు. ఓ వ్యక్తి రూ.500, రూ. వెయ్యి నోట్లతో రూ.4.50 లక్షలు, మరో అజ్ఞాత వ్యక్తి పాత రూ.వెయ్యి నోట్లతో లక్ష రూపాయలను హుండీలో వేయడం సంచలనం కలిగించింది.