యాక్షన్ బ్యాంకాక్ | Hansika With Gopichand in Sampath Nandi's Next | Sakshi
Sakshi News home page

యాక్షన్ బ్యాంకాక్

Published Wed, Sep 21 2016 12:02 AM | Last Updated on Mon, Sep 4 2017 2:16 PM

యాక్షన్ బ్యాంకాక్

యాక్షన్ బ్యాంకాక్

 గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో శ్రీ బాలాజీ సినీ మీడియా పతాకంపై జె.భగవాన్, జె.పుల్లారావు నిర్మిస్తున్న సినిమా ఫస్ట్ షెడ్యూల్ ఈ నెల 22న బ్యాంకాక్‌లో మొదలవుతోంది. నిర్మాతలు మాట్లాడుతూ - ‘‘మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది. బ్యాంకాక్‌లో నెలరోజుల పాటు చిత్రీకరణ జరుపుతాం. హీరో ఇంట్రడక్షన్, ఇంటర్వెల్, కీలక యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నాం.
 
  భారీ తారాగణం, కార్లు, గుర్రాలతో యాక్షన్ అడ్వంచరస్‌గా ఉంటుంది. హీరోయిన్లు హన్సిక, క్యాథరిన్, విలన్లు ముకేష్ రుషి, నికితన్ ధీర్, కమెడియన్ వెన్నెల కిశోర్ సహా సుమారు 70మంది నటీనటులు ఈ షెడ్యూల్‌లో పాల్గొంటారు. భారీ బడ్జెట్, హై టెక్నికల్ వాల్యూస్‌తో నిర్మిస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి కళ: కడలి బ్రహ్మ, కూర్పు: గౌతమ్‌రాజు, యాక్షన్: రామ్-లక్ష్మణ్, సంగీతం: ఎస్.ఎస్.తమన్.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement