
సంపత్ నంది-తమన్నా కాంబినేషన్‌లో రచ్చ, బెంగాల్ టైగర్ లాంటి సూపర్ హిట్ చిత్రాలు వచ్చిన సంగతి తెలిసిందే. అలాగే గోపిచంద్‌తో గౌతమ్ నందా అనే ఓ చిత్రాన్ని సంపత్ నంది తెరకెక్కించాడు. తాజాగా ఈ ముగ్గురి కాంబోలో ఓసినిమా పట్టాలెక్కుతోంది.
మ్యాచో హీరో గోపీచంద్ హీరో గా మాస్ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వంలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ "ప్రొడక్షన్ నెం.3" గా శ్రీనివాసా చిట్టూరి నిర్మించనున్న భారీ చిత్రంలో తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. మిగతా వివరాలను త్వరలోనే ప్రకటించనున్నట్లు నిర్మాత తెలిపారు.