దుబాయ్ వెళ్తోన్న 'గౌతమ్నంద' | Gautham nanda Heading to Dubai | Sakshi
Sakshi News home page

దుబాయ్ వెళ్తోన్న 'గౌతమ్నంద'

Published Wed, Mar 15 2017 2:00 PM | Last Updated on Tue, Sep 5 2017 6:10 AM

దుబాయ్ వెళ్తోన్న 'గౌతమ్నంద'

దుబాయ్ వెళ్తోన్న 'గౌతమ్నంద'

మాస్ హీరో గోపిచంద్ లోని స్టైలిష్ యాంగిల్ను పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్న సినిమా గౌతమ్నంద. కమర్షియల్ సినిమాల స్పెషలిస్ట్ సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టాకీ పార్ట్ షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం గౌతమ్నంద యూనిట్ సాంగ్స్ షూట్ కోసం దుబాయ్ వెళ్లనుంది. ఈ షెడ్యూల్లో రాజు సుందరం కొరియోగ్రఫిలో గోపిచంద్ ఇంట్రడక్షన్ సాంగ్తో పాటు మరో పాటను చిత్రీకరించనున్నారు.

దుబాయ్ షెడ్యూల్ పూర్తయిన తరువాత హైదరాబాద్లో మిగిలిన పాటలను పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ప్రారంభించనున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన స్టిల్స్కు సూపర్ రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో.. తెర మీద గోపిచంద్ను మరింత స్టైలిష్గా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను శ్రీ బాలాజీ సినీ మీడియా సంస్థ నిర్మిస్తోంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి మేలో గౌతమ్నందను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement