Producer Sudhakar Reddy
-
మాస్లో కొత్త కోణం!
గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో శ్రీ బాలాజీ సినీ మీడియా పతాకంపై జె.భగవాన్, జె.పుల్లారావులు నిర్మిస్తున్న చిత్రం సోమవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. దేవుని పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి శరత్ మరార్ కెమేరా స్విచాన్ చేయగా, గోపీచంద్ క్లాప్ ఇచ్చారు. నిర్మాత సుధాకర్ రెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. భగవాన్, పుల్లారావు మాట్లాడుతూ- ‘‘గోపీచంద్‌లో మాస్ యాంగిల్‌ను సరికొత్తగా ఆవిష్కరించే చిత్రమిది. భారీ బడ్జెట్, ఉన్నత సాంకేతిక విలువలతో నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తు న్నారు. హన్సిక, క్యాథరిన్ హీరో యిన్లుగా నటిస్తున్నారు’’ అన్నారు. ‘‘కమర్షియల్ హంగులతో కూడిన హై ఓల్టేజ్ మాస్ ఎంటర్టైనర్ ఇది’’ అని సంపత్ నంది తెలిపారు. తమన్, క్యాథరిన్ తదితరులు పాల్గొన్నారు. ముఖేశ్ రుషి, నికితన్ ధీర్, అజయ్, వెన్నెల కిశోర్ నటిస్తున్న ఈ చిత్రానికి ఆర్ట్: బ్రహ్మ కడలి, ఎడిటింగ్: గౌతంరాజు, యాక్షన్: రామ్-లక్ష్మణ్. -
అంతా రెడీ..!
ఇప్పటికే ‘మనం’ సినిమాతో జనం ముందుకొచ్చేశారు అఖిల్. ఇక హీరోగా అలరించడమే తరువాయి. అక్కినేని అభిమానులందరూ ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆ శుభతరుణం కోసం ఇప్పటికే రంగం సిద్ధం చేసేశారట అక్కినేని నాగార్జున. నవంబర్ ద్వితీయార్ధంలో అఖిల్ సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరుపనున్నట్లు విశ్వసనీయ సమాచారం. మాస్‌ను మంత్రముగ్ధులను చేసే చిత్రాలను తెరకెక్కించే వీవీ వినాయక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు తెలిసింది. ఇప్పటికే కథ కూడా ఫైనల్ అయ్యిందని వినికిడి. హీరోయిజాన్ని అత్యంత శక్తిమంతంగా ఆవిష్కరించడంలో వినాయక్ దిట్ట. మరి హీరోగా నటిస్తున్న తొలి సినిమాలో అఖిల్‌ని ఆయన ఏ స్థాయిలో చూపిస్తారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. నితిన్ తండ్రి - నిర్మాత సుధాకరరెడ్డి నిర్మాణంలో, అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో ఈ చిత్రం రూపొం దనుందని సమాచారం. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.