స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్.. సీనియర్ హీరో జగపతి బాబు పదిహేనేళ్ల తరువాత కలిసి పనిచేస్తున్నారు. పూరి దర్శకుడిగా పరిచయం అయిన కొత్తలో జగపతిబాబు హీరోగా బాచీ అనే సినిమాను తెరకెక్కించాడు. అయితే ఈ సినిమా ఫ్లాప్ కావటంతో వచ్చిన సంగతే ఎవరికీ గుర్తులేదు. ఆ తరువాత జగపతిబాబు హీరోగా రిటైరయి ప్రస్తుతం విలన్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సూపర్ ఫాంలో ఉన్నాడు.
పూరి కూడా స్టార్ డైరెక్టర్గా మంచి రేంజ్ లో ఉన్నాడు. అందుకే ఇన్నేళ్ల తరువాత మరోసారి ఈ కాంబినేషన్ వెండితెర మీద కనిపించనుంది. కళ్యాణ్ రామ్ హీరోగా పూరి తెరకెక్కిస్తున్న సినిమాలో జగపతిబాబు కీలకపాత్రలో నటిస్తున్నాడు. టెంపర్ సినిమా సమయంలో పోసాని కృష్ణమురళి చేసిన పాత్ర తనకు ఎంతో ఇష్టమని అలాంటి పాత్ర చేస్తానని ప్రకటించటంతో, జగ్గుభాయ్ కోసం ఓ స్పెషల్ క్యారెక్టర్ను డిజైన్ చేశాడు పూరి.
15ఏళ్ల తర్వాత కలిసి పని చేస్తున్నారు
Published Fri, May 27 2016 9:52 AM | Last Updated on Fri, Mar 22 2019 1:53 PM
Advertisement
Advertisement