పర్ఫెక్ట్‌ కోచ్‌ | Thamannaah As Jwala Reddy In Seetimaarr | Sakshi
Sakshi News home page

పర్ఫెక్ట్‌ కోచ్‌

Published Sat, Mar 14 2020 12:54 AM | Last Updated on Sat, Mar 14 2020 12:54 AM

Thamannaah As Jwala Reddy In Seetimaarr - Sakshi

తమన్నా

‘జ్వాల’ క్యారెక్టర్‌ను ఓ చాలెంజ్‌గా తీసుకున్నానంటున్నారు తమన్నా. గోపీచంద్‌ హీరోగా సంపత్‌ నంది దర్శకత్వంలో ‘సీటీమార్‌’ అనే చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో తెలంగాణ మహిళల కబడ్డీ జట్టు  కోచ్‌ జ్వాల పాత్రలో నటిస్తున్నారు తమన్నా. ఈ పాత్ర కోసం తాను సిద్ధమవుతున్న విధానం గురించి తమన్నా మాట్లాడుతూ– ‘‘నా కెరీర్‌లో తొలిసారి ఓ స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌ సినిమా చేస్తున్నాను. కబడ్డీ ప్లేయర్స్‌కు కోచ్‌గా నేను నటిస్తానని అస్సలు ఊహించలేదు. జ్వాల పాత్రను పర్ఫెక్ట్‌గా చేసేందుకు ఫుల్‌గా ప్రిపేర్‌ అవుతున్నాను.

తెలంగాణ యాస నేర్చుకోవడాన్ని ఓ సవాల్‌గా తీసుకున్నాను.వీగన్‌ (శాకాహారి)గా మారిపోయి గ్లూటెన్‌ డైట్‌ ఫాలో అవుతూ యోగా కూడా చేస్తున్నాను. కోచ్‌గా నా హావభావాలు, బాడీ లాంగ్వేజ్‌ పర్ఫెక్ట్‌గా ఉండేందుకు జాగ్రత్త పడుతున్నాను. సంపత్‌ నంది సూచనలతో పాటు మా సెట్లో ఉన్న జాతీయ స్థాయి కబడ్డీ ప్లేయర్స్‌ సలహాలను తీసుకుంటున్నాను. ‘జ్వాల’ క్యారెక్టర్‌ ప్రేక్షకులకు గుర్తుండిపోవాలనే ఇంతలా కష్టపడుతున్నాను’’ అని పేర్కొన్నారు తమన్నా. ఈ సిని మాలో ఆంధ్రా మహిళల కబడ్డీ జట్టు కోచ్‌గా కనిపించనున్నారు గోపీచంద్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement