
ఈ మధ్య తమన్నాకు కాస్త తీరిక చిక్కితే చాలు.. కబడ్డీ కబడ్డీ అని నాన్‌స్టాప్‌గా చెబుతూ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఎందుకంటే గ్రౌండ్‌లో ప్రత్యర్థి ఒడిసి పట్టుకుంటే, వదిలించుకుని వెళ్లేవరకూ కబడ్డీ కబడ్డీ అనాలి కదా... కాదు కాదు ప్లేయర్స్‌తో అనిపించాలి కదా. విషయం ఏంటంటే.. గోపీచంద్ సరసన తమన్నా ఓ సినిమాలో కథానాయికగా నటించబోతున్నారు కదా. ఇందులో ఈ బ్యూటీ కబడ్డీ కోచ్ పాత్ర చేయబోతున్నారట. సినిమాలో కబడ్డీ ప్లేయర్స్‌కు కోచింగ్ ఇవ్వడానికి ముందు తాను కబడ్డీ గురించి తెలుసుకుంటున్నారట తమన్నా. సంపత్ నంది దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రం షూటింగ్ త్వరలో ఆరంభం కానుంది. శ్రీనివాసా చిట్టూరి నిర్మాత. ఈ చిత్రానికి ‘సీటీ మార్’ అనే టైటిల్‌ని అనుకుంటున్నారని సమాచారం.