► ‘టెంపర్’ సినిమాలో పోసాని కృష్ణమురళి స్ట్రిక్ట్ పోలీసాఫీసర్‌గా చేశారు. చిత్రదర్శకుడు పూరి జగన్నాథ్ ఈ పాత్రకు ముందు వేరే నటుణ్ణి అనుకున్నారు. అతనెవరో తెలుసా?
ఎ) సూర్య బి) రాజీవ్ కనకాల సి) ఆర్. నారాయణమూర్తి డి) శివాజీ
► మషేశ్ బాబు మొట్టమొదట తెరపై కనిపించిన సినిమాకు దర్శకుడు ఎవరు?
ఎ) దాసరి నారాయణరావు బి) బి.గోపాల్ సి) కె. రాఘవేంద్రరావు డి) కోడి రామకృష్ణ
► ‘తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో..’ పాటలో నాగార్జునతో పాటు రొమాన్స్ చేసిన బాలీవుడ్ భామ ఎవరో గుర్తుందా?
ఎ) సుస్మితా సేన్ బి) టబు సి) మనీషా కొయిరాల డి) సోనాలి బింద్రే
► ‘అడవి రాముడు’ సినిమాకి ఎన్టీఆర్‌తో పాటు దాదాపు అంతే పారితోషికం అందుకొన్న నటుడెవరో తెలుసా? (చిన్న క్లూ: ఆ నటుడి తమ్ముళ్లు ఇప్పుడు సినిమాల్లో నటిస్తున్నారు )
ఎ) కైకాల సత్యనారాయణ బి) మాడా సి) రాజబాబు డి) కొంగర జగ్గయ్య
► ఈ నలుగురిలో ఓ నటుడికి 17 సార్లు ఫిలిం ఫేర్ అవార్డు దక్కింది. అతనెవరో చెప్పగలరా?
ఎ) చిరంజీవి బి) కమల్‌హాసన్ సి) మమ్ముట్టి డి) రజనీకాంత్
► శ్రుతీహాసన్, రకుల్ ప్రీత్‌సింగ్, అమలాపాల్ ఒకే ఏడాది కథానాయిక అయ్యారు. ఆ సంవత్సరం ఏంటో చెప్పగలరా?
ఎ) 2008 బి) 2009 సి) 2010 డి) 2006
► ‘మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా’ అనే డైలాగును ‘ఇంద్ర’ సినిమాలో చిరంజీవి ఏ నటుణ్ణి ఉద్దేశించి చెప్పారు?
ఎ) జయప్రకాశ్ రెడ్డి బి) ప్రకాశ్‌రాజ్ సి) ముఖేష్ రుషి డి) తనికెళ్ల భరణి
► రామ్‌గోపాల్ వర్మ చదివిన సిద్ధార్ధ కాలేజీలోనే ఈ హీరో కూడా డిగ్రీ పూర్తి చేశారు? అతనెవరో తెలుసా?
ఎ) ర వితేజ బి) నాగార్జున సి) ప్రభాస్ డి) వెంకటేశ్
► ఇతను చాలా అవార్డులు గెలుచుకున్న కెమెరామేన్. తర్వాత కాలంలో సంచలన దర్శకుడు కూడా? అతనెవరు?
ఎ) బి. గోపాల్ బి) వీవీ వినాయక్ సి) తేజ డి) గుణశేఖర్
► ఆదిత్య 369’ చిత్రంలో ‘జాణవులే నెరజాణవులే..’ పాట పాడిన గాయని ఎవరు?
ఎ) ఎస్.జానకి బి) జిక్కి సి) పి. సుశీల డి) చిత్ర
► లేటెస్ట్ సెన్సేషన్ ‘అర్జున్ రెడ్డి’ సినిమాను దర్శకుడు సందీప్ రెడ్డి ఏ హీరోతో తీయాలనుకున్నారో తెలుసా?
ఎ) శర్వానంద్ బి) నిఖిల్ సి) రామ్ డి) అఖిల్
► ‘ప్రతిఘటన’లో పదునైన సంభాషణలుంటాయి. ఆ మాటలు ఏ రచయిత కలం నుంచి వచ్చాయో తెలుసా?
ఎ) పరుచూరి బ్రదర్స్ బి) మరుధూరి రాజా సి) తనికెళ్ల భరణి డి) యం.వి.ఎస్. హరనాథరావు
► మాఫియా డాన్ అబూ సలేం ప్రేయసిగా వార్తలోకెక్కిన మోనికా బేడిని తెలుగు తెరకు పరిచయం చేసిన దర్శకుడెవరో చెబుతారా?
ఎ) ముత్యాల సుబ్బయ్య బి) ముప్పలనేని శివ సి) సురేశ్ కృష్ణ డి) ఎ. మోహనగాంధి
► రాధ, రాధిక, రేవతి.. ఈ ముగ్గురివీ ఒరిజినల్ పేర్లు కాదు. ‘ఆర్’ అక్షరం వచ్చేట్లు వీరికి స్క్రీన్ నేమ్ పెట్టిన దర్శకుడు ఎవరు?
ఎ) కె.బాలచందర్ బి) భాగ్యరాజ సి) భారతీరాజా డి) బాలు మహేంద్ర
► నటుడు రానా ట్విట్టర్ ఐడీ ఏంటో చెప్పుకోండి చూద్దాం!
ఎ) రానా దగ్గుబాటి బి) యువర్స్ రానా సి) ఐయామ్ రానా డి) మీ రానా
► పాటల రచయిత సుద్దాల అశోక్ తేజకు, నటుడు ఉత్తేజ్‌కు చుట్టరికం ఉంది? అశోక్ తేజకు ఉత్తేజ్ ఏమవుతాడు?
ఎ) బావమరిది బి) మేనల్లుడు సి) తమ్ముడు డి) కొడుకు వరుస
► ఈ ఫోటోలోని బుడతణ్ణి గుర్తు పట్టగలరా?
ఎ) శర్వానంద్ బి) సందీప్ కిషన్ సి) అల్లరి నరేష్ డి) ఆర్యన్ రాజేష్
► జయప్రద, శ్రీదేవి నటించిన ఈ స్టిల్ ఏ సినిమాలోనిది?
ఎ) దేవత బి) బంగారక్క సి) భోగభాగ్యాలు డి) అనురాగాలు
► సినిమా షూటింగ్ ప్రారంభం రోజున కొబ్బరికాయ కొడతారు. చివరి రోజున ఏ కాయను కొట్టి ముగిస్తారు?
ఎ) నిమ్మకాయ బి) బత్తాయికాయ సి) గుమ్మడి కాయ డి) పనసకాయ
► ఏ ప్రముఖ వ్యక్తి జీవిత చరిత్రను ‘దసరాబుల్లోడు’పుస్తక రూపంలో విడుదల చేశారు?
ఎ) అక్కినేని నాగేశ్వరరావు బి) డి. రామానాయుడు సి) వీబీ రాజేంద్రప్రసాద్ డి) యస్వీ రంగారావు
మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే...మీకు సినిమా అంటే ఇష్టం
10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్
15 సమాధానాల వరకూ చెప్పగలిగితే...మీకు సినిమా అంటే పిచ్చి
20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి!
సమాధానాలు
1) సి 2) ఎ 3) సి 4) డి5) బి 6) బి 7) సి 8) ఎ9) సి 10) బి 11) ఎ 12) డి 13) బి 14) సి 15) ఎ16) బి 17) సి 18) ఎ 19) సి 20) సి