పదేళ్ల ప్రేమ కథే ఈ చిత్రం | Varun Tej, Rashikhanna is new film shooting started hyderabad. | Sakshi
Sakshi News home page

పదేళ్ల ప్రేమ కథే ఈ చిత్రం

Published Sun, Jun 18 2017 12:24 AM | Last Updated on Tue, Sep 5 2017 1:52 PM

పదేళ్ల ప్రేమ కథే ఈ చిత్రం

పదేళ్ల ప్రేమ కథే ఈ చిత్రం

వరుణ్‌ తేజ్, రాశీఖన్నా జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది.  జ్యోతిర్మయి గ్రూప్స్‌ చిత్ర సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీయస్‌యన్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ఎస్‌.ఎస్‌. తమన్‌ స్వరకర్త. హైదరాబాద్‌లో శనివారం ప్రారంభమైన ఈ చిత్రం తొలి సన్నివేశానికి సంగీత దర్శకులు ఎమ్‌.ఎమ్‌. కీరవాణి క్లాప్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా మెగా బ్రదర్‌ నాగబాబు మాట్లాడుతూ– ‘‘మంచి రచయిత అయిన వెంకీ అట్లూరి... వరుణ్‌ తేజ్‌తో యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ తెరకెక్కించనున్నాడు.

చిత్రబృందానికి ఆల్‌ ది బెస్ట్‌. ఈ సినిమా పెద్ద సక్సెస్‌ కావాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు. ‘బీవీయస్‌యన్‌ ప్రసాద్, బాపీనీడు నిర్మాతలుగా ఈ సినిమా చేయడం చాలా హ్యాపీగా ఉంది.  వెంకీ అట్లూరి నా ఫ్రెండ్‌. ఒక ప్రేమకథ లోని పదేళ్ళ ప్రయాణమే ఈ సినిమా. రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌. మంచి టీమ్‌ కలిసి చేస్తున్న మంచి ప్రయత్నమిది అన్నారు’’ వరుణ్‌తేజ్‌. వెంకీ అట్లూరి మాట్లాడుతూ–‘‘దర్శకుడిగా నా తొలి చిత్రాన్నే వరుణ్‌ లాంటి హీరోతో ఇంత పెద్ద బ్యానర్‌లో చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా:జార్జి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement