
జూలై 16న 'గౌతమ్ నంద' ఆడియో
మాస్ హీరో గోపీచంద్, హ్యాట్రిక్ డైరెక్టర్ సంపత్ నందిల కాంబినేషన్లో తెరకెక్కుతున్న సూపర్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ 'గౌతమ్ నంద'. హన్సిక, కేతరీన్లు కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీబాలాజీ సినీ మీడియా పతాకంపై జె.భగవాన్, జె.పుల్లారావ్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా జూలై 28న విడుదలవుతుండగా.. ఎస్.ఎస్.తమన్ సంగీత సారధ్యంలో రూపొందిన ఆడియోను జూలై 16న హైద్రాబాద్ లోని జె.ఆర్.సి కన్వెక్షన్ సెంటర్లో పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా నిర్వహించనున్న వేడుకలో విడుదల చేయనున్నారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు జె.భగవాన్, జె.పుల్లారావ్లు మాట్లాడుతూ.. 'జూలై 28న సినిమా విడుదలకు అన్నీ సిద్ధం. ఇప్పటికే టీజర్, సాంగ్ ప్రోమోస్కి విశేషమైన స్పందన లభిస్తోంది. తమన్ ట్రెండీ మ్యూజిక్ అందించారు, ఆడియో విడుదల వేడుకను ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. గోపీచంద్ స్టైలిష్ లుక్స్, సంపత్ నంది స్టైలిష్ టేకింగ్, టీజర్ మరియు పోస్టర్కు విశేషమైన స్పందన లభిస్తుండడంతో సినిమాను కూడా అంతకుమించిన స్థాయిలోనే ఆదరిస్తారనే నమ్మకం ఉంది' అన్నారు.