బెంగాళ్ టైగర్ సినిమా తరువాత చాలా రోజులుగా కాలీగా ఉన్న దర్శకుడు సంపత్ నంది, మరో సినిమాకు రెడీ అవుతున్నాడు. చాలా రోజులుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కోసం ఎదురుచూసిన ఈ మాస్ డైరెక్టర్ ఇప్పట్లో చెర్రీ డేట్స్ దొరికే అవకాశం లేకపోవటంతో మరో హీరోతో సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు. ఇన్నాళ్లు చరణ్ తో చోటా మేస్త్రీ అనే మాస్ ఎంటర్ టైనర్ చేయాలని భావించినా అది వర్క్ అవుట్ కాకపోవటంతో గోపిచంద్ హీరోగా మొదలు పెట్టాలని భావిస్తున్నాడు.
ప్రస్తుతం సూర్య మూవీస్ అధినేత ఏఎమ్ రత్నం తనయుడు జ్యోతి కృష్ణ దర్శకత్వంలో ఆక్సిజన్ సినిమాలో నటిస్తున్నాడు గోపి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి కావచ్చింది. దీంతో త్వరలో సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాను పట్టాలెక్కించాలని భావిస్తున్నాడు గోపిచంద్. ఈ సినిమాను ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి ఫాంలో ఉన్న ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్మించనుంది.
సంపత్ నందితో గోపిచంద్
Published Sat, Jul 2 2016 2:14 PM | Last Updated on Mon, Sep 4 2017 3:59 AM
Advertisement
Advertisement