ఎప్పటికీ హీరోగానే కొనసాగుతా..! | r narayanamurthy about rejecting Puri Jagannath temper | Sakshi
Sakshi News home page

ఎప్పటికీ హీరోగానే కొనసాగుతా..!

Published Fri, Jan 6 2017 4:14 PM | Last Updated on Fri, Mar 22 2019 1:53 PM

ఎప్పటికీ హీరోగానే కొనసాగుతా..! - Sakshi

ఎప్పటికీ హీరోగానే కొనసాగుతా..!

విప్లవ చిత్రాలతో పీపుల్స్ స్టార్గా గుర్తింపు తెచ్చుకున్ననటుడు ఆర్.నారాయణమూర్తి. కొంత కాలంగా సక్సెస్ ఫుల్ చిత్రాలను అందించలేకపోతున్న ఆర్ నారాయణమూర్తి ఈ సారి కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. హెడ్ కానిస్టెబుల్ వెంకట్రామయ్య చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తోన్న నారాయణమూర్తి సినిమా ప్రమోషన్లో భాగంగా ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

ఖైదీ నంబర్ 150, గౌతమీపుత్ర శాతకర్ణి లాంటి భారీ చిత్రాలు రిలీజ్ అవుతున్న సంక్రాంతి సీజన్లో సినిమాను రిలీజ్ చేస్తున్న పీపుల్స్ స్టార్.. భవిష్యత్తులోనూ హీరోగానే కొనసాగుతానే తప్ప క్యారెక్టర్ రోల్స్ చేయనని ప్రకటించాడు. అందుకే టెంపర్ సినిమాలో పూరి జగన్నాథ్ ఇచ్చిన పాత్రను తిరస్కరించానని తెలిపాడు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చిన్న సినిమాలకు థియేటర్లు దొరికే పరిస్థితి లేదని చిన్న సినిమాను పూర్తిగా తొక్కేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చదలవాడ శ్రీనివాస రావు తెరకెక్కిస్తున్న ఈసినిమాలో జయసుథ, నారాయణమూర్తి భార్యగా నటిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement