మాస్‌లో కొత్త కోణం!
గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో శ్రీ బాలాజీ సినీ మీడియా పతాకంపై జె.భగవాన్, జె.పుల్లారావులు నిర్మిస్తున్న చిత్రం సోమవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. దేవుని పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి శరత్ మరార్ కెమేరా స్విచాన్ చేయగా, గోపీచంద్ క్లాప్ ఇచ్చారు. నిర్మాత సుధాకర్ రెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. భగవాన్, పుల్లారావు మాట్లాడుతూ- ‘‘గోపీచంద్‌లో మాస్ యాంగిల్‌ను సరికొత్తగా ఆవిష్కరించే చిత్రమిది.
భారీ బడ్జెట్, ఉన్నత సాంకేతిక విలువలతో నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తు న్నారు. హన్సిక, క్యాథరిన్ హీరో యిన్లుగా నటిస్తున్నారు’’ అన్నారు. ‘‘కమర్షియల్ హంగులతో కూడిన హై ఓల్టేజ్ మాస్ ఎంటర్‌టైనర్ ఇది’’ అని సంపత్ నంది తెలిపారు. తమన్, క్యాథరిన్ తదితరులు పాల్గొన్నారు. ముఖేశ్ రుషి, నికితన్ ధీర్, అజయ్, వెన్నెల కిశోర్ నటిస్తున్న ఈ చిత్రానికి ఆర్ట్: బ్రహ్మ కడలి, ఎడిటింగ్: గౌతంరాజు, యాక్షన్: రామ్-లక్ష్మణ్.