Simbaa: Jagapathi Babu First Look Poster Out From Simbaa Movie - Sakshi
Sakshi News home page

Simbaa: ప్రకృతి తనయుడిగా జగపతిబాబు.. ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ వైరల్‌

Published Sun, Jun 5 2022 1:49 PM | Last Updated on Sun, Jun 5 2022 3:57 PM

Jagapathi Babu First Look Poster Out From Simbaa Movie - Sakshi

జగపతిబాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘సింబా’. ‘ది ఫారెస్ట్ మ్యాన్’ అనేది ట్యాగ్ లైన్. ఈ సైన్స్ ఫిక్షన్‌ థ్రిల్లింగ్‌ సబ్జెక్ట్ కు డైరెక్టర్‌ సంపత్‌ నంది కథను అందించగా.. మురళీ మనోహర్‌ రెడ్డి దర్శకత్వం వహించాడు. సంప‌త్ నంది టీమ్ వ‌ర్క్స్  స‌మ‌ర్ప‌ణ‌లో రాజ్ దాస‌రి ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై సంపత్‌నంది, రాజేందర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని  ఆదివారం(జూన్‌ 5) ఫస్ట్‌ లుక్‌ని విడుదల చేశారు మేకర్స్‌. ఈ చిత్రంలో జగపతిబాబు  ప్రకృతి తనయుడిగా అద్భుతమైన పాత్రను పోషిస్తున్నారు. అడవుల్లో నివసించే మాచోమ్యాన్‌గా జగపతిబాబును ఈ చిత్రంలో చూపిస్తున్నారు సంపత్‌నంది.

ఫస్ట్ లుక్‌ పోస్టర్‌లో జగపతిబాబు భుజాలమీద చెట్లను మోసుకుంటూ వెళ్లడం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. 'ప్రకృతి తనయుడు ఇతడు... జగపతిబాబుగారిని సింబాగా పరిచయం చేయడానికి ఆనందిస్తున్నాం. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఫారెస్ట్ మ్యాన్‌ సింబాను పరిచయం చేస్తున్నాం’ అని మేకర్స్ రాసిన వ్యాఖ్యలు అట్రాక్ట్ చేస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన మరిన్న వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని చిత్రబృందం తెలిపింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement