నరేష్, తమన్, బీవీఎస్‌ఎన్ ప్రసాద్, రాశీ ఖన్నా, వెంకీ అట్లూరి, వరుణ్ తేజ్, ప్రియదర్శి, అల్లు అరవింద్, ‘దిల్’ రాజు, బాపినీడు
‘‘ప్రసాద్‌గారికి, నాకు మంచి అనుబంధం ఉంది. ‘మగధీర’ సినిమాకు ఆయన కో–ప్రొడ్యూసర్. పవన్‌కల్యాణ్‌తో ‘అత్తారింటికి దారేది’ సినిమా తీసిన ప్రసాద్‌గారు ఇప్పుడు పవన్ టైటిల్ ‘తొలి ప్రేమ’తో వరుణ్‌తో సినిమా చేయడం ఆనందంగా ఉంది. ఆ ‘తొలిప్రేమ’తో పవన్‌కి ఎంత పేరొచ్చిందో.. ఈ ‘తొలిప్రేమ’ పెద్ద హిట్ అయి వరుణ్‌కి అంతే మంచి పేరు వస్తుంది’’ అని నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. వరుణ్‌తేజ్, రాశీఖన్నా జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో బీవీఎస్‌ఎన్. ప్రసాద్ నిర్మిస్తున్న సినిమా ‘తొలిప్రేమ’. ఎస్.ఎస్.తమన్ స్వరపరచిన ఈ సినిమా పాటలను అల్లు అరవింద్ విడుదల చేశారు.
‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘ఫిదా’ సినిమాకి ముందు ‘తొలిప్రేమ’ చిత్రాన్ని వెంకీ మా బ్యానర్‌లో చేయాల్సింది. కానీ, ‘ఫిదా’ కారణంగా తను బాపినీడుకి కథ వినిపించడం, ఆయనకు నచ్చడంతో సినిమా ఓకే అయ్యింది. మా బ్యానర్‌లో చేయాల్సిన సినిమా వారి బ్యానర్‌లో చేశారనే కారణంతో బాపినీడు ఈ సినిమా టోటల్ రైట్స్‌ను నాకు ఇచ్చేశాడు. ఇలాంటి విషయాలు అరుదుగా జరుగుతుంటాయి’’ అన్నారు. ‘‘ఈ సినిమా చేస్తున్నప్పుడు ఆరు నెలల వరకు ఏ టైటిల్ పెడదామని ఆలోచించాం. ‘తొలిప్రేమ’ టైటిల్ పెడదామని వెంకీ అన్నారు.
నాకు ఇష్టమున్నా కాస్త భయపడ్డాను. ఆ టైటిల్ పెట్టుకుని ఏమైనా తేడా వస్తే మనకు పగిలిపోద్ది అన్నాను. ఎందుకంటే అది బాబాయ్‌కి ఐకానిక్ మూవీ. మా పెదనాన్న, బాబాయ్ వేసిన ఈ ఫౌండేషన్‌ను పాడు చేయకుండా మంచి సినిమాలు చేస్తాం’’ అన్నారు వరుణ్‌తేజ్. ‘‘నేను ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో నన్ను నమ్మిన వ్యక్తి, ఇండస్ట్రీని నన్ను నమ్మేలా చేసిన వ్యక్తి ‘దిల్’ రాజుగారు. ఎక్కడో కాన్ఫిడెన్స్ కోల్పోతున్న నాకు ఆరు అడుగుల నాలుగు అంగుళాల ధైర్యాన్నిచ్చాడు వరుణ్. నా నమ్మకానికి ఊపిరి పోసిన వ్యక్తి బాపినీడు. నాకు సపోర్ట్ చేసిన అందరికీ థ్యాంక్స్’’ అన్నారు వెంకీ అట్లూరి. రాశీఖన్నా, తమన్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment