గబ్బర్ సింగ్ మళ్లీ గుర్రం ఎక్కేస్తున్నాడు | Gabbar singh sequel being planned soon | Sakshi
Sakshi News home page

గబ్బర్ సింగ్ మళ్లీ గుర్రం ఎక్కేస్తున్నాడు

Published Sat, Oct 12 2013 1:04 AM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

గబ్బర్ సింగ్ మళ్లీ గుర్రం ఎక్కేస్తున్నాడు - Sakshi

గబ్బర్ సింగ్ మళ్లీ గుర్రం ఎక్కేస్తున్నాడు

గత ఏడాది బాక్సాఫీస్ వద్ద ‘గబ్బర్‌సింగ్’ చేసిన హడావిడి అంతా ఇంతాకాదు. పాత రికార్డులన్నింటినీ సాధ్యమైనంతవరకూ ఆ సినిమాతో తుడిచిపెట్టేశారు పవర్‌స్టార్. ప్రస్తుతం ‘అత్తారింటికి దారేది’తో మరోసారి పెను సంచలనానికి తెరలేపారాయన. టాలీవుడ్‌లో వంద కోట్ల క్లబ్‌లో చేరబోయే తొలి సినిమాగా ‘అత్తారింటికి దారేది’ని చెప్పుకుంటున్నారంటే... ఈ సినిమా సాధించిన విజయం స్థాయి ఏంటో అర్థం చేసుకోవచ్చు. 
 
 ఈ గ్రాండ్ సక్సెస్‌ని ఓ పక్క ఎంజాయ్ చేస్తూనే... మరోపక్క తన తర్వాతి చిత్రాన్ని సెట్స్‌కి పైకి తీసుకెళడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు పవర్‌స్టార్. సంపత్‌నంది దర్శకత్వంలో శరత్‌మరార్ నిర్మించనున్న ఈ చిత్రం ఈ దసరాకే సెట్స్‌కి వెళ్లాల్సింది. కొన్ని కారణాల రీత్యా ఈ నెలాఖరు నుంచి చిత్రీకరణ మొదలు పెట్టాలనుకుంటున్నారు. ‘గబ్బర్‌సింగ్’కు ధీటైన కథను ఈ సినిమా కోసం సంపత్‌నంది సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. దీనికి ‘గబ్బర్‌సింగ్-2’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. 
 
 ఇందులో పవర్‌స్టార్‌తో జతకట్టే నాయిక విషయంలో పలువురి పేర్లు ఇప్పటికే వినిపిస్తున్నాయి. ప్రముఖంగా ప్రణీత పేరు ఎక్కువగా వినిపిస్తోంది. అయితే... ఇవన్నీ కరెక్ట్ కాదని విశ్వసనీయ సమాచారం. ఓ బాలీవుడ్ కథానాయిక పవన్‌కి జతకట్టనుందని తెలుస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్న విషయం తెలి సిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement