గోపిచంద్ కోసం ఇద్దరు హీరోయిన్లు | Sampath Nandi Gets Two Heroines For Gopichand | Sakshi
Sakshi News home page

గోపిచంద్ కోసం ఇద్దరు హీరోయిన్లు

Published Sat, Jul 16 2016 7:42 PM | Last Updated on Mon, Sep 4 2017 5:01 AM

గోపిచంద్ కోసం ఇద్దరు హీరోయిన్లు

గోపిచంద్ కోసం ఇద్దరు హీరోయిన్లు

లౌక్యం, జిల్ సినిమాలతో ట్రాక్ ఎక్కినట్టే కనిపించిన మాస్ హీరో గోపిచంద్ సౌఖ్యం సినిమాతో మరోసారి నిరాశపరిచాడు. యాక్షన్ డ్రామాలను పక్కనపెట్టి కామెడీ మీద దృష్టి పెట్టిన ఈ టాల్, స్టార్ ప్రస్తుతం జ్యోతి కృష్ణ దర్శకత్వంలో ఆక్సిజన్ సినిమాలో నటిస్తున్నాడు. చాలా రోజులు తరువాత స్టార్ ప్రొడ్యూసర్ ఏఎం రత్నం నిర్మిస్తున్న సినిమా కావటంతో ఆక్సిజన్పై మంచి అంచనాలే ఉన్నాయి. అందుకు తగ్గట్టుగా భారీ స్టార్ కాస్ట్తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

ఆక్సిజన్ సెట్స్ మీద ఉండగానే తను చేయబోయే నెక్ట్స్ సినిమాపై క్లారిటీ ఇచ్చేశాడు గోపిచంద్. రచ్చ, బెంగాళ్ టైగర్ సినిమాల సక్సెస్తో మాస్ సినిమాల స్పెషలిస్ట్గా పేరు తెచ్చుకున్న సంపత్ నంది దర్వకత్వంలో సినిమా చేయడానికి అంగీకరించాడు. ఇప్పటికే కథా కథనాలు కూడా ఫైనల్ అయిన ఈ సినిమాకు నటీనటుల ఎంపిక కూడా జరుగుతోంది. ఈ సినిమాలో గోపిచంద్ ఆడిపాడేందుకు ఇద్దరు ముద్దుగుమ్మలను ఫైనల్ చేశారు సంపత్ నంది.

సరైనోడు సినిమా సక్సెస్తో మంచి ఫాలో ఉన్న కేథరిన్ థెరిస్సా తొలిసారిగా గోపిచంద్తో జతకడుతుండగా, కోలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఉన్న హన్సికను మరో హీరోయిన్గా ఫిక్స్ చేశారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement