![Priya Prakash Varrier to be Ranveer Singh's leading lady? - Sakshi](/styles/webp/s3/article_images/2018/03/12/Priya-Prakash-Varrier-Heigh.jpg.webp?itok=WkUJwsjJ)
ప్రియాప్రకాశ్ వారియర్
‘ఒక్క ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది.. ఒక్క సినిమా హిట్ అయితే ఓవర్ నైట్ స్టార్ అయిపోవచ్చు’.. కానీ.. ఒక్క చూపుతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయారు మాలీవుడ్ బ్యూటీ ప్రియాప్రకాశ్ వారియర్. ‘ఒరు అదార్ లవ్’ మలయాళ చిత్రం ట్రైలర్‌లో ప్రియ కన్నుకొట్టే సన్నివేశానికి ఎంతటి స్పందన వచ్చిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆ సినిమా ఇంకా విడుదల కాకముందే టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ ప్రియకు అవకాశాలు తలుపుతడుతున్నాయి. తాజాగా రణ్‌వీర్ సింగ్ సరసన నటించే అవకాశం ప్రియా ప్రకాశ్‌ని వరించిందని బాలీవుడ్ టాక్.
తెలుగు హిట్ మూవీ ‘టెంపర్’ కి రీమేక్‌గా బాలీవుడ్‌లో ‘శింబా’ మూవీ తెరకెక్కుతోంది. రణ్‌వీర్ సింగ్ హీరోగా రోహిత్‌శెట్టి దర్శకత్వంలో కరణ్ జోహార్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. రణ్‌వీర్‌కి జోడీగా అలనాటి అందాలనటి శ్రీదేవి తనయ జాన్వీ నటించనున్నారంటూ బాలీవుడ్‌లో వార్తలు హల్‌చల్ చేశాయి. తాజాగా ప్రియాప్రకాశ్ పేరు తెరపైకి వచ్చింది. ‘శింబా’ చిత్రవర్గాలు ప్రియను సంప్రదించాయట. అయితే.. తొలి సినిమా ‘ఒరు అదార్ లవ్’ విడుదల వరకూ ఏ సినిమా ఒప్పుకోకూడదనే ఒప్పందం కారణంగా ఆమె ఇంకా గ్రీన్‌సిగ్నల్ ఇవ్వలేదని టాక్.
Comments
Please login to add a commentAdd a comment