ఆ డైరెక్టర్‌తో సాయిధరమ్‌ తేజ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌.. | Sai Dharam Tej Movie With Director Sampath Nandi | Sakshi
Sakshi News home page

Sai Dharam Tej: భారీ బడ్జెట్‌తో సాయిధరమ్ తేజ్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌..

Published Mon, Jun 20 2022 10:40 AM | Last Updated on Mon, Jun 20 2022 10:45 AM

Sai Dharam Tej Movie With Director Sampath Nandi - Sakshi

Sai Dharam Tej Movie With Director Sampath Nandi: తనదైన శైలీలో సినిమాలతో అలరిస్తున్నాడు యంగ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్. ఇటీవల రిపబ్లిక్ మూవీతో సందడి చేసిన సాయిధరమ్‌ తేజ్‌ కొత్త ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. సాయి ధరమ్‌ తేజ్‌, దర్శకుడు సంపత్‌ నంది కాంబినేషన్‌లో ఓ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ మూవీ తెరకెక్కనుంది. హై ఓల్టేజ్‌ యాక్షన్‌గా రూపొందనున్న ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్మెంట్‌ సంస్థ నిర్మించనుంది. 

సంపత్‌ నంది మార్క్‌ ఆఫ్‌ స్టైల్‌తో సాయితేజ్‌ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో రూపొందనున్న ఈ సినిమా స్క్రిప్ట్‌ వర్క్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్‌ను స్టార్ట్‌ చేయాలనే ఆలోచనలో ఉంది చిత్రయూనిట్‌. కాగా కార్తీక్‌ అనే కొత్త దర్శకుడితో ప్రస్తుతం సాయిధరమ్‌ తేజ్‌ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

చదవండి:👇
లారెన్స్‌ బిష్ణోయ్‌ ముఠా హిట్‌ లిస్ట్‌లో కరణ్‌ జోహార్‌..
మరో పెళ్లి చేసుకోబోతున్న సీనియర్‌ హీరో నరేష్‌ !
వికటించిన సర్జరీ.. గుర్తుపట్టలేని స్థితిలో హీరోయిన్‌
సినిమా సెట్‌లో ఇద్దరు నటులు మృతి.. ఆరుగురికి గాయాలు
చెత్త ఏరిన స్టార్‌ హీరోయిన్‌.. వీడియో వైరల్‌
సాయి పల్లవి వివరణపై ప్రకాశ్‌ రాజ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement